ప్రపంచపు అతి ఉత్తమ రాకెట్ పిఎస్‌ఎల్‌వీ వరుస విజయాలకు కారణం ఏమిటి ?
ప్రపంచ దేశాలు కలిగి ఉన్న రాకెట్లన్నింటిలో ఇండియన్ ఇస్రోకు చెందిన పిఎస్‌ఎల్‌వీ ఎంతో ఉత్తమమైనది. దీని విజయ పరంపరలో దానికదే ప్రత్యేకంగా నిలుస్తూ వచ్చింది. పిఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా నిర్వహిస్తూ వచ్చిన ప్రయోగాలలో ఇప్పటి వరకు రెండు మాత్రమే విఫలం చెందాయి. 93.1 శాతం విజయం రేటుతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల మన్ననలు పొందుతోంది.
ప్రపంచ దేశాలకు చెందిన రాకెట్లను కక్ష్యలో ప్రవేశపెట్టడంలో దిట్ట ఈ పిఎస్‌ఎల్‌వీ రాకెట్. నేటి ఉదయం (జూన్ 22, 2016) 9:26 లకు పిఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ఒకేసారి 20 శాటిలైట్లతో శ్రీహరి కోటలోని రాకెట్ లాంచింగ్ కేంద్రంలో ప్రయోగించారు. దీనితో పిఎస్‌ఎల్‌వీ మరో మైలు రాయిని చేధించింది. పిఎస్‌ఎల్‌వీ-సి34 గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

ఇండియన్ ఇస్రో నేడు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులోని శ్రీహరి కోటలో రాకెట్ లాంచింగ్ కేంద్రం నుండి పిఎస్‌ఎల్‌వీ-సి34 రాకెట్ ద్వారా 17 విదేశీయ ఉపగ్రహాలతో పాటు మొత్తం 20 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రయోగించారు.

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C34) ప్రాథమిక మొత్తం బరువు కార్టోశాట్-2 సరీస్‌తో కలుపుకుని మొత్తం 320 టన్నుల పిఎస్‌ఎల్‌వీ-సి34 రాకెట్ సరిగ్గా ఉదయం 9:26 గంటలకు కక్ష్యలోకి ప్రయోగించబడింది.

ఇస్రో ప్రయోగించిన 17 విదేశీ శాటిలైట్లలో అమెరికా, కెనడా, జర్మనీ మరియు ఇండోనేషియాలకు చెందినవి ఉన్నాయి.

కక్ష్యలోకి వెళ్లిన శాటిలైట్లలో రిమెట్ సెన్సింగ్ సర్వీసెస్, ఎర్త్ అబ్జర్వేషన్ మరియు ఇమాజింగ్ శాటిలైట్లు వంటి వాటికి చెందినవి ఉన్నాయి.

పిఎస్‌ఎల్‌వీ-సి34 ద్వారా 20 శాటిలైట్లతో పాటు వెళ్లిన కార్టోశాట్-2 ఉదయం సరిగ్గా 9:44 లకు కక్ష్యలోకి చేరుకుంది. దీని బరువు 727.5 కిలోలుగా ఉంది.

మొత్తం 1288 కిలోల బరువుతో ప్రయోగించబడిన పిఎస్‌ఎల్‌వీ-సి34 రాకెట్ 17 నిమిషాల తరువాత కక్ష్యలోకి శాటిలైట్లను ప్రవేశపెట్టింది.

ప్రపంచ దేశాలు ఇండియన్ ఇస్రో వారి పిఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశ పెట్టడానికి గల కారణాలు మరియు పిఎస్‌ఎల్‌వీ విజయం వెనకున్న ముఖ్యమైన విషయాలు తరువాత స్లైడర్ల ద్వారా తెలుసుకుందాం రండి.

1.
పిఎస్‌ఎల్‌వీ రాకెట్ లాంచింగ్ వెహికల్ ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనది. అయితే కొన్ని రష్యాకు చెందిన విడి పరకరాలను కూడా వినియోగించారు. దీని పొడవు 44 మీటర్లు, చుట్టు కొలత 2.8 మీటర్లుగా ఉంది. ఇది గరిష్టంగా 295 టన్నుల వరకు బరువులను మోసుకెళ్లగలదు.

