కోటిన్నర రూపాయల Audi కారులో జవాన్ నటి.. వీడియో వైరల్
బాలీవుడ్ నటుల్లో చాలా మంది నటీనటులు లగ్జరీ కార్లను ఇష్టపడతారు. ఇప్పటికే చాలా మంది తమ గ్యారేజీల్లో ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. తాజాగా జవాన్ నటి సన్యా మల్హోత్రా ఖరీదైన ఆడి కారులో తళుక్కుమన్నారు. ఇటీవల విడుదలలైన జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
జవాన్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో నటించిన సన్యా మల్హోత్ర.. ముంబై అంధేరీలోని తన కార్యాలయానికి లగ్జరీ ఆడి కారులో వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ కారు ధర ఎంత, కారు ప్రత్యేకతలేంటో మీకోసం.

బాలీవుడ్ నటి సన్యా మల్హోత్రా Audi Q8 కారులో ప్రయాణం చేశారు. ఇది ఆడి నుంచి కొత్తగా విడుదలయిన కార్లలో ఒకటి. ఈ కారును 2022 సంవత్సరంలో ఆమె కొనుగోలు చేశారు. ఈ కారు ఆక్టటుకొనే డిజైన్, లగ్జరీ క్యాబిన్, మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటాయి.
భారత మార్కెట్‌లో ఈ ఆడి Q8 SUV ప్రారంభ ధర రూ.1.07 కోట్లుగా ఉంది. అదే ఆడి Q8 టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.1.43 కోట్లుగా ఉంది. ఈ రెండు ఎక్స్‌షోరూం ధరలు. ఆన్‌రోడ్ కోసం ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ఆడి Q8 SUV కారు 3.0 లీటర్ TFSI V6 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 335 bhp శక్తి, 500Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9.8 kmpl మైలేజీ ఇస్తుంది. 8- స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.
ఆడి క్యూ8 లగ్జరీ కారు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. దీంతోపాటుగా మాట్రిక్స్ LED హెడ్‌లైట్లు, వెంటిలేటెడ్ లెథర్ సీట్లను కలిగి ఉంటాయి. దీంతోపాటుగా 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల వర్చువల్ కాక్‌పిట్ డిస్‌ప్లే సహా కీలక ఫీచర్లను కలిగి ఉంది.

ఆడి Q8 ఎస్‌యూవీ కారు 605 లీటర్ల బూట్‌స్పేస్‌ను కలిగి ఉంటుంది. అలాగే 85 లీటర్ల ఇంధన ట్యాంకు సామర్థ్యా్న్ని కలిగి ఉంటుంది. 5.9 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. 250 kmph గరిష్ఠ వేగంతో ప్రయాణం చేయగలదు. ఈ వాహనంలో 5 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు.
షారూఖ్‌ఖాన్, విజయసేతుపతి, నయనతార ప్రధాన పాత్రల్లో జవాన్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించారు. అనిరుద్ సంగీతం సమకూర్చారు. బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధించింది. దంగల్ సినిమాతో సన్యా మల్హోత్రా అందరి దృష్టిని ఆకర్షించారు. అమీర్‌కుమార్తెగా నటించారు. రెజ్లర్ పాత్రను పోషించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








