ISRO Xposat Satellite కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో... నూతన సంవత్సరం రోజుల కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. PLSV- C58 వాహకనౌక ద్వారా XPoSat (ఎక్స్‌రే పొలరీ మీటర్ ఉపగ్రహం)ను (ISRO Xposat satellite) అంతరిక్షంలోకి పంపింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.
ఉపగ్రహం జీవితకాలం ఐదు సంవత్సరాలు : ప్రయోగించిన 21 నిమిషాలకు ఈ ఉపగ్రహం కక్ష్యలోకి చేరినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఉపగ్రహం సాయంతో ఎక్స్ రే మూలాలపై కీలక పరిశోధనలు చేయడం ఎక్స్‌పోశాట్ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ఉపగ్రహం జీవితకాలం ఐదు సంవత్సరాలు ఉంటుందని ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు.

బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాల సమాచారం : బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాల గురించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇదే తరహా ప్రయోగాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2021లో చేపట్టందని తెలిపారు. బ్లాక్ హోల్స్ నుంచి వెలువడే రేడియేషన్లను గుర్తించడం సహా వాటి కదలికలను పసిగట్టడం వంటి సమాచారాన్ని సేకరిస్తుంది.
ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ : ఈ ఎక్స్‌పోశాట్ పది రకాల పరికరాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ కూడా ఉంది. ఈ టెక్నాలజీని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసింది. భవిష్యత్‌లో భారత్ నిర్మించనున్న స్పేస్ స్టేషన్ ( అంతరిక్ష కేంద్రం ) కోసం ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని తెలుస్తోంది.

కీలక విజయాలు : గత సంవత్సరం చంద్రయాన్-3, ఆదిత్య L1 ప్రయోగాలను విజయవంతంగా ఇస్రో పూర్తి చేసింది. ఈ సంవత్సరం గగన్‌యాన్‌ను ప్రయోగాలను నిర్వహిస్తోంది. గత సంవత్సరం చివరలో గగన్‌యాన్ ట్రయల్స్‌ను ఇస్రో.. భారత నావికాదళం (ఇండియన్ నేవీ) సాయంతో విజయవంతంగా పూర్తిచేసింది.
ఆదిత్య L1 : ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెంబర్ 2 2023న ఇస్రో ఆదిత్య L1 ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ఉపగ్రహం 125 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం జనవరి 6 2024 సాయంత్రం 4 గంటలకు L1 (లాంగ్రేజీ పాయింట్) కు చేరుకుంటుందని ఇస్రో ఇటీవల వెల్లడించింది.

అక్టోబర్ 21 2023న గగన్‌యాన్ తొలిదశ టెస్టింగ్ విజయవంతంగా పూర్తిచేశారు. టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. శ్రీహరికోట నుంచి రాకెట్ దూసుకెళ్లాక.. ఇస్రో సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు అబార్డ్ సిగ్నల్‌ను పంపించారు. దీంతో సుమారు 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థ రాకెట్ నుంచి వేరు అయింది. అనంతరం 17 కిలోమీటర్ల ఎత్తు వద్ద క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ మాడ్యూల్ విడిపోయాయి.
ఈ దశ తర్వాత డ్రోన్ పారాచుట్లు తెరుచుకున్నాయి. వాటి సాయంతో క్రూ మాడ్యుల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. శ్రీహరికోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో దిగింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఇండియన్ నేవీ బృందం క్రూ మాడ్యుల్‌ను సేకరించింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