2.
ప్రతి రాకెట్‌లో కూడా ఆరు బూస్టర్లు ఉంటాయి ( రాకెట్ పైకి దూసుకెళ్లడానికి ఇవి ఉపయోగపడుతాయి, వీటిని రాకెట్ అడుగు భాగంలో అమర్చుతారు). మొదటి నాలుగు బూస్టర్లు మాత్రమే మండి రాకెట్ ప్రయాణానికి సహాయపడుతాయి. తరువాత 25 సెకండ్ల అనంతరం మిగిలిన రెండు బూస్టర్లు మండుతాయి.

3.
ఆధునిక పిఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో (పిఎస్‌ఎల్‌వీ-ఎక్స్ఎల్) ప్రతి బూస్టర్ సుమారుగా 720కిలోన్యూటన్ థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే తేజాస్ ఫైటర్ జెట్‌లోని టర్బో ఫ్యాన్ (జిఇ- ఎఫ్404) ఉత్పత్తి థ్రస్ట్ కన్నా 9.2 రెట్లు అధికంగా ఉంటుంది.

పిఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో నాలుగు స్టేజ్‌లు ఉంటాయి. మొదటి స్టేజ్ 4,800 కిలోన్యూటన్ థ్రస్ట్. మిగిలిన రెండు, మూడు, మరియు నాలుగవ స్టేజ్‌లలో వరుసగా 800, 240, మరియు 15.2 కిలోన్యూటన్ థ్రస్ట్ ఉత్పత్తి అవుతుంది.

5.
మొదటి సారిగా ఇదే పద్దతిలో ప్రయోగించినప్పిటికి 1993లో ఫెయిల్ అయ్యింది. అయినప్పటికి దీని ప్రేరణతో తరువాత ఎన్నో విజయాలు సాధ్యమయ్యాయి.

6.
పిఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రపంత వ్యాప్తంగా ఎంతో నమ్మదగినది మరియు చాలా చౌకైనది కూడా. 2014 ఏడాది వరకు పిఎస్‌ఎల్‌వీ ద్వారా స్వదేశీ కన్నా విదేశీ శాటిలైట్లనే ఎక్కువగా ప్రయోగించడం జరిగింది.అందులో 40 విదేశీ మరియు 31 స్వదేశీ శాటిలైట్లున్నాయి.

7.
ప్రస్తుతం వరకు పిఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించిన 40 విదేశీ రాకెట్లు ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, యూరప్ దేశాలు, ఇండోనేషియా. అర్జెంటీనా, ఇటలీ, ఇజ్రాయెల్, కెనడా, జపాన్, నెథర్లాండ్స్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, టర్కీ, అల్జీరియా, నార్వే, ఆస్ట్రియా, సింగపూర్, రష్యా మరియు ఇంగ్లాండ్ వంటి దేశాలకు చెందినవిగా ఉన్నాయి.

8.
పిఎస్‌ఎల్‌వీ (పిఎస్‌ఎల్‌వీ-సి9) రాకెట్ ద్వారా ప్రయోగించిన గరిష్ట శాటిలైట్ల సంఖ్య 10 గా ఉంది, మరియు తాజాగా పిఎస్‌ఎల్‌వీ సి34 రాకెట్ ద్వారా 20 శాటిలైట్లను ఒకేసారి ప్రయోగంచారు.

పిఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించిన 29 లాంచింగ్‌లలో కేవలం రెండు మాత్రమే ఫెయిల్ అయ్యాయి. దీని ద్వారా పిఎస్‌ఎల్‌వీ సక్సెస్ రేట్ 93.1 శాతముగా ఉంది.

ఇది సుమారుగా 3.2 టన్నుల పే లోడ్‌తో, నిమిషానికి 7.8 కిలోమీటర్ల వేగంతో (Mach 4540) నింగిలోకి దూసుకెళ్లగలదు.

దీని సగటు ధర సుమారుగా 90 కోట్లు రుపాయలుగా ఉంది (15 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది)

పిఎస్‌ఎల్‌వీ ఈ జూన్‌లో అమెరికాకు చెందిన ఒకటి మరియు బ్రిటిష్‌కు చెందిన మూడు శాటిలైట్లను ప్రయోగించనుంది. వచ్చే డిసెంబర్‌లో మరో రెండు స్వ దేశీ శాటిలైట్లను ప్రయోగించనుంది.

ఇండియన్ ఇస్రో గురించి 20 ముఖ్య విషయాలు
కిరోసిన్ ఇంధనంతో ఇస్రో రాకెట్లు:
ఇండియన్ ఇస్రో దాటికి బెంబేలెత్తుతున్న అమెరికా


Click it and Unblock the Notifications








