జేమ్స్ బాండ్ కొత్త కారు 'ఆస్టన్ మార్టిన్ డిబి10'
జేమ్స్ బాండ్ చిత్రాలలో ఆ పాత్రను పోషించే వ్యక్తి ఉపయోగించే కార్లకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. తరతరాలుగా వస్తున్న పలు జేమ్స్ బాండ్ చిత్రాలలో ఇప్పటికే అనేక రకాల కార్లను ఉపయోగించారు. సదరు కార్లన్నీ కూడా చరిత్రలో నిలిచిపోయాయి.
తాజాగా.. మరో జేమ్స్ బాండ్ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ కొత్త చిత్రంలో జేమ్స్ బాండ్ ఉపయోగించనున్న కారేంటో తెలుసా.. ఆస్టన్ మార్టిన్ డిబి10. నిజానికి జేమ్స్ బాండ్ చిత్రాలకు ఆస్టన్ మార్టిన్ కార్లకు చాలా పెద్ద కనక్షనే ఉంది.
దాదాపు 1964వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ వచ్చిన అనేక జేమ్స్ బాండ్ చిత్రాలలో ఆస్టన్ మార్టిన్ కార్లను ఉపయోగిస్తారు. తొలిసారిగా గోల్డ్‌ఫింగర్ (1964) అనే చిత్రంలో జేమ్స్ ఆస్టన్ మార్టిన్ కారును ఉపయోగించారు.

కాగా.. వచ్చే ఏడాదిలో విడుదల కానున్న ఈ కొత్త జేమ్స్ బాండ్ చిత్రం (స్పెక్టర్) కోసం ఆస్టన్ మార్టిన్ సంస్థ ఓ సరికొత్త కారును తయారు చేస్తోంది. ఆస్టన్ మార్టిన్ డిబి10 పేరిట ఈ కారును తయారు చేయనున్నారు.
రానున్న 2016లో ఈ కారును పూర్తిస్థాయిలో ఇతర కస్టమర్లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్‌ను ఇప్పటి వరకూ తయారు చేయలేదు. బాండ్ పాత్ర కోసమే ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు.
మరి ఈ కొత్త జేమ్స్ బాండ్ కార్ మీకు నచ్చిందా..?


Click it and Unblock the Notifications








