చంద్రయాన్-3, ఆదిత్యL1 తర్వాత గగన్‌యాన్ ప్రాజెక్టుపై ఇస్రో దృష్టి.. అక్టోబర్‌లోనే ట్రయల్స్..!
చంద్రయాన్-3 విజయం, ఆదిత్య L1 ప్రయోగం విజయం తర్వాత ఇస్రో కీలక ప్రాజెక్టును చేపట్టనుంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించిన గగన్‌యాన్ ప్రాజెక్టును చేపట్టనుంది. అక్బోబర్ నెలలో ఈ ప్రాజెక్టు కీలక దశకు చేరుతుందని తెలుస్తోంది. ఈ మిషన్ తొలి దశ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
ఇటీవల కాలంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఇప్పటి వరకు ఎవరు వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపైన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండ్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసింది. దీంతో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా నిలిచింది. అలాగే చంద్రుడి ఉపరితలంపైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన రష్యా, అమెరికా, చైనా తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

చంద్రయాన్-3 ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. అనంతరం ప్రజ్ఞాన్ రోవర్ సాయంత్రంలో అక్కడ కీలక పరిశోధనలు చేసింది. చంద్రుడిపైన రాత్రి ప్రారంభం కానున్న నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను సురక్షిత ప్రాంతంలో నిలిపి, స్లీ్ప్‌మోడ్‌లోకి పంపినట్లు ఇస్రో వెల్లడించింది.
సెప్టెంబర్ 2న సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య L1ను ప్రయోగించింది. ఈ రాకెట్ కక్ష్య పెంపు ప్రక్రియ కూడా విజయవంతం అయిందని ఇస్రో వెల్లడించింది. సుమారు 125 రోజులు ప్రయాణం చేసి ఆదిత్య L1.. లాంగ్రాజ్ పాయింట్‌కు చేరుకుంటుంది. సౌర తుఫాన్లు సహా సూర్యుడి వెలుపరి వాతావరణంపై అధ్యయనం చేయనుంది.
గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోని మనుషులను పంపి, పరిశోధనలు చేసి, వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురావడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా భూమిపై నుంచి ముగ్గురిని సుమారు 400 కి.మీ ఎత్తుకు తీసుకువెళ్తారు. అక్కడ మూడు రోజులపాటు పరిశోధనలు చేసి వారిని సురక్షితంగా భూమికి తీసుకువస్తారు.
అయితే మానవులను నేరుగా అంతరిక్షంలోకి పంపే ముందు ట్రయల్స్ నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది. పేలోడ్‌లు లేకుండా ఒకసారి, పేలోడ్‌లతో రెండుసార్లు రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిన తర్వాత మెరుగైన ఫలితాలు వస్తేనే వ్యోమగాములను అంతరిక్షంలోనికి పంపాలని ఇస్రో నిర్ణయించింది. ఈ ట్రయల్స్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం ఇంజిన్ సహా అన్ని భాగాల పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రత్యేక క్యాప్సూల్‌ను పరీక్ష చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లోనే హ్యుమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపి సురక్షితంగా భూమిపైకి తీసుకురావడమే లక్ష్యమని తెలుస్తోంది. తొలుత ట్రయల్స్ పూర్తి చేసి, 2025 నాటికి మానవులను అంతరిక్షంలోకి పంపాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష సంస్థ -ఇస్రో పనిచేస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








