ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌ పెట్టేందుకు జపనీస్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ టెక్నాలజీ.. పైలట్‌ ప్రాజెక్ట్‌ ఎక్కడంటే.??

దేశంలో సరికొత్త ట్రాఫిక్‌ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ట్రాఫిక్‌ సమస్యను నివారించేందుకు పాదచారుల కోసం జపనీస్‌ ట్రాఫిక్‌ వ్యవస్థను తీసుకురానున్నారు. అయితే ఇది ఎక్కడో తెలుసా.. ఇటీవల వెల్లడైన ప్రపంచ అత్యధిక ట్రాఫిక్‌ కలిగిన నగరాల్లో టాప్‌ 10 లో స్థానం దక్కించుకున్న బెంగళూరులో.. ఈ సిస్టమ్‌ ఎలా పనిచేయనుంది.. పూర్తి సమాచారం ఈ కథనంలో..

బెంగళూరులో ట్రాఫిక్‌(Bengaluru Traffic) సమస్య గురించి తెలియని వారుండరు. ఉద్యోగులు, వ్యాపారస్థులు ఇలా బెంగళూరులో నివసించే చాలా మంది తమ జీవితంలో ఎక్కువ సమయాన్ని ట్రాఫిక్‌లోనే గడిపారనడంలో సందేహం లేదు. అయితే ఈ మహా నగరంలో ట్రాఫిక్‌ సమస్యను నివారించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నారు.

Japanese-Traffic-Signal-Technology-In-Bengaluru

పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద బెంగళూరులో ఉల్సూర్ సమీపంలోని కెన్సింగ్టన్ రోడ్ మరియు మర్ఫీ రోడ్ జంక్షన్‌లో జపనీస్ MODERATO (మేనేజ్‌మెంట్ ఆఫ్ ఒరిజిన్-డెస్టినేషన్-రిలేటెడ్ అడాప్టేషన్ ఫర్ ట్రాఫిక్ ఆప్టిమైజేషన్) టెక్నాలజీ ఆధారంగా ఒక కొత్త ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టమ్‌ను ఇటీవల యాక్టివేట్ చేశారు. ఈ సిస్టమ్‌ ద్వారా జంక్షన్లలో రద్దీని బట్టి ఆటోమేటిక్‌గా సిగ్నల్స్‌ మారతాయి.

బెంగళూరులోని MG రోడ్, హోసూర్ రోడ్ మరియు ఓల్డ్ మద్రాస్ రోడ్‌తో పాటు 28 ప్రధాన జంక్షన్‌లలో కొన్ని కారణాల వల్ల గత కొన్ని నెలలుగా ట్రాఫిక్ సిగ్నల్స్‌ పనిచేయడం లేదు. అయితే ఇది త్వరలోకి అమలులోకి రానుంది. ప్రస్తుతం ఈ జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్ టైమర్లను ఫిక్స్ చేయగా.. ప్రతి జంక్షన్‌లో వాహనాల సాంద్రత ఆధారంగా జపనీస్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ సిగ్నల్స్ ఆటోమేటిక్‌గా పనిచేయనుంది.

Japanese-Traffic-Signal-Technology-In-Bengaluru

కాగా ఇన్‌స్టాలేషన్ మరియు స్విచ్చింగ్ విధానాలను తనిఖీ చేయడానికి కెన్సింగ్టన్ రోడ్ మరియు మర్ఫీ రోడ్ జంక్షన్ వద్ద సిగ్నల్‌ను ఒక వారం పాటు తాత్కాలికంగా ఆన్ చేశారు. ఇది విజయవంతమైనట్లయితే.. ఈ నెల చివరి వారం నుంచి ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్లు పట్టణ భూ రవాణా డైరెక్టరేట్ దీపా చోళన్ తెలిపారు.

అధికారి చెప్పినట్లుగా అన్నీ సవ్యంగా జరిగితే.. కోర్ సిటీ ప్రాంతాల్లోని మొత్తం 28 సిగ్నల్‌లు మార్చి 2024 నాటికి చేయనున్నాయి. కాగా ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ. 72-కోట్లుగా సమాచారం. సిగ్నల్స్‌, సంబంధిత సెన్సార్‌ల ఏర్పాటుకు సంబంధించిన సివిల్‌ పనులు ముగిశాయని చోళన్‌ తెలిపారు. సిగ్నల్స్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ పూర్తయిందని, ఫిబ్రవరి మూడో వారంలోగా సెన్సార్‌లకు విద్యుత్‌ కనెక్షన్‌ను అందజేస్తామని స్పష్టం చేశారు.

కాగా ఈ MODERATO ప్రాజెక్ట్‌ను మొదటగా 2014లో జపాన్‌ ప్రకటించింది. కానీ జూలై 2021లో మాత్రమే ఇది విస్తృతమైంది. అక్టోబర్ 2022 నాటికి ఈ సిస్టమ్‌ పూర్తి కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల ఆలస్యమైంది. అంతేకాకుండా విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనట్లు సమాచారం.

MODERATO టెస్ట్‌ విజయవంతమైన తర్వాత.. సిగ్నల్స్‌ను ట్రాఫిక్ పోలీసులకు అందజేస్తామని, త్వరలోనే ఈ సిస్టమ్‌ను ప్రారంభించనున్నట్లు దీపా చోళన్‌ వెల్లడించారు. బెంగళూరులో రద్దీ రోడ్లపై VIP మరియు అత్యవసర వాహనాల కదలికను అనుమతించడానికి ఈ సిస్టమ్‌ ఉపయోగపడుతుందన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం వెయిట్‌ చేయడం తప్పుతుందని అధికారి పేర్కొన్నారు. ఈ సిస్టమ్‌లోని ముఖ్యమైన భాగం అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్ (ATSCS).. వాహనదారులు మరియు పాదచారులకు సిగ్నల్‌లు, వాహన కదలికలను కొలిచే ఆటోమేటిక్ ట్రాఫిక్ కౌంటర్ మరియు ట్రాఫిక్ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి క్లిష్టమైన జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్‌ను అంచనా వేస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌ను అమలు పరిచే.. అన్ని జంక్షన్లలో సిగ్నల్ టైమింగ్ యొక్క రియల్‌- టైమ్‌ ఆప్టిమైజేషన్‌ను పర్యవేక్షించడానికి.. సెంట్రల్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్ (MODERATO)ను ఉపయోగిస్తారు. కాగా ప్రత్యేక పాదచారుల సిగ్నల్‌లు ప్రజలు రద్దీగా ఉండే జంక్షన్లలో దాటడానికి దోహదపడతాయి. బెంగళూరులో దాదాపు కోటి కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉండగా.. ఇక్కడ 40,000 ట్రాఫిక్ కూడళ్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 400 సిగ్నల్-నియంత్రిత, 600 మాన్యువల్‌ కంట్రోల్‌ సిగ్నల్స్‌ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 13, 2024, 18:00 [IST]
English summary
Japanese traffic signal technology in bengaluru to reduce traffic congestion
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+