Just In
Don't Miss
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గాడిదలను డీలర్‌షిప్‌కు తీసుకువచ్చిన జావా బైక్ ఓనర్, ఎందుకో తెలుసా ?
భారతీయులు సాధారణంగా క్రియాశీలతకు మారుపేరుగా ప్రసిద్ధి చెందారు. వారు నిరసన తెలపడానికి కొత్త మార్గాలను కూడా వెతుక్కుంటారు. కొన్ని నెలల క్రితం ఒక కస్టమర్ తన ఎస్‌యూవీని గాడిద చేత బయటకు లాగి నిరసన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

జావా బైక్ యజమాని డీలర్షిప్ దగ్గర గాడిదలు తీసుకు వచ్చి వాటితో నిరసన వ్యక్తం చేశాడు. జావా బైక్ యజమాని జావా కంపెనీని మరియు బైక్‌ను గాడిదగా అభివర్ణించాడు, ఇది పనికిరాని సంస్థ అని చెప్పాడు.

అసలు జావా 42 మోడల్‌తో ఇబ్బంది పడుతున్న ఉదయపూర్ నివాసి అభయ్ రాజ్ సింగ్ అనేకసార్లు తన బైక్ గురించి ఫిర్యాదు చేసిన తరువాత, కంపెనీ లేదా డీలర్షిప్ తన సమస్యను పరిష్కరించడం లేదని, అందువల్ల ఈ గాడిదలతో నిరసన వ్యక్తం చేసాడు.
MOST READ:బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ; ఫుల్ డీటైల్స్

అతను 8 నెలల క్రితం జావా 42 బైక్ కొన్నాడు. కొనుగోలు చేసిన తర్వాత చాలాసార్లు ఇబ్బంది పడ్డారు. అతను 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించినప్పుడల్లా, బైక్ యొక్క ఇంజిన్ ఆగిపోతుంది. ఈ సమస్య ఎదురైన ప్రతిసారీ ఆయన చెప్పారు.

దీనిపై డీలర్ మరియు కంపెనీకి కూడా ఫిర్యాదు చేశాడు. డీలర్‌కు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది అనుచితంగా వ్యవహరించారు. సంస్థ కూడా స్పందించలేదు.
MOST READ:ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు కొన్న క్రిస్టియానో రొనాల్డో : ఈ కారు ధర 83 కోట్లు

తాను విద్యార్థినినని, ఈ బైక్‌ను 2 లక్షలకు కొనుగోలు చేసి ప్రతి నెలా ఇఎంఐ చెల్లిస్తున్నానని పేర్కొన్నాడు. సంస్థ బైక్‌ను అమ్మేసి కస్టమర్లను మరచిపోతుంది. అమ్మకాల తర్వాత సర్వీస్ గురించి కంపెనీ పట్టించుకోదని ఆయన అన్నారు.

అభయ్ రాజ్ సింగ్ ఈ బైక్ అంటే తనకి చాలా ఇస్తామని అందువల్ల ఈ బైక్ కొన్నానని చెప్పారు. ఇప్పుడు అతడు ఈ బైక్ కొనడమే జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని అనుకుంటున్నాడు. అంతే కాకుండా ఈ బైక్ ఎవరూ కొనవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
MOST READ:అంగారక గ్రహంపైకి నాసా పంపిన స్పేస్ షిప్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

అభయ్ రాజ్ సింగ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసి, జావా కంపెనీకి తాను రాసిన ఇ-మెయిల్ స్క్రీన్ షాట్‌ను ఈ పోస్ట్‌లో జత చేశారు. ప్రస్తుతం ట్వీట్లు తొలగించబడ్డాయి, జావా వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తుందని ఆశిద్దాం.