జాగ్వార్ vs చికెన్; మెర్సిడెస్ బాడీ కంట్రోల్‌పై జాగ్వార్ ఫన్నీ యాడ్
ఇద్దరు టాప్ హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. సినిమాల్లో అయితే ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటుంటారు. అలాగే, రెండు టాప్ బ్రాండ్ల మధ్య పోటీ ఈ విధంగానే ఉంటుంది. ఒకరు తమ బ్రాండ్ గొప్పతనాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తే, మరొకరు ఆ బ్రాండ్ కంటే తమ బ్రాండ్ గొప్పదని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ, వీరి ప్రయత్నాలు మాత్రం చూసేవారికి నవ్వు తెప్పిస్తుంటాయి.
విషయం ఏంటంటే, ఆటోమొబైల్ రంగంలో జాగ్వార్, మెర్సిడెస్ బెంజ్‌లు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన లగ్జరీ బ్రాంచ్‌లు. ఈ బ్రాండ్ల మధ్య పోటీ ఎలా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. గతంలో, మెర్సిడెస్ బెంజ్ అభివృద్ధి చేసిన 'మ్యాజిక్ బాడీ కంట్రోల్' అనే కార్ స్టెబిలిటీ ఫీచర్‌ను పరిచయం చేసేందుకు, కంపెనీ వినూత్నంగా కోడితో ఓ ప్రకటనను తయారు చేసింది. ఇప్పుడు అదే ప్రకటనను పేరడీ చేస్తూ జాగ్వార్ ఓ కోడి, చిరుతతో మరో ఆసక్తికరమైన ప్రకటన విడుదల చేసింది.
మరి ఆ కొక్కరోకో కోడి గోల ఏంటో తెలియాలంటే, ఈ కథనం చదవాల్సిందే..!

జాగ్వార్ వర్సెస్ చికెన్ కమర్షియల్‌తో పాటుగా, ఒరిజినల్ మెర్సిడెస్ బెంజ్ చికెన్ ప్రకటనను మరియు జాగ్వార్ క్యాట్ ప్రకటనలను చూపించే సరదా వీడియోలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.
మ్యాజిక్ బాడీ కంట్రోల్ వీడియో
ముందుగా.. గతంలో మెర్సిడెస్ బెంజ్ తమ 'మ్యాజిక్ బాడీ కంట్రోల్' ఫీచర్ కోసం తయారు చేసిన ఒరిజినల్ కమర్షియల్‌ను చూద్దాం రండి. ఇందులో మెర్సిడెస్ బెంజ్ తమ ఫీచర్‌ను కోడి ద్వారా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ వీడియోని మీరు నిశితంగా గమనిస్తే, ఇందులో కోడి బాడీ కదులుతుది, కానీ తల మాత్రం కదలదు. అంటే, తమ కార్లు అంతటి సమర్థవంతమైన బాడీ కంట్రోలింగ్‌ను కలిగి ఉంటాయని చెప్పే ప్రయత్నం చేసింది మెర్సిడెస్.
జాగ్వార్ ఫన్నీ కమర్షియల్
ఇకపోతే, ఈ వీడియోలో మెర్సిడెస్ కోడి ప్రకటనను గేళి చేస్తూ, జాగ్వార్ రూపొందించిన ప్రకటనను చూడండి. ఇందులో కోడితో చూపించిన మెర్సిడెస్ బాడీ కంట్రోల్ ఫీచర్ గురించి చెప్తుంటే, ఓ చిరుత ఆ కోడిని స్వాహా చేస్తుంది. మ్యాజిక్ బాడీ కంట్రోల్ ఏంటి.. మేమైతే పులి లాంటి కార్లను తయారు చేస్తామని జాగ్వార్ చెప్పే ప్రయత్నం చేసింది.
క్యాట్స్ ఇన్ బాక్సెస్ వీడియో
జాగ్వార్ తమ కొత్త ఎఫ్-టైప్ కన్వర్టిబల్ కారు కోసం మరో ప్రకటన కూడా రూపొందించింది. క్యాట్స్ ఇన్ బాక్సెస్ (డబ్బాల్లో పిల్లులు) అనే కాన్సెప్ట్‌తో ఈ కమర్షియల్‌ను రూపొందించారు. ఇది కూడా చాలా సరదాగా ఉంటుంది. మీరు కూడా వీక్షించండి.


Click it and Unblock the Notifications








