ఒకప్పుడు రోడ్డు ప్రక్కన గాలిపటాలు అమ్ముకునే వాడు, కానీ ఇప్పుడు....

మోడల్ మరియు ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాహుల్ తనిజా తన లగ్జరీ కారు కోసం ఏకంగా 16 లక్షలు చెల్లించాడు. జైపూర్‌కు చెందిన యంగ్ బిజినెస్ మ్యాన్ రాహులు కొత్తగా కొనుగోలు చేసిన జాగ్వార్ ఎక్స్‌జె ఎల్ లగ్జరీ కారున

By Anil Kumar

ఇండియాలో వ్యాపార వేత్తలకు, లక్షల కోట్ల ధనవంతులకు కొదవేమీ లేదు. రోడ్డు మీద పల్లీలు కొన్నంత తేలికగా లగ్జరీ కార్లను కొనేస్తుంటారు. అయితే, తమ స్టేటస్‌ను చూపించుకునేందుకు కొంత మంది ఫ్యాన్సీ నెంబర్ల కోసం లక్షల రుపాయలు కుమ్మరిస్తుంటారు. అందులో ఒకరు జైపూరుకు చెందిన ఓ మిలియనీర్.

ఫ్యాన్సీ నెంబర్ కోసం 16 లక్షలు

మోడల్ మరియు ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాహుల్ తనిజా తన లగ్జరీ కారు కోసం ఏకంగా 16 లక్షలు చెల్లించాడు. జైపూర్‌కు చెందిన యంగ్ బిజినెస్ మ్యాన్ రాహులు కొత్తగా కొనుగోలు చేసిన జాగ్వార్ ఎక్స్‌జె ఎల్ లగ్జరీ కారును భారీ మొత్తం చెల్లించి 1 నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించాడు.

ఫ్యాన్సీ నెంబర్ కోసం 16 లక్షలు

సుమారుగా 1.5 కోట్ల రుపాయలతో కొనుగోలు చేసిన జాగ్వార్ ఎక్స్‌జె ఎల్ లగ్జరీ కారును స్పెషల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఒకటిన్నర నెల ఎదురు చూశాడు. రాహుల్ ఈ కారును మార్చి 25 న కొనుగోలు చేశాడు మరియు రాజస్థాన్‌లోనే అత్యంత అరుదైన నెంబర్ కోసం అందరికంటే ఎక్కువ మొత్తానికి ఇటీవల జరిగిన వేలంలో సొంతం చేసుకున్నాడు.

ఫ్యాన్సీ నెంబర్ కోసం 16 లక్షలు

37 ఏళ్ల రాహుల్ తనిజా సొంత ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ రన్ చేస్తున్నాడు. రాహుల్‌కు నెంబర్ 1 మీద నమ్మకం ఎక్కువ. 1996లో ఓ సెకండ్ హ్యాండ్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. దాని నెంబర్ RJ14 23M 2323, ఈ నెంబర్‌ను కూడితే 1 వస్తుంది (2+3+2+3).

ఫ్యాన్సీ నెంబర్ కోసం 16 లక్షలు

నెంబర్ 1 మీద తనకున్న నమ్మకం గురించి మాట్లాడుతూ, " నేను ఏ పని చేసినా నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకుంటాను. నా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కూడా ఇండియాలోనే నెంబర్‌ వన్‌గా నిలవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు."

ఫ్యాన్సీ నెంబర్ కోసం 16 లక్షలు

జాగ్వార్‌తో పాటు తనిజా బిఎమ్డబ్ల్యూ 5-సిరీస్ కారును 2011లో కొనుగోలు చేశాడు. ఈ కారు కోసం కూడా RJ 14 CP 0001 నెంబర్‌ను సుమారుగా 10.31 లక్షలు వెచ్చించాడు. ఇదే నెంబర్‌తో 5-సిరీస్ స్థానంలో 7-సిరీస్ కారుకు అప్‌గ్రేడ్ అయ్యాడు. అంతే కాకుండా, స్కోడా లారా కారును కేవలం RJ 20 CB 0001 నెంబరు కోసం కొనుగోలు చేశాడు.

ఫ్యాన్సీ నెంబర్ కోసం 16 లక్షలు

రాహుల్ తనకు 18 ఏళ్ల వయసు వచ్చేంత వరకు రకారకాల వ్యాపారాలు చేశాడు. గాలిపటాలు, రాఖీలు, హోలీలో రంగులు, దిపావళికి టపాసులు ఇంకా రోడ్డు ప్రక్కన లెథర్ జాకెట్లు కూడా విక్రయించేవాడు. అయితే, తన 18 వ ఏట మోడలింగ్ వైపుకు అడుగులు వేశాడు. అంతే మోడలింగ్ రంగంలో బాగా రాణించిన రాహుల్ మంచి సక్సెస్ సాధించి ఇప్పుడు సొంత ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి అధిపతి అయ్యాడు.

ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కోసం 16 లక్షలు ఖర్చు

సక్సెస్ అంటే ఇలా ఉండాలి అనడానికి రాహుల్ తనిజా ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రోడ్డు ప్రక్కన లెథర్ జాకెట్లు, గాలిపటాలు అమ్ముకుంటూ గడిపిన రాహుల్ ఇప్పుడు తాను తిరిగే కార్ల నెంబర్ కోసం లక్షల రుపాయలు వెచ్చించే స్థాయికి ఎదిగాడు. మనిషిలోని తపన ఎంతటి విజయాన్నైనా వరించేలా చేస్తుందని రాహుల్ నిరూపించాడు.

ఫ్యాన్సీ నెంబర్ కోసం 16 లక్షలు

1. 5-సీటింగ్ కెపాసిటీతో దూసుకొస్తున్న 9 కొత్త ఎస్‌యూవీలు

2.ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

3.మహీంద్రా ఎక్స్‌యూవీ700కు రహస్య పరీక్షలు

4.టాటా నుండి మారుతి బాలెనోకు ఊహించని ఎదురుదెబ్బ

5.ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా

Source: Hindustan Times

Most Read Articles

English summary
Read In Telugu: Jaipur Millionaire Spends Rs 16 Lakh For Fancy Number Plate
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X