భారత దేశానికి మరో గర్వకారణం: అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనున్న ఇస్రో
ఇండియన్ ఇస్రో తన జీవితంలో ఎన్నో విజయపు మైలు రాళ్లను దాటింది. తాజాగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్షంలోకి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అంతరిక్ష వాహక నౌకను అంతరిక్షలోకి ప్రవేశపెట్టనుంది. చూడటానికి విమానం తరహాలో ఉన్నప్పటికీ ఇది అంతరిక్షంలో ఖగోళానికి సంభందించి గస్తీ కాస్తుంటుంది. రీ యూజబుల్ స్పేస్ షటిల్‌ను ఇస్రో మొదటిసారిగా ప్రయోగిస్తోంది. దీనికి సంభందించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీ హరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్ ద్వారా తీర ప్రాంతానికి సమీపంలో ఇస్రో ఈ రీ యూజబుల్ లాంచ్ వెహికల్-టెక్నాలజీ డెమోనస్ట్రేటర్ (RLV-TD)ను ప్రయోగించనుంది.

దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించిన తరువాత ఈ అంతరిక్ష వాహక నౌక బెంగాల్ తీరంలోని వాస్తవిక రన్‌వే మీదకు ల్యాండ్ కానుంది.

పరిమాణం పరంగా చూస్తే ఇది అతి పెద్ద పరిమాణంలో ఉన్న స్పెషల్ యుటిలిటి వాహనానం (ఎస్‌యువిని) ని పోలి ఉంటుంది.

దీనిని ఒక సారి అంతరిక్షంలోకి ప్రయోగించిన తరువాత దానిని తిరిగి వినియోగించుకునే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.

రీ యూజబుల్ అంతరిక్ష వాహక నౌకను మన మిత వ్యయ ఇండియన్ ఇస్రో ఇంజనీర్లు అతి తక్కువ ఖర్చుతో రూపొందించారు.

సాధారణంగా బరువు పరంగా దీని ఖరీదు లెక్కగడితే కిలోక 2,000 డాలర్ల వరకు ఖర్చు చేశారు. అయితే ఇది మిగతా అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఖర్చు చేసే దానికన్నా 10 రెట్లు తక్కువ.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తిరిగి వినియోగించుకోలగిలే ఈ RLV-TD అంతరిక్ష వాహక నౌకను ఈ ఏడాది వర్షాకాలంలోపు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ఇండియన్ ఇస్రో ఈ రీ యూజబుల్ అంతరిక్ష వాహక నౌకను ప్రవేశ పెట్టే మొదటి దశలో ఉంది. పూర్తి స్థాయిలో ఈ వాహక నౌకను సంసిద్దం చేయడానికి సుమారుగా 10 నుండి 15 ఏళ్ల సమయం పట్టనుంది.

అంతరిక్ష వాహక నౌకను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టడానికి రాకెట్‌లో మొదటి దశ ఇంధనంగా సాలిడ్ ఇంధనాన్ని వినియోగించనున్నారు.

ఈ RLV-TD ప్రోటోటైప్ అంతరిక్ష వాహక నౌకను అంతరిక్షంలో సుమారుగా భూ మండలం నుండి 70 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు.

RLV-TD అంతరిక్ష వాహక నౌక భూమ మీదకు ల్యాండ్ అవ్వడానికి ముందుగా, అది ఏ ప్రాంతంలో ల్యాండింగ్ అవ్వాలో అని తెలపడానికి, దాని దిశ, వేగం వంటి అంశాలను తెలుసుకోవడానికి ఇందులో థ్రస్టర్లను ఏర్పాటు చేశారు.

దేశీయ అంతరిక్ష వాహక నౌక లేదా RLV-TD అంతరిక్ష వాహక నౌకను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడానికి ఇండియన్ ఇస్రోకు ఐదేళ్ల సమయం పట్టింది.

ఈ ప్రాజెక్టు కోసం సుమారుగా 95 కోట్ల రుపాయలను ఖర్చు చేసినట్లు తెలిసింది.

ఇది శబ్దం కన్నా ఎక్కువ వేగంతో అంతరిక్షంలో పరుగులుపెడుతుందని తెలిపారు.

365 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాముల అనుభాలు విన్నారా ?

అమెరికాకు చుక్కలు చూపిస్తున్న దేశీయ స్వదేశీ పరిజ్ఞానం IRNSS : పూర్తి వివరాలు కోసం


Click it and Unblock the Notifications








