నింగిలోకి దూసుకెళ్లిన Aditya L1.. నాలుగు నెలల ప్రయాణం తర్వాత L1 పాయింట్‌కు చేరనున్న ఇస్రో తొలి సౌర మిషన్‌..!

చంద్రయాన్‌-3 విజయం అనంతరం ఇస్రో మరో కీలక ప్రాజెక్టును చేపట్టింది. సూర్యుడిపై పరిశోధనలకు తొలి సౌర మిషన్‌ ఆదిత్య L1ను ప్రయోగించింది. ఈ మిషన్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్ స్పేస్‌ సెంటర్లో శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

ఈ ఉదయం 11:50 నిమిషాలకు PSLV C57 రాకెట్‌ ఆదిత్య L1ను నింగిలోకి తీసుకెళ్లింది. ఆదిత్య L1 నాలుగు నెలలపాటు ప్రయాణం చేసి సూర్యుడి దిశగా లాగ్రాంజ్‌ పాయింట్‌ (L1)ను చేరుకోనుంది. ఇది భూమి నుంచి సుమారుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది.

Aditya L1 launched successfully

ఈ పాయింట్‌ వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. ఫలితంగా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిపై నిరంతరం పరిశోధనలు చేసి, కీలక సమాచారం సేకరించాలని ఇస్రో భావిస్తోంది. ఆదిత్య L1లో 7 కీలక పరికరాలను అమర్చారు. ఇందులో ఉన్న కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణంపై పరిశోధన చేయనున్నారు.

ఆదిత్య ఎల్‌1లో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలీస్కోప్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజీ ఫర్‌ ఆదిత్య, హై ఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, సోలార్‌ ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మాగ్మెటోమీటర్‌ వంటి పేలోడ్‌లున్నాయి. సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని తట్టుకొనే విధంగా వీటిని రూపొందించారు.

Aditya L1 launched successfully

ఆదిత్య ఎల్‌1 వ్యోమనౌకలో మొత్తం 7 రకాల పరికరాలను అమర్చారు. ఇవి సూర్యుడి ఫోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌ సహా కరోనా బయటి పొరను ఇవి అధ్యయనం చేయనున్నాయి. ఈ సమాచారాన్ని తిరిగి భూమిపైకి పంపిస్తాయి. ఇప్పటి వరకు అమెరికా, జపాన్‌, చైనా, యూరప్‌ సూర్యుడి అధ్యయనం కోసం అంతరిక్ష నౌకలను పంపాయి. ఈ జాబితాలో భారత్‌ చేరింది.

సూర్యుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం. అందువల్ల సూర్యుడిపై అధ్యయనం చేయడం ద్వారా ఇతర నక్షత్రాల స్వభావం గురించి తెలుసుకోవచ్చని ఇస్రో భావిస్తోంది. ఇది పాలపుంతలోని ఇతర నక్షత్రాలు, గ్రహాల గురించి సరైన సమాచారం తెలుసుకోవచ్చని ఇస్రో భావిస్తోంది.

Aditya L1 launched successfully

ఆదిత్య L1ను తొలుత భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెడతారు. అనంతరం దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పంపిస్తారు. అనంతరం ఎల్‌1 పాయింట్‌ వైపు ఆదిత్య L1 ప్రయాణం సాగేలా చర్యలు తీసుకుంటారు. భూమి గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతాన్ని దాటి వెళ్తుంది. ఆ తర్వాత క్రూజ్‌ దశ ప్రారంభం అవుతుంది. 125 రోజుల ప్రయాణం తర్వాత లాంగ్రేజీ పాయింట్‌కు చేరుకుంటుంది.

ఆదిత్య L1లో ఉన్న విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్... నిమిషానికి ఒక్కో ఫోటోను పంపుతుంది. అంటే రోజుకు 1440 ఫోటోలను పంపుతుంది. ఇది 5 సంవత్సరాలు పాటు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు భూమిపైనుంచి సూర్యుడిపైన పరిశోధనలు చేసిన ఇస్రో.. ఇప్పటి నుంచి సూర్యుడికు చేరువలో పరిశోధనలు చేయనుంది.

Aditya L1 launched successfully

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, September 2, 2023, 12:48 [IST]
English summary
Isro first sun mission aditya l1 launched successfully
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+