ఏనుగుకి దురదపెట్టింది, కారుతో గోక్కుంది!

By Ravi

దురద (ఇచింగ్) పెట్టితే మనిషైనా లేక ఏనుగైనా సరే గోక్కోవాల్సిందే. మనుషులైతే చేతుల్తోనే లేదంటేనే ఏదైనా వస్తువులతోను గోక్కుంటారు. అలాగే, సాధారణంగా ఏనుగులు వాటి శరీరంపై దురదపెట్టినప్పుడు భారీ చెట్లను లేదా నేలను రాచుకుంటూ వాటి దురదను తగ్గించుకుంటాయి. కానీ ఈ ఏనుగు మాత్రం విచిత్రంగా కారుతో గోక్కొని తన దురదను తీర్చుకుంది. వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చదవండి: జంతువులకు కోపం తెప్పిస్తే ఇలానే జరుగుతుంది

దక్షిణాఆఫ్రికాలోని పిలాన్స్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో ఫోక్స్‌వ్యాగన్ పోలో కారులో వెళ్తున్న ప్రయాణీకులకు ఓ ఊహించని పరిణామం ఎదురైంది. కారులోని వారంతా వైల్డ్ సఫారీలో ఉండగా అటుగా వచ్చిన ఓ ఏనుగు తన ముందు రెండు కాళ్లను పొడవుగా చాచి, పొట్టను కారు పైభాగానికేసి రుద్దుకుంది. అంతటితో ఆగకుండా కారు పక్కకు వచ్చి ముఖ భాగాన్ని కూడా కారుకేసి రుద్ది తన దురదు తగ్గించుకుంది.

ఊహించిన ఈ సంఘటనతో కారులోని వారంతా ఉక్కిరి బిక్కిరై, ఏనుగు ఏం చేసేస్తుందోనని ఊపిరి బిగపట్టుకున్నారు. ఇదిగో ఈ ఫొటోలలో మీరే ఆ సన్నివేశాన్ని చూడండి.

ఏనుగు దురద కారుతో తీరింది..

కారులో ఇద్దరు ప్రయాణీకులు (ఓ స్త్రీ, ఓ పురుషుడు) ఉన్నారు. ఆ కారుకు వెనుక మరో కారులో ఆర్మండ్ గ్రోబ్లర్ అనే ఫీల్డ్ గైడ్ ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు.

ఏనుగు దురద కారుతో తీరింది..

ఏనుగు కారుపైకి వెళ్తున్న సమయంలో తనకేం చేయాలో తెలియక చూస్తూ ఉండిపోయానని, అదృష్టవశాత్తు ఆ ఏనుగు ఎవ్వరికీ హాని కిలిగించలేదని గ్రోబ్లర్ చెప్పుకొచ్చాడు.

ఏనుగు దురద కారుతో తీరింది..

ఆ సమయంలో ఏనుగు కోపంగా లేదని, కాసేపు కారుతో తన శరీరాన్ని బాగా గోక్కున్న తర్వాత, అది అక్కడి నుంచి వెళ్లిపోయిందని గ్రోబ్లర్ తెలిపాడు.

ఏనుగు దురద కారుతో తీరింది..

జంతువులకు కోపం తెప్పిస్తే ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ లింకుపై క్లిక్ చేయండి


Photo by Armand Grobler Photography

More from DriveSpark

Article Published On: Friday, August 8, 2014, 11:33 [IST]
English summary
An elephant in Pilanesburg National Park in South Africa used a small car apparently to scratch an itch while terrifying the passengers inside. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+