ఖరీదైన ల్యాండ్ రోవర్ కారులో సద్గురు.. తానే స్వయంగా నడుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్.. వీడియో వైరల్..
సద్గురుగా ప్రసిద్ధి చెందిన జగ్గీ వాసుదేవ్‌కి కార్లపై మక్కువ ఎక్కువ. గతంలో సద్గురు వద్ద ఉన్న కొన్ని ఖరీదైన హై ఎండ్ మోటార్‌సైకిళ్లు మరియు కార్లను చూశాం. ఆయన రోడ్డుపై వెళ్తుండగా లగ్జరీ కార్లలో కెమెరాకు చిక్కిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా సద్గురు ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 V8లో వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది.
దేశీయ మార్కెట్లో ఈ కారు విలువ రూ. 2.5 కోట్లు. ఇంత ఖరీదైన కారులో సద్గురు డ్రైవ్ చేస్తూ వెళ్తున్న వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సద్గురు పోస్ట్ చేశారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మోడల్‌ను సద్గురు మాత్రమే నడుపుతూ కనిపించారు.

తమిళనాడు కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ ప్రాంగణంలో సద్గురు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారులో చక్కర్లు కొడుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారతదేశంలోని కొంతమంది బోధకులు ధనవంతుల కంటే మంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో సద్గురు ఒకరు.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రీమియం లైఫ్ స్టైల్ లగ్జరీ SUV. ఇది ఆఫ్-రోడ్ కారు మాత్రమే కాకుండా విలాసవంతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. ఇది రెండు బాడీ స్టైల్స్‌లో అందించబడుతుంది. 3-డోర్ వెర్షన్ (డిఫెండర్ 90) మరియు 5-డోర్ వెర్షన్ (డిఫెండర్ 110)లో మార్కెట్లో అందుబాటులో ఉంది.

సద్గురు గ్యారేజీలో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వాటిలో ఒకటి డిఫెండర్ 110. ఆయన 5 డోర్ డిఫెండర్ 110 కారు మోడల్‌ని ఉపయోగిస్తున్నారు. సద్గురు నడుపుతున్న లగ్జరీ కారు శక్తివంతమైన 5.0-లీటర్ సూపర్ ఛార్జ్డ్ V8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ మోటార్ 525 PS వద్ద 625 Nm గరిష్ఠ టార్క్‌ని విడుదల చేస్తుంది.
ఈ కారు గరిష్ఠంగా గంటకు 240 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అదే విధంగా కేవలం 5.4 సెకన్లలో సున్నా నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఈ కారుకు 3.5 టన్నుల బరువును కూడా లాగగలిగే కెపాసిటీ ఉంది. టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు శక్తిని పంపే 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇందులో ఉంది.

సద్గురు వద్ద కార్ల కంటే ఎక్కువ మోటార్ సైకిళ్లు ఉన్నాయి. కాలేజీ రోజుల్లో ఆయన యమహా ఆర్టీ350 బైక్‌ని వాడే వారని గతంలో వెల్లడించారు. దీంతో పాటు 350 కిలోల బీఎమ్‌డబ్ల్యూ కె1600 జీటీ, యెస్తీ కంపెనీ బైక్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం.

సద్గురు మాత్రమే కాదు, బాబా రామ్‌దేవ్ కు కూడా కార్లపై మక్కువ ఎక్కువే. ఇటీవల బాబా రామ్ దేవ్ డిఫెండర్ 130 కారును కొనుగోలు చేశారు. ఆయన కొనుగోలు చేసిన లగ్జరీ కారు ధర రూ. 1.41 కోట్లు. బాబా రామ్‌దేవ్ తన తల్లితో కలిసి ఈ కారును నడుపుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








