జబర్దస్త్ 'ఇమ్యానుయేల్' కొత్త కారు కొన్నాడోచ్.. ధర రూ. 14 లక్షలు గురూ..!!
తెలుగు ప్రేక్షకులకు 'జబర్దస్త్ ప్రోగ్రాం' గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. ప్రతి వారం గురు మరియు శుక్రవారాల్లో 'ఈటీవీ' లో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాం చూడటానికి చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. అంతగా ప్రజాదరణ ప్రోగ్రాంలో ఉన్న అందరి కమెడియన్ల గురించి కూడా దాదాపు చాలామందికి తెలుసు. అయితే ఇందులో ఈ మధ్య బాగాపాపులర్ అయిన బుల్లెట్ భాస్కర్ టీమ్ మెంబర్ 'ఇమ్యానుయేల్' తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నారు.

సరైన సమయంలో అద్భుతమైన కామెడీని పండించడమే కాకుండా.. వర్షతో సాగుతున్న ప్రేమాయణం మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఈ కారణాల వల్ల ఇమ్యానుయేల్ అతి తక్కువ కాలంలోనే మంచి సెలబ్రటీ స్థాయికి ఎదిగిపోయాడు. అయితే ఇమ్యాన్యుయేల్ ఇటీవల ఒక కొత్త ఖరీదైన కారుని కొనుగోలు చేసాడు.

ఇటీవల ఇమ్యానుయేల్ కొనుగోలు చేసిన కారు 'హ్యుందాయ్' (Hyundai) కంపెనీకి చెందినట్లు తెలుస్తోంది. ఇది హ్యుందాయ్ కంపెనీ యొక్క వెన్యూ ఎస్‌యూవీ. దీని ధర ఏకంగా రూ. 14 లక్షలు అని తెలుస్తోంది. ఇది బ్రాండ్ యొక్క హై ఎండ్ వేరియంట్.

భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే తన 2022 వెన్యూ విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధరలు రూ. 7.53 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగి ఉంది.

2022 హ్యుందాయ్ వెన్యూ యొక్క ముందు మరియు వెనుక వైపున రిఫ్రెష్డ్ డిజైన్ చూడవచ్చు. ముందు బాగంలో పెద్ద పారామెట్రిక్ జ్యువెల్ గ్రిల్ డిజైన్‌తో అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్-ఎండ్, అవే స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ డిజైన్‌తో కూడిన కొత్త ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, బానెట్ క్రింది భాగంలో ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు మరియు సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన స్మోక్డ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, బంపర్ క్రింది భాగంలో సిల్వర్ స్కఫ్ ప్లేట్ వంటివి ఉన్నాయి. కావున ఇది చాలా వరకు కొత్తగా కనిపిస్తుంది.

సైడ్ ప్రొఫైల్ 16 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి. రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ ఎల్ షేప్ ర్యాప్‌రౌండ్ ఎల్ఈడి టెయిల్ లైట్లు మరియు సన్నటి ఎల్ఈడి లైట్ స్ట్రిప్ ఉంటుంది. అంతే కాకుండా సిల్వర్ కలర్ రూఫ్ రెయిల్స్ మరియు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటివి కూడా ఇందులో లభిస్తాయి.

2022 హ్యుందాయ్ వెన్యూ మొత్తం 7 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, పోలార్ వైట్, ఫాంటమ్ బ్లాక్, డెనిమ్ బ్లూ, ఫైరీ రెడ్ మరియు ఫైరీ రెడ్ విత్ బ్లాక్ రూఫ్ (డ్యూయల్-టోన్) కలర్స్. ఇమ్యానుయేల్ కొనుగోలు చేసిన కారు ఫైరీ రెడ్ కలర్ లో చూడచక్కగా ఉంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, కొత్త 2022 వెన్యూ ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్, యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అంతే కాకూండా ఇందులో 60 కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

2022 హ్యుందాయ్ వెన్యూ దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో రెండు పెట్రోల్ ఇంజన్లు (1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ & 1.0-లీటర్ పెట్రోల్) మరియు ఒక డీజిల్ ఇంజన్ (1.5-లీటర్ యూనిట్) ఉంటుంది.

ఇందులోని 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ 83 పిఎస్ పవర్ మరియు 113.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కాగా 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ 120 పిఎస్ పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 100 పిఎస్ పవర్ మరియు 240 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇదిలా ఉండగా జబర్దస్త్ షోలో ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగినట్లు తెలుస్తుంది. కాగా ఇమ్మాన్యుయేల్ కారు కొనుగోలు చేసే సమయంలో జబర్దస్త్ రోహిణి కూడా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇమ్మాన్యుయేల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసాడు. ఇందులో 'చివరకు నేను కన్న కల నిజమైంది. నా లైఫ్‌లో అనుకోలేదు ఇలాంటి రోజు వస్తుందని, ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. ఇటీవల జబర్దస్త్ పవిత్ర కూడా ఒక కొత్త కారుని కొనుగోలు చేసింది. పవిత్ర కొత్త కారు గురించి మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








