ఓడ ఒరిగిపోయినా, అందులోని కార్లు మాత్రం చెక్కు చెదర్లేదు!
సుమారు 14,000ల వాహనాలను, ఇతర సామాగ్రిని తరలిస్తున్న హోయెగ్ ఒసాకా రవాణా నౌక (కార్గో షిప్) బ్రిటన్‌కు సమీపంలోని ఐల్ ఆఫ్ వైట్ అనే ప్రాంతం సముద్రంలో ఓ వైపుకు ఒరిగి పోయిన సంగతి తెలిసినదే. ఓడ అడుగు భాగం ఇసుక మేటను ఢీకొట్టుకోవటంతో, ఓడరేవుకు అతి సమీపంలో ఈ ఓడ దాదాపు 45 డిగ్రీల కోణంలో ఓ పక్కకు ఒరిగిపోయింది.
ఈ సంఘటన జనవరి 3వ తేదీన జరిగింది. ఈ నౌకలో దాదాపు 1200 లకు పైగా జాగ్వార్, ల్యాండ్ రోవర్ మరియు మినీ లగ్జరీ కార్లు ఉన్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ఓడ ఇదే దశలో ఒరిగిపోయి ఉంది. కాగా.. నావికాదళం అతి కష్టమ్మీద ఈ ఓడను నిటారుగా నిలుచుకునేలా చేసి, తిరిగి ఓడరేవుకు చేర్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇందులోని చాలా కార్లు దాదాపుగా చెక్కు చెదర్లేదు.
ఓడరేవుకు చేరుకున్న షిప్ నుంచి సురక్షితంగా బయటకు వస్తున్న కార్లను ఈ ఫొటో ఫీచర్‌లో వీక్షించండి.

ఈ ప్రమాదంలో ఓడకే పెద్ద డ్యామేజ్ ఏం కలగలేదని హోయెగ్ ఆటోలైనర్స్ అధికార ప్రతినిధి ఒకరు బిబిసితో వెల్లడించారు.

హోయెగ్ ఒసాకా కార్ ట్రాన్స్‌పోర్టర్ కంపెనీ సౌతాంప్టన్ పోర్ట్ నుంచి 1400 వాహనాలు, ఇతర వస్తువులతో ప్రయాణం ప్రారంభించింది.

ఈ రవాణా నౌకలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ తయారు చేసిన 1,200 కార్లు, 65 మినీ కార్లు మరియు దాదాపు 60-70 శాతం నిర్మాణ రంగానికి చెందిన వాహనాలు (జెసిబి లాంటివి) ఉన్నాయి.

వాస్తవానికి ఈ షిప్‌లో 5400 కార్లను తీసుకువెళ్లవచ్చు. అయితే, కేవలం 1400 వాహనాలను మాత్రమే తరలిస్తున్నప్పుడు ఇది పక్కకి ఒరిగిపోయింది.

షిప్ మునకకు సంబంధించి మొదట్లో పలు పుకార్లు వచ్చినప్పటికీ, ఇసుక మేట వల్లనే షిప్ ఒరిగిపోయినట్లు ధృవీకరించారు.

ఒడ్డుకు చేరుకున్న హోయెగ్ ఒసాకా నౌక నుంచి సేఫ్‌గా బయటకి వస్తున్న మినీ స్మాల్ కార్.

ఒడ్డుకు చేరుకున్న హోయెగ్ ఒసాకా నౌక నుంచి సేఫ్‌గా బయటకి వస్తున్న రేంజ్ రోవర్ ఎస్‌యూవీ.

ఒడ్డుకు చేరుకున్న హోయెగ్ ఒసాకా నౌక నుంచి సేఫ్‌గా బయటకి వస్తున్న జాగ్వార్ సెడాన్.

ఒడ్డుకు చేరుకున్న హోయెగ్ ఒసాకా నౌక నుంచి సేఫ్‌గా బయటకి వస్తున్న ల్యాండ్ రోవర్ ఎస్‌యూవీ.

ఒడ్డుకు చేరుకున్న హోయెగ్ ఒసాకా నౌక నుంచి బయటకి వస్తున్న ల్యాండ్ రోవర్, డోర్ భాగంలో డ్యామేజ్ అయిన దృశ్యం.


Click it and Unblock the Notifications








