క్రికెట్ గ్రౌండ్‎లోనే కాదు రోడ్డు మీద కింగే.. క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా దగ్గర ఎలాంటి కార్లు ఉన్నాయంటే ?

క్రికెట్ పిచ్‌పై తన యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించే జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైదానంలోనే కాదు, రోడ్లపై కూడా బుమ్రా స్టైలే వేరు. ఆయన గ్యారేజీలో ఉన్న కోట్లాది రూపాయల కార్లు చూస్తే ఎవరైనా సరే వావ్! ఏం కలెక్షన్ రా బాబు అనాల్సిందే.

బుమ్రాకు కార్లంటే ఎంత ఇష్టమో ఆయన కార్ల కలెక్షన్ చూస్తే అర్థమవుతుంది. మరి, యార్కర్ కింగ్ దగ్గర ఏయే కార్లు ఉన్నాయి? వాటి ధరలు, ప్రత్యేకతలు ఏంటి? వివరంగా తెలుసుకుందాం.

Jasprit Bumrah

రేంజ్ రోవర్ వెలార్ : జస్ప్రీత్ బుమ్రా గ్యారేజీలో మొదటగా చేరిన లగ్జరీ కార్లలో ఇది ఒకటి. కార్ల విషయంలో ఈ క్రికెటర్ సెలక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. రేంజ్ రోవర్ వెలార్ R-Dynamic S P250 పెట్రోల్, Sd200 డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. డీజిల్ వేరియంట్ ఎక్కువగా అమ్ముడవుతుంది. దీనికి గరిష్టంగా 201 హెచ్‌పీ పవర్, 430 ఎన్ఎమ్ టార్క్ ఉంటుంది.

ఈ కారు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది, ఇది కేవలం 8.2 సెకన్లలో 0 నుండి 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. రేంజ్ రోవర్ వెలార్ ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ. 87.90 లక్షల నుంచి మొదలవుతుంది. పెట్రోల్, డీజిల్ రెండింటికీ ఇదే ధర ఉంటుంది. టాప్ మోడల్ ధర రూ. 89.90 లక్షల వరకు ఉంటుంది.

Jasprit Bumrah

మేబ్యాక్ ఎస్560 : జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన అభిరుచికి తగ్గట్టుగా తన గ్యారేజీలో కొత్త మెర్సిడెస్ ఎస్-క్లాస్ మేబ్యాక్ ఎస్560 ను కూడా చేర్చుకున్నాడు. ఎస్-క్లాస్ మేబ్యాక్ చాలామంది సెలబ్రిటీలకు ఇష్టమైన కారు. మేబ్యాక్‌లో 4.0లీటర్ ట్విన్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ V8 ఇంజిన్ ఉంటుంది. ఈ కారు 463బీహెచ్‌పీ పవర్, 700ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మేబ్యాక్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, రియర్ వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తుంది.

ఈ కారు కేవలం 4.9 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. మేబ్యాక్ ఎస్560 భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.11 కోట్ల నుంచి మొదలవుతుంది. ఆర్టీఓ, ఇన్సూరెన్స్, టీసీఎస్ వంటి ఆన్-రోడ్ ఖర్చులు కలిపితే, మొత్తం ఆన్-రోడ్ ధర రూ. 2.32 కోట్ల వరకు చేరుకుంటుంది.

నిస్సాన్ జిటిఆర్ : నిస్సాన్ జిటిఆర్ కారు లవర్స్‌కి చాలా ఇష్టమైన కారు. ఈ కారు లుక్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అందుకే కార్ల ప్రపంచంలో దీన్ని గాడ్జిల్లా అని పిలుస్తారు. ఈ కారులో 3.8 లీటర్ ట్విన్ టర్బోచార్జ్‌డ్ V6 ఇంజిన్ ఉంటుంది. ఇది 565 హార్స్‌పవర్, 633 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ కారు కేవలం 2.9 సెకన్లలోనే 0 నుండి 96 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 315 కి.మీ/గం. నిస్సాన్ జిటిఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.12 కోట్లు. నిస్సాన్ నుండి ఈ కారు కేవలం ఒకే వేరియంట్ (3.8 V6) లో మాత్రమే అందుబాటులో ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా : జస్ప్రీత్ బుమ్రా రోజువారీ అవసరాల కోసం ఒక సాధారణ కారును కూడా కలిగి ఉన్నాడు. టయోటా ఇన్నోవా క్రిస్టా దాని ఫెసిలిటీ, తక్కువ మెయింటెనెన్స్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ కారు 2.4 లీటర్ పెట్రోల్, 2.7 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇప్పుడు దీని పేరు హైక్రాస్ అని మార్చబడినప్పటికీ, పాత ఇన్నోవాకు భారతదేశంలో చాలామంది అభిమానులు ఉన్నారు.

డీజిల్ వేరియంట్‌లో 2.7 లీటర్ ఇంజిన్ 166 పీఎస్ పవర్, 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.99 లక్షలు. టాప్ మోడల్ ధర రూ. 27.08 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు వేరియంట్‌ను బట్టి, ఆన్-రోడ్ ధరను బట్టి మారవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, July 28, 2025, 15:06 [IST]
English summary
Jasprit bumrahs multi crore car collection will bowl you over
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+