అత్యంత భయంకరమైన, అసాధారణ బ్రిడ్జ్: ఇది ఎక్కడ ఉందో తెలుసా?
జపాన్ అత్యంత చిన్న దేశం ప్రపంచ పటంలో దీనిని వెతకాలంటే కాస్త సమయమే పడుతుంది. కాని జపాన్ గురించి తెలియని వాడంటు ఉండడు. ప్రపంచ దేశాలకు వారి పరిజ్ఞానం ఎంతో ముఖ్యమైనది, వారి ఉత్పత్తులు ఎంతో అవసరమైనవి వారికి ఏదయినా సమస్య వచ్చిందంటే చిటికెలో పరిష్కరించుకుంటారు.
అయితే వీరికి ఉన్నట్లు ఒక చిక్కువచ్చిపడింది. దీని కోసం వీరు ఏకంగా ఈ బ్రిడ్జిని నిర్మించుకున్నారు. అసలు ఎంటా సమస్య, ఏమిటి ఈ బ్రిడ్జి విశేషాలు...? రండి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.

ఇక్కడ గల ఈ బ్రిడ్జ్‌ను మాట్స్యు (Matsue) మరియు సకాయ్‌మినతొ(Sakaiminato) అను రెండు నగరాలను కలపడానికి నిర్మించారు. అయితే ఇంత ఎత్తులో బ్రిడ్జిని ఎందుకు నిర్మించారు అని సందేహిస్తున్నారా ?

ఈ రెండు నగరాల మధ్య ఒక పెద్ద నది ఉంది ఈ నది మార్గం గుండా పెద్ద పెద్ద కార్గో షిప్‌లు వెళుతుంటాయి. అందుకోసమే ఈ బ్రిడ్జిని ఇంత ఎత్తులో నిర్మించారు,

ఇంతవరకు ఈ బ్రడ్జి పేరు గురించి చెప్పలేదు కదా. ఈ బ్రిడ్జ్‌ని ఎషియామా ఒహాషి బ్రిడ్జ్ అని పిలుస్తారు.

మీకు తెలుసా ప్రపంచ వ్యాపంగా అత్యంత ఎత్తైన బ్రిడ్జిలలో ఈ ఎషియామా ఒహాషి వారధి మూడవ స్థానంలో కలదు.

ఈ బ్రిడ్జి నకౌమి అను నది గుండా దాదాపుగా 1.7 కిలో మీటర్ల మేర పొడవు నిర్మించారు. అనగా ఒక మైలు పొడవు అన్నమాట.

ఇది 11.4 మీటర్లు వెడల్పు కలదు. దీని మీద రాకపోకల కొరకు టూ వే రహదారిని ఏర్పాటు చేశారు.

మనకు చూడటానికి ఇది నిటారుగా కనిపించినప్పటికి ఇది ఇలా ఉండదు. దీని డిజైన్ చేసిన ఇంజనీర్ కథనం ప్రకారం బ్రిడ్జి ప్రారంభంలో 6.1 శాతం మరియు అంతమయ్యే చోట 5.1 శాతం ప్రవణత ఉండేలా దీనిని నిర్మించారు.

ఈ బ్రిడ్జి మీద ప్రయాణం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే కథనం క్రింది భాగాన దీనికి చెందిన వీడియో కలదు చూడండి.

- హీరో మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ..
- దేశాధిపతుల రాయిల్ కార్లు!
- టైటానిక్ మళ్లీ పుట్టిందా...?


Click it and Unblock the Notifications








