జూబ్లీహిల్స్‌లో జేమ్స్ బాండ్ కారు.. బటన్ నొక్కితే నంబర్ ప్లేట్ మాయం.. పోలీసులకే షాకిచ్చిన కేటుగాడు

హైదరాబాద్‌లోని ఖరీదైన జూబ్లీహిల్స్ రోడ్ల మీద అర్థరాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఓవర్ స్పీడ్ వంటివి చూడటం పోలీసులకు మామూలే. కానీ, ఆ రాత్రి వారు చూసిన దృశ్యం వారిని నివ్వెరపోయేలా చేసింది. హాలీవుడ్ యాక్షన్ హీరో జేమ్స్ బాండ్ సినిమాల్లో కార్లకు నంబర్ ప్లేట్లు రివర్స్ అవ్వడం చూస్తుంటాం. సరిగ్గా అలాంటి నెంబర్ ప్లేట్ ఫ్లిప్పింగ్ (Number Plate Flipping) టెక్నాలజీతో కూడిన ఒక లగ్జరీ బీఎండబ్ల్యూ (BMW) కారు హైదరాబాద్ పోలీసులకు చిక్కింది. సిటీ చరిత్రలోనే ఇలాంటి హైటెక్ మోసం బయటపడటం ఇదే మొదటిసారి.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 1, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలో శనివారం అర్థరాత్రి ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ నరసింహారావు నేతృత్వంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో వేగంగా వస్తున్న ఒక ఖరీదైన బీఎండబ్ల్యూ కారును పోలీసులు ఆపారు. డ్రైవర్ సీటులో ఉన్న గౌతమ్ అనే వ్యక్తికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా, రక్తంలో ఆల్కహాల్ శాతం 137 mg/100ml గా నమోదైంది. ఇది అనుమతించదగిన స్థాయి కంటే చాలా ఎక్కువ. అయితే పోలీసులు కారును సీజ్ చేసే క్రమంలో ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు.

James Bond-Style Number Plate Scam Busted in Hyderabad BMW with Flip Tech Shocks Police

పోలీసులు కారు నంబర్‌ను చెక్ చేస్తున్నప్పుడు, కారు ముందు వైపు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్ (DL 6CM 7097) ఉంది. కానీ, కారు వెనుక వైపు చూస్తే తెలంగాణ నంబర్ (TS 9FQ 9999) ఉంది. ఇది చూసి పోలీసులు అయోమయానికి గురయ్యారు. డ్రైవర్‌ను లైసెన్స్ లేదా కారు డాక్యుమెంట్లు అడిగితే అతను ఏమాత్రం సహకరించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కారు లోపల క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కారు స్టీరింగ్ పక్కనే ఒక చిన్న సీక్రెట్ స్విచ్ కనిపించింది. పోలీసులు ఆ బటన్ నొక్కగానే.. వారి కళ్ల ముందే కారు నంబర్ ప్లేట్ దానంతట అదే రొటేట్ అయ్యి ఢిల్లీ నంబర్ నుంచి తెలంగాణ నంబర్‌కు మారిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న పోలీసు అధికారులందరూ ఒక్క క్షణం అవాక్కయ్యారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారు అసలు రిజిస్ట్రేషన్ ఢిల్లీకి చెందినది. తెలంగాణ నంబర్ ప్లేట్ పూర్తిగా నకిలీది. నగరంలో ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు లేదా అతివేగంగా వెళ్లినప్పుడు సిగ్నల్స్ వద్ద ఉండే సీసీ కెమెరాల నుంచి తప్పించుకోవడానికి ఈ ఫ్లిప్పింగ్ టెక్నాలజీని వాడుతున్నాడని తేలింది. ఒకవేళ కెమెరా నంబర్ ప్లేట్‌ను క్లిక్ చేసినా, అది ఫేక్ నంబర్ అవ్వడం వల్ల చలాన్లు అసలు యజమానికి చేరవు. ఇలా వందలాది చలాన్లను ఎగ్గొట్టడానికి గౌతమ్ ఈ కిలాడీ ఉపాయాన్ని అమలు చేస్తున్నాడు.

James Bond-Style Number Plate Scam Busted in Hyderabad BMW with Flip Tech Shocks Police

జూబ్లీహిల్స్ పోలీసులు ఈ లగ్జరీ కారును స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కారు యజమాని గౌతమ్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు, ఫోర్జరీ (నకిలీ నంబర్ ప్లేట్ల వాడకం), ప్రభుత్వ అధికారులకు సహకరించకపోవడం వంటి సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అసలు ఇలాంటి టెక్నాలజీని కారులో ఎక్కడ ఇన్‌స్టాల్ చేయించారు? దీని వెనుక ఏవైనా ముఠాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి అత్యాధునిక సాంకేతికతను నేరాలకు వాడుకోవడంపై ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై వాహనాల తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని, ఇలాంటి వింతైన టెక్నాలజీలతో చట్టాన్ని మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

More from DriveSpark

Article Published On: Sunday, April 12, 2026, 15:14 [IST]
English summary
James bond style number plate scam busted in hyderabad bmw with flip tech shocks police
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+