ఇస్రో ఖాతాలో మరో సక్సెస్‌.. నింగిలోకి దూసుకెళ్లిన INSAT 3DS శాటిలైట్‌, ఈ మిషన్‌ ప్రయోజనాలివే.!!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో.. ఈరోజు మరో అద్భుత ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. INSAT 3DS ఉపగ్రహాన్ని మోసుకెళ్లే GSLV F14 రాకెట్‌ను ఇస్రో ఇవాళ విజయవంతంగా ప్రయోగించింది. ఇది మెటిరియోలాజికల్‌ విభాగానికి చెందిన ఉపగ్రహంగా ఇస్రో పేర్కొంది. ఇది GTO కక్ష్యలో నుండి భూమిని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ.. సంబంధించిన డేటాను తిరిగి భూమికి ప్రసారం చేస్తుంది.

INSAT అనే ఉపగ్రహాల శ్రేణిని భారత్‌లో వాతావరణ శాఖ సిద్ధం చేసి ప్రయోగిస్తోంది. ఇప్పటికే ఇన్‌శాట్‌ 3D, 3DR ఉపగ్రహాలను ప్రయోగించగా, నేడు ఇస్రో(ISRO) GSLV F14 రాకెట్ ద్వారా INSAT 3DSను శ్రీహరి కోట వేదికగా ఈ రోజు సాయంత్రం విజయవంతంగా ప్రయోగించి మరో దిగ్విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ISRO-INSAT-3DS-GSLV-F14-Launch

ఈ INSAT 3D ఉపగ్రహం GTO అని పిలువబడే భూ కక్ష్యలో ఉంటూ.. భూమిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. భూభాగం, సముద్ర ఉపరితలం, ఆటుపోట్లు, మహాసముద్రాల్లో మార్పులను గుర్తించి, సమాచారాన్ని తిరిగి భూమికి అందిస్తుంది. తద్వారా భూమిపై ప్రకృతి వైపరీత్యాలు మరియు వాతావరణ పరిస్థితుల గురించి స్పష్టమైన సమాచారాన్ని పొందవచ్చు.

INSAT 3DS ఉపగ్రహాన్ని ఇస్రో తన GSLV F14 రాకెట్‌లో ప్రయోగించింది. ఇస్రో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సరిగ్గా ఈ రోజు సాయంత్రం 5:35 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్ మొత్తం మూడు దశలుగా విభజించబడింది. రాకెట్‌లో సాలిడ్ ప్రొపల్షన్, లిక్విడ్ ప్రొపల్షన్, క్రయోజెనిక్ ప్రొపల్షన్ అనే మూడు దశలు ఉంటాయి.

ISRO-INSAT-3DS-GSLV-F14-Launch

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు ఇన్‌శాట్ -3డీఎస్‌ను జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 రాకెట్‌ మోసుకెళ్లింది. లిఫ్టాఫ్ అయిన 18 నిమిషాల తర్వాత, మూడు-దశల రాకెట్ వాతావరణ ఉపగ్రహాన్ని 253 కి.మీ జియోసింక్రోనస్ బదిలీ కక్ష్యలో ఉంచారు.

కాగా ఇస్రోకు ఇది మొదటి ప్రయోగం కాదు. ఇలాంటి ప్రయోగాలు ఇప్పటివరకూ చాలా చేపట్టింది. ఇప్పటివరకు 15 సార్లు GSLV రాకెట్‌ను మోసుకెళ్లగా.. తాజా రాకెట్‌తో కలిపి ఇది 16 వ ప్రయోగం. మిషన్‌ విజయవంతంపై ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడారు. ఈ విజయం అంతరిక్ష సంస్థకు ఎక్కువ విశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

ISRO-INSAT-3DS-GSLV-F14-Launch

రాకెట్‌లో ఇమేజర్ మరియు సౌండర్ పేలోడ్‌లు, డేటా రిలే ట్రాన్స్‌పాండర్లు, శాటిలైట్ ఎయిడెడ్ SAR ట్రాన్స్‌పాండర్‌లు ఉంటాయి. క్లౌడ్ ప్రాపర్టీస్, పొగమంచు, వర్షపాతం, మంచు కవచం, లోతు, అగ్ని, పొగ, భూమి మరియు సముద్రం వంటి వాటిని అధ్యయనం చేయడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.

ఇన్‌శాట్‌ 3DS GSLV F14 లాంచ్‌ను చూసేందుకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పంపిణీ చేశారు. సుమారుగా 5000 మంది గ్యాలరీకి వచ్చి ఈ మిషన్‌ ప్రయోగాన్ని వీక్షించారు. సైన్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇస్రో చేపట్టే ప్రయోగాలపై విద్యార్థుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొనడం హర్షణీయం.

కాగా ప్రస్తుతం గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకు సంబంధించి మొదటి దశ విజయవంతంగా పూర్తయింది. భూమి నుండి ముగ్గురు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపి పరిశోధనలు జరిపి.. వారిని సురక్షితంగా తీసుకురావడమే గగన్‌యాన్ మిషన్ ఉద్దేశం. ఇస్రో తదుపరి చేపట్టనున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే.

More from DriveSpark

Article Published On: Saturday, February 17, 2024, 19:43 [IST]
English summary
Isro insat 3ds gslv f14 mission successful to enhance weather forecast
Read more on: #ఇస్రో #isro
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+