FIA ఆసియా పసిఫిక్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ జూనియర్ టైటిల్‌ను గెలుచుకున్న జహాన్ గిల్
ఇండోనేషియాలో జరిగిన ఆసియా పసిఫిక్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో వామ్సీ మెర్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ మద్దతుతో JK మోటార్ స్పోర్ట్ డ్రైవర్‌లు విజయం సాధించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. డనౌ టోబాలో జరిగిన ఈవెంట్లో విజయం సాధించారు. చంఢీగడ్‌కు చెందిన 21 సంవత్సరాల జహాన్ సింగ్ గిల్ (Jahaan gill) ఆదివారం జరిగిన ర్యాలీలో ప్రతిష్టాత్మక FIA జూనియర్ ఆసియా పసిఫిక్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ టైటిల్ 2023ను కైవసం చేసుకున్నారు.
ఆసియా పసిఫిక్ ర్యాలీ ఛాంపియన్‌షిఫ్ ( APRC ), ఇండోనేడియా నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిఫ్ ( INRC ) ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. JK టైర్స్ మోటార్ స్పోర్ట్స్ బృందం APRCలో నేషనల్ వెహికల్స్ అప్రూవల్ క్లాస్ (NVA) మరియు INRCలోని M2 కోసం పోటిపడింది.

కేటగిరీల వారీగా 63 మంది డ్రైవర్లతో కూడిన గ్రిడ్‌లో జూనియర్లలో జహాన్ విజయం సాధించగా.. మిగిలిన ఇద్దరు జేకే టైర్ మోటార్‌స్పోర్ట్స్ డైవర్లు సుహేమ్ కబీర్, లోకేష్ గౌడ్ NVAలో సత్తాచాటారు. డొమెస్టిక్ సర్క్యూట్ సహా కూర్గ్‌లో జరిగిన జూనియర్ ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్ షిప్ విజయంతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకొని జహాన్ 8 స్థానంలో నిలిచాడు.
ఈ విజయం పట్ల జహాన్ సంతోషం వ్యక్తం చేశారు. JK టైర్ మోటార్‌స్పోర్ట్స్, వామ్సీ మెర్ల ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఇలాంటి ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం అంత తేలికైన విషయం కాదని చెప్పారు. ఇలాంటి ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు తమకు తెలుసన్నారు.
ఇలాంటి అంతర్జాతీయ ర్యాలీలో తొలిసారిగా డ్రైవింగ్ చేసిన మైసూర్‌కు చెందిన సుహేమ్ కబీర్ తన నావిగేటర్‌తో కలిగి ఉత్తమ పనితీరును కనబరిచాడు. NVA కేటగిరిలో 4 స్థానాన్ని సాధించారు. ఇండోనేషియా నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ M2 క్లాస్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న సుహేమ్.. రెండో స్థానంలో నిలిచారు.
ఈ విజయంపై సుహేమ్ స్పందించారు. తాను పాల్గొ్న్న క్లిష్టమైన ర్యాలీల్లో ఇదొకటని చెప్పారు. మరియు ఇలాంటి ప్రాంతాలపై తనకు అవగాహన తక్కువగా ఉందని చెప్పారు. స్లష్ సేజ్‌ల్లో కూడా జారేలా చేస్తుందని తెలిపారు. తన విజయంపై సుహేమ్ సంతోషం వ్యక్తం చేశారు.
బెంగళూరుకు చెందిన లోకేష్ మరియు కో డ్రైవర్ అశ్విన్ నాయక్ ప్రీమియర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌లో JK టైర్ మోటార్‌స్పోర్ట్స్ కోసం NVA విభాగంలో రెండో స్థానంలో మరియు M2లో మూడో స్థానంలో నిలిచారు. ఓవరాల్ కేటగిరిలో ఐదో స్థానంలో నిలిచారు. JK టైర్ మోటార్‌స్పోర్ట్స్ ఉత్తమ జట్టు పనితీరు అవార్డు లభించింది.
డౌన్ టోబా ర్యాలీ 12 కంకర రోడ్ల మీదుగా విస్తరించింది. అనేక మలుపులు తిరిగే పర్వత ప్రాంతాల వరకు ఉంటుంది. ప్రారంభ వేడుకలో భాగంగా శుక్రవారం.. 2.07 కి.మీ సూపర్ స్పెషల్ స్టేజ్ కోసం పోటీ పడ్డాయి. శనివారం 86.4 కి.మీ పొడవున్న 6 స్పెషల్ స్టేజ్‌లను కవర్ చేశారు. ఆదివారం మిగిలిన ఐదు స్టేజ్‌ల కోసం పోటీ నిర్వహించారు.
రిపీట్, రివర్స్ డైరెక్షన్ రోడ్లపై నిర్వహించారు. ఈ రోడ్లు డ్రైవర్లకు సవాల్ విసిరినట్లు ఉన్నాయి. జకర్తాకు చెందిన రిఫాత్ సుంగర్కర్ స్కోడా ఫాబియా evoతో పాల్గొని తొలిస్థానంలో నిలిచారు. రిజాల్ సుంకర్ రెండో స్థానంలో నిలవగా.. ఫతుర్ రహ్మాన్ మూడో స్థానంలో నిలిచారు.


Click it and Unblock the Notifications








