ట్రోల్స్ ఒకవైపు, మూడు కోట్ల కార్ ఒకవైపు.. జాన్వీ కపూర్ లగ్జరీ లైఫ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

సినీ సెలబ్రిటీలు సినిమా ప్రమోషన్ కోసం చేసే పనులు అప్పుడప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఇటీవల బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం లగ్జరీ కారులో వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఆమె ప్రయాణించిన కారు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, ఆ కారు సాధారణమైనది కాదు.. దాని విలువ దాదాపు రూ.3 కోట్లు. జాన్వీ కపూర్ లగ్జరీ కారులో రావడానికి కారణం ఏంటి? అసలు ఆ కారులో ఏమేం ఫీచర్లు ఉన్నాయో పూర్తి వివరాలు చూద్దాం.

సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ కలిసి నటించిన పరం సుందరి సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ ట్రైలర్‌పై మలయాళీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన దేఖ్పట్ట సుందరి దామోదరం పిళ్లై అనే పాత్ర, ఆమె మలయాళ ఉచ్చారణపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి.

Janhvi Kapoor s Grand Entry Param Sundari Arrives in a Rs 2 96 Crore Lexus

కేరళలో మహిళలు మోహినియాట్టం చేస్తూ, మల్లెపూలు ధరించరని, జాన్వీ ఉచ్చారణ బాగాలేదని మలయాళీలు విమర్శిస్తున్నారు. అయితే, కేరళలో ఈ వివాదం పెద్దదైనా, ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.

ఈ వివాదాల మధ్యనే సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతోంది. ఈ ప్రమోషన్స్ కోసం జాన్వీ కపూర్ తన సరికొత్త లెక్సస్ ఎల్‌ఎమ్ 350ఎమ్‌హెచ్ లగ్జరీ కారులో దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లెక్సస్ కంపెనీకి చెందిన ఈ అత్యంత విలాసవంతమైన కారు ధర భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.50 కోట్లు. ముంబైలో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 2.96 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కారు సోనిక్ అగేట్ అనే ప్రత్యేకమైన రంగులో ఉంది.

Janhvi Kapoor s Grand Entry Param Sundari Arrives in a Rs 2 96 Crore Lexus

లెక్సస్ ఎల్‌ఎమ్ 350ఎమ్‌హెచ్ కారును చూస్తుంటే, ఇది కారులా కాకుండా ఒక కదిలే విమానంలా అనిపిస్తుంది. సినిమా తారలు ఎక్కువగా ప్రయాణించే ఈ కారులో విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఉండే సౌకర్యాలు ఉన్నాయి. ఈ కారులో 48-అంగుళాల అల్ట్రావైడ్ స్క్రీన్, వెనుక భాగంలో మల్టీ-ఆపరేషన్ ప్యానెల్, ఎయిర్‌లైన్-స్టైల్ రెక్లైనింగ్ సీట్లు, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్, పాదాల కింద ఫుట్‌రెస్ట్, 23-స్పీకర్ సర్‌రౌండ్-సౌండ్ ఆడియో సిస్టమ్, ప్రత్యేకమైన హెడ్‌రెస్ట్‌లు, ముందు, వెనుక సీట్లకు ప్రత్యేక ఆడియో అవుట్‌పుట్ సౌకర్యాలు ఉన్నాయి.

ఇవి మాత్రమే కాకుండా, ఈ కారులో అంతులేని అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, అనేక యూఎస్‌బీ పోర్ట్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు, రీడింగ్ లైట్స్, మేకప్ అద్దాలు, ఒక చిన్న ఫ్రిడ్జ్, వెనుక భాగంలో గ్లవ్‌బాక్స్‌లు, గొడుగు పెట్టడానికి ప్రత్యేక స్థలం వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఈ లగ్జరీ ఎంపీవీ కారు ఈ ఏడాది మార్చిలోనే భారతదేశంలోకి వచ్చింది.

Janhvi Kapoor s Grand Entry Param Sundari Arrives in a Rs 2 96 Crore Lexus

లెక్సస్ ఎల్‌ఎమ్ 350ఎమ్‌హెచ్ కారులో 2.5 లీటర్, నాలుగు సిలిండర్ల, పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 190 బీహెచ్‌పీ పవర్‌ను మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇ-ఫోర్ ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీతో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ కారు టయోటా జిఏ-కె మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఈ కారు డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

పెద్ద స్పిండిల్ గ్రిల్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వర్టికల్ ఫాగ్ ల్యాంప్‌లు, వెనుక భాగంలో పూర్తి వెడల్పు ఉన్న ఎల్‌ఈడీ టెయిల్‌లైట్ మరియు బాక్సీ బాడీ స్టైల్ వంటివి ఈ కారు డిజైన్‌లో ముఖ్యమైన అంశాలు. మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఈ 250డి, బిఎండబ్ల్యూ ఎక్స్5, లెక్సస్ ఎల్‌ఎక్స్ 570, రేంజ్ రోవర్ వంటి మరికొన్ని లగ్జరీ కార్లు కూడా జాన్వీ కపూర్ గ్యారేజీలో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, August 23, 2025, 18:34 [IST]
English summary
Janhvi kapoors grand entry param sundari arrives in a rs 2 96 crore lexus
Read more on: #offbeat #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+