గాలి జనార్థన్ రెడ్డి విలాసాలు చూడతరమా...!!

జనార్థన్ రెడ్డి వద్ద రూ. 4.5 కోట్లు విలువ చేసే రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు, దిగుమతి చేసుకున్న ఓ ఫోక్స్‌వ్యాగన్ కారు మరియు మెర్సిడెస్ బెంజ్ లైమోజైన్ (పొడవాటి కారు), ఓ ఆడి కారు ఉన్నాయి. అంతేకాకుండా.. సినిమాల్లో హీరోను చేజ్ చేసేందు కోసం విలన్లు ఉపయోగించే సుమో, స్కార్పియోలు మాదిరగానే జనార్థన్ రెడ్డి వద్ద అధిక సంఖ్యలో మిత్సుబిషి పాజెరో కార్లు కూడా ఉన్నాయి.
ఇవన్నీ విదేశీ కార్లు మాత్రమే, ఇవి కాకుండా డజన్ల కొద్దీ దేశీయ కంపెనీల కార్లు గాలి గారి రాజప్రసాదంలో కొలువై ఉన్నాయి. ఈ కార్లన్నంటినీ పార్కింగ్ చేసేందుకు ఓ పెద్ద పార్కింగ్ స్థలాన్నే నిర్మించారు. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం ఉంచేందుకు సిబ్బందిని కూడా నియమించారు. గాలి జనార్థన్ రెడ్డి ప్రత్యేకంగా ఉపయోగించే కార్లన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ కలిగన కార్లే.
గాలి జనార్థన్ రెడ్డి రోడ్డుపై వెళ్తుంటే.. ముందు కొన్ని కార్లు వెనుక కొన్ని అచ్ఛం మన తెలుగు సినిమాల్లో మాదిరిగా ఆయన కాన్వాయ్ ఉంటుంది. మైనింగ్ కుంభకోణాల నేపథ్యంలో ప్రస్తుతం మన గాలి గారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండు కోసమై హైదరాబాద్‌లోని చంచల్‌గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాలి దగ్గర నుంచి
రెండు హెలికాఫ్టర్లు, రూ. 10 కోట్ల రెండు లగ్జరీ కార్లను పోలీసులు సీజ్ చేశారు.


Click it and Unblock the Notifications








