మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌; ఇందులో విజేత ఎవరంటే?

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ యొక్క మహీంద్రా థార్ భారత మార్కెట్లో అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీగా మారింది. ఈ కారణంగానే మార్కెట్లో ఊహించని అమ్మకాలు జరిగాయి. ఇప్పటికి కూడా కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీకి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు.

మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌; ఇందులో విజేత ఎవరంటే?

ఇటీవల కాలంలోనే ఇసుజు ఇండియా కంపెనీ తన కొత్త లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ పికప్ ట్రక్ చాలా శక్తివంతమైనది. అంతే కాకుండా ఇది అనేక అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీకి కూడా ఏ మాత్రం ఆదరణ తక్కువగా లేదు.

మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌; ఇందులో విజేత ఎవరంటే?

అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌లో కొత్త వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోలో ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్ మరియు న్యూ జనరేషన్ మహీంద్రా థార్ ఎస్‌యూవీల మధ్య టగ్-ఆఫ్-వార్ జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్నంతసేపు మనంలో ఉత్సుకత ఏ మాత్రం తగ్గదు.

MOST READ:తండ్రికి నచ్చిన బైక్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్

మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌; ఇందులో విజేత ఎవరంటే?

ఈ వీడియోలో మీరు గమనించినట్లైతే ఈ రెండు వాహనాల మధ్య టగ్-ఆఫ్-వార్ ప్రారంభమవుతుంది. మొత్తం వీడియోలో ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మహీంద్రా థార్ ఎస్‌యూవీపై ఆధిపత్యాన్ని చెలాయిస్తుండటం చూడవచ్చు. ఈ కొత్త ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్ కి మహీంద్రా థార్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతుంది.

మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌; ఇందులో విజేత ఎవరంటే?

ఈ రెండు ఎస్‌యూవీల మధ్య జరిగిన ఈ టగ్ అఫ్ వార్ లో ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్, మహీంద్రా థార్ ఎస్‌యూవీని సుమారు 100 మీటర్ల దూరంలో లాగుతుంది. ఈ సమయంలో కూడా మహీంద్రా ఏ మాత్రం తన ప్రత్యర్థిని నిలువరించే లేక పోయింది. ఇక్కడ జరిగిన టగ్ అఫ్ వార్ లో ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్ విజయం సాధిస్తుంది.

MOST READ:హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌; ఇందులో విజేత ఎవరంటే?

ఈ వీడియో చూసిన తర్వాత, చాలా మంది ప్రేక్షకులకు కొత్త మహీంద్రా థార్ చాలా బలహీనంగా ఉందా అనే ప్రశ్న మనసులో మెదులుతుంది. నిజానికి ఈ వీడియోలోని కనిపిస్తున్న కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీ కాన్ఫిగర్ చేయబడలేదు. కానీ ఇజుజు వి-క్రాస్ మాత్రం చాలా వరకు అప్డేట్ చేయబడింది.

మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌; ఇందులో విజేత ఎవరంటే?

ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్ లో లిఫ్ట్ కిట్, రిమ్స్, టైర్లు మరియు ఇతర యాక్ససరీస్ చాలా వరకు మాడిఫై చేయబడ్డాయి. అంతే కాదు ఈ ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మహీంద్రా థార్ ఎస్‌యూవీ కంటే ఎక్కువ బరువు కలిగి ఉంది. డి-మాక్స్ వి-క్రాస్ బరువు 2 టన్నులు, థార్ ఎస్‌యూవీ బరువు 1.7 టన్నులు.

MOST READ:90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌; ఇందులో విజేత ఎవరంటే?

ఈ ఎస్‌యూవీల మధ్య బరువు వ్యత్యాసం వల్ల కూడా మహీంద్రాపై ఇసుజు విజయం సాధించింది. ఇసుజు వి క్రాస్ కదలడం ప్రారంభించినప్పుడు, దాని వేగం థార్ ఎస్‌యూవీ కన్నా ఎక్కువ. మహీంద్రా థార్ ఎస్‌యూవీకి 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 130 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్‌ లో మాత్రం 2.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అమర్చబడింది. ఈ ఇంజన్ 134 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల మహీంద్రా థార్ ఎస్‌యూవీ కంటే ఇసుజు డి-మాక్స్ చాలా శక్తివంతమైనదిగా ఉంది. కావున ఇందులో ఇసుజు డి-మాక్స్ విజయం సాధించింది.

MOST READ:ఫస్ట్ టైమ్ కార్ డ్రైవ్ చేయడానికి సిద్దమైన కుమార్తెతో తండ్రి ఫన్నీ [వీడియో]

మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌; ఇందులో విజేత ఎవరంటే?

మహీంద్రా థార్ ఇసుజు డి-మాక్స్ కంటే తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల ఇది ఆఫ్ రోడ్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. సాధారణంగా తేలికపాటి వాహనాలు ఆఫ్-రోడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. మహీంద్రా థార్ కి ఇప్పటికి కూడా డిమాండ్ ఉండటం వల్ల వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంది.

Image Courtesy: AutoWheels India - Cars & RoadTrips

Most Read Articles

English summary
Isuzu D Max V Cross Beats Mahindra Thar In Tug Of War. Read in Telugu.
Story first published: Friday, June 4, 2021, 16:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X