జబర్దస్త్ 'పవిత్ర' కొత్త కారు కొనేసిందోచ్.. వీడియో కూడా వచ్చేసింది

తెలుగు ప్రేక్షలకు 'జబర్దస్త్' గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందిన ఈ టీవీ షో ఇప్పుడు మరింత ఆదరణ పొందింది. ఈ టీవీ షో ద్వారా ఎంతోమంది బుల్లితెరకు పరిచమై, వెంటి తేరా వరకు ఎదిగారు. ప్రస్తుతం హైపర్ ఆది, బులెట్ భాస్కర్ వంటి వారు మాత్రమే కాకుండా చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ తమ ప్రతిభను చాటుకుంటూనే ఉన్నారు. ఇందులో ఒకరు జబర్దస్త్ పవిత్ర.

ఇటీవల జబర్దస్త్ పవిత్ర ఒక కొత్త కారుని కొనుగోలు చేసింది. ఇంతకీ ఆ కొత్త కారు ఏ బ్రాండ్ కి చెందినది, దాని వివరాలు ఏమిటి అనే సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

జబర్దస్త్ 'పవిత్ర' కొత్త కారు కొనేసిందోచ్.. వీడియో కూడా వచ్చేసింది

నివేదికల ప్రకారం, జబర్దస్త్ పవిత్ర కొనుగోలు చేసిన ఈ కారు 'హ్యుందాయ్' (Hyundai) కంపెనీ యొక్క 'ఐ20' (i20) అని తెలిసింది. ఇది కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పవిత్ర తన కొత్త కారుతో రోహిణి తో పాటు కనిపిస్తుంది.

జబర్దస్త్ 'పవిత్ర' కొత్త కారు కొనేసిందోచ్.. వీడియో కూడా వచ్చేసింది

హ్యుందాయ్ ఐ 20 అనేది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఇది ఇప్పుడు అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది బ్రాండ్ యొక్క లేటెస్ట్ డిజైన్ కలిగి ఉండటానికి పియానో-బ్లాక్ మెష్‌తో కొత్త క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్‌ కలిగి ఉంది. గ్రిల్‌కు ఇరువైపులా ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, టర్న్ ఇండికేటర్స్ మరియు కార్నరింగ్ లాంప్స్ వంటివి ఉన్నాయి.

జబర్దస్త్ 'పవిత్ర' కొత్త కారు కొనేసిందోచ్.. వీడియో కూడా వచ్చేసింది

సైడ్ ప్రొఫైల్ లో 16-ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, విండో లైన్ క్రింద రన్నింగ్ క్రోమ్ స్ట్రిప్ వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో జెడ్ ఆకారపు ఎల్ఈడీ టెయిల్ లైట్స్ మరియు వేరియంట్ బ్యాడ్జింగ్‌ కూడా చూడవచ్చు. మొత్తం మీద ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుంది.

జబర్దస్త్ 'పవిత్ర' కొత్త కారు కొనేసిందోచ్.. వీడియో కూడా వచ్చేసింది

హ్యుందాయ్ ఐ20 మూడు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. ఈ మూడు ఇంజిన్స్ అద్భుతమైన పనితీరుని అందిస్తాయి.

జబర్దస్త్ 'పవిత్ర' కొత్త కారు కొనేసిందోచ్.. వీడియో కూడా వచ్చేసింది

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్‌ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్లూ లింక్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, బోస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

జబర్దస్త్ 'పవిత్ర' కొత్త కారు కొనేసిందోచ్.. వీడియో కూడా వచ్చేసింది

జబర్దస్త్ పవిత్ర కొనుగోలు చేసిన ఈ కారు కూడా మంచి కలర్ ఆప్సన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వెల్లడైంది. ఇందులో రోహిణి మరియు పవిత్ర కలిసి చేసే హంగామా కూడా చూడవచ్చు.

ఈ వీడియోలో షోరూముకి రావడం దగ్గర నుంచి కారుని డెలివరీ తీసుకోవడం వరకు కూడా చూడవచ్చు. ఇటీవల రోహిణి కూడా తన తండ్రకి ఒక కొత్త బైక్ కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చింది. దీనికి సంబంధించిన సమాచారం కూడా ఇటీవల వెల్లడైంది.

జబర్దస్త్ 'పవిత్ర' కొత్త కారు కొనేసిందోచ్.. వీడియో కూడా వచ్చేసింది

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే షో ద్వారా ఎంతోమంది సెలబ్రెటీ గుర్తింపుని పొందారు. మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా.. తమ టాలెంట్ తో చిన్న చిన్న ఆస్తులను కూడా సంపాదించుకుంటున్నారు. మొత్తం మీద ప్రతిభ వున్న వారిని గుర్తించి సమాజానికి పరిచయం చేస్తూ వారి ఉన్నతికి దోహదపడుతున్న మల్లెమాల వారు అభినందనీయులు అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు, కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు కావలసిన సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Jabardast pavitra new hyundai i 20 car details
Story first published: Thursday, October 6, 2022, 12:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X