అమ్మకానికి జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ కారు

జేమ్స్ బాండ్ సినిమాలు అంటే టక్కున గుర్తుకు వచ్చేవి అందులో ఉపయోగించే అత్యాధునిక ఆస్టన్ మార్టిన్ కార్లే. ఇవి సాధారణ కార్ల కన్నా విభిన్నంగా ఉండి, అద్భుతమైన సాహసాలు చేసేందుకు అన్ని విధాలుగా ఇవి అనువుగా ఉంటాయి. బాండ్ సినిమాల కోసం వీటిని ప్రత్యేకంగా అసెంబ్లింగ్ చేస్తుంటారు. ఇలాంటి ఓ అరుదైన జేమ్స్ బాండ్ కారు ఒకటి ప్రస్తుతం వేలాని వచ్చింది.

ది మ్యాన్ విత్ గోల్డెన్ గన్ సినిమాలో ఉపయోగించిన ఆస్టన్ మార్టిన్ 6 లీటర్ వి12 ఇందన్ 2-డోర్ డిబిఎస్ మోడల్ కారు ఒకటి ప్రస్తుతం వేలానికి వచ్చింది. ప్రముఖ ఆక్షన్ సంస్థ క్రిస్టీస్ ఈ కారును వేలం వేయనునుంది. అక్టోబర్ 5, 2012న సౌత్ కెన్సింగ్టన్‌లో ఈ బాండ్ కారును వేలం వేయనున్నారు. వేలం ఈ కారు సుమారు 1,00,000 యూరోల నుంచి 1,50,000 మేర వెల పలుక వచ్చని అంచనా.

జేమ్స్ బాండ్ క్యారెక్టర్ పుట్టి 50 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీని 'గ్లోబల్ జేమ్స్ బాండ్ డే'గా గుర్తిస్తూ, ఈ వేడుకలను జరుపుకునేందుకు జేమ్స్ బాండ్‌లు ఉపయోగించిన పలు వస్తువులను వేలం వేయనున్నారు.

కాగా.. ప్రస్తుతం ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ మోడల్ స్థానాన్ని సరికొత్త వాంక్విష్‌తో కంపెనీ రీప్లేస్ చేసిన సంగతి తెలిసిందే. డిబిఎస్ మోడల్ ఇకపై మార్కెట్‌లో లభ్యం కాదు. దీని స్థానంలో కొనుగోలుదారులు ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌ను సొంతం చేసుకోవచ్చు. వాంక్విష్ చూడటానికి డిబిఎస్ మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ, టెక్నాలజీ పరంగా ఇది డిబిఎస్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది.

ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ మోడల్‌లో ఉపయోగించిన 6.0 లీటర్ వి12 ఇంజన్‌నే రీ-ఇంజనీరింగ్ చేసి వాంక్విష్ మోడల్‌లో ఉపయోగించారు. ఇది గరిష్టంగా 565 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇ-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. వాంక్విష్ కేవలం 4.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 293 కి.మీ (183 మైళ్ల) వేగంతో పరుగులు తీస్తుంది. పాత వెర్షన్‌తో పోల్చుకుంటే దీని పవర్, టార్క్‌లు అధికం.

భారత మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ ధర రూ.3.85 కోట్లు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ కారు వెలుపలి వైపు బాడీ ప్యానెల్స్ మొత్తాన్ని ధృఢమైన కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తీర్చిదిద్దారు. ఆస్టన్ మార్టిన్ వాంక్విషన్ మోడల్‌లోని కొన్ని డిజైన్ అంశాలను ఈ కంపెనీ నుంచి లభ్యమవుతున్న అత్యంత ఖరీదైన మోడల్ వన్-77 (సుమారు రూ.22 కోట్లు) నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. లాంబోర్గినీ అవంటేడర్, ఫెరారీ ఎఫ్ఎఫ్ వంటి కార్లకు ఇది గట్టి పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 8, 2012, 14:48 [IST]
English summary
James Bond movies are popular for Aston Martin cars. A 2008 Aston Martin 6 Litre V12 DBS 2-Door Coupe which appeared in the opening scenes of Quantum of Solace, now went under hammer. This car is expected to fetch between £100,000 and £150,000 at an auction at Christie's South Kensington on Friday October 5.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+