చిటెకెలో పని చేసిపెట్టే జేసీబీ.. దీని మైలేజీ, మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా?

జేసీబీలను మనం చూస్తూనే ఉంటాం. నిర్మాణ రంగంలో దీనితో చాలా పనులు నడుస్తాయి. మట్టి తవ్వుతున్నప్పుడో లేదా ఏదైనా భవంతిని కూల్చేస్తున్నప్పుడో వీటి అవసరం తప్పక ఉంటుంది. మనుషులు రోజుల తరబడి చేసే పనిని ఇది కొన్ని గంటల్లోనే చేసేస్తుంది. గంటల్లో చేసే పనిని చిటెకెలో చేసేస్తుంది. విపత్తు వేళల్లోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సైజులో భారీగా ఉండే ఆ వాహనాన్ని అవలీలగా ఆపరేట్ చేసేవాళ్లను చూసి ఆశ్చర్యపోతుంటాం కదా! అయితే... మీరు ఎప్పుడైనా ఈ జేసీబీ మైలేజీ గురించి ఆలోచించారా? ఒక్క లీటర్ డీజిల్‌తో ఇది ఎంతసేపు పని చేయగలుగుతుంది? దీని ఖర్చు ఎలా ఉంటుంది? ఒకవేళ ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలియకపోతే ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జేసీబీతో మీరు ఇదివరకు ఏదైనా పని కోసం వినియోగించి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఇది రెంటల్ పద్ధతిలో లభిస్తుంది. వినియోగదారులు దీన్ని గంటల చొప్పున లేదా రోజు చొప్పున డబ్బులు చెల్లించి దీన్ని వినియోగించుకుంటారు. దీని మెయింటెనెన్స్ ఖర్చు అధికంగా ఉండడం వల్ల దీని యజమానులు రెంట్ కూడా భారీగానే వసూలు చేస్తారు.

Jcb machine mileage

జేసీబీ మెయింటెనెన్స్‌లో దాని మైలేజీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ మేలేజీ మనం ఎలాంటి జేసీబీ మోడల్ వాడుతున్నాం, దాన్ని దేనికి వినియోగిస్తున్నాం, దాని వర్క్ లోడ్ ఎలా ఉంది అన్నదానిపై ఆధారపడి వేర్వేరుగా ఉంటుంది. లోడ్ ఎక్కువగా ఉంటే మైలేజ్ తక్కువగా వస్తుంది.

మంచి ఆపరేటర్ జేసీబీ నడిపితే.. దాని మైలేజీ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఎందుకంటే నిపుణుడైన ఆపరేటర్ ఉంటే.. సాధ్యమైనంత త్వరగా పనిని పూర్తి చేయగలుగుతారు. కాబట్టి.. జేసీబీ మైలేజీ అనేది దాని మెయింటెనెన్స్, అది చేసే పనితో పాటు, దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తిపై కూడా ఉంటుందని చెప్పవచ్చు. గంటలో చేయాల్సిన పనికి రెండు గంటలు కేటాయిస్తే.. మైలేజీ కూడా తగ్గిపోతుంది కదా!

Jcb machine maintenance cost

సాధారణంగా జేసీబీ backhoe loader మోడల్.. లీటర్ డీజిల్‌కు 4 నుంచి 6 కి.మీ.ల మైలేజీ అందిస్తుంది. JCB చాలా బరువుగా ఉంటుంది కాబట్టి.. మైలేజీ తక్కువగానే ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ, అనుభవం లేని ఆపరేటర్ దీన్ని నడిపితే మాత్రం.. ఇంధన వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మైలేజీ ఇంకా తగ్గుతుంది.

జేసీబీ మెచీన్లు లార్జ్‌గా, హెవీగా ఉంటాయి కాబట్టి.. వాటి మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. అయితే... అది చేసే పని, మెయింటెనెన్స్, ఆపరేటింగ్ మెథడ్స్ వంటివి దాని మైలేజ్ తగ్గడానికి ఇతర కారణాలుగా చెప్పవచ్చు. దీన్నినడిపే వ్యక్తి చాలా స్మార్ట్ వర్క్‌ను కలిగి ఉండాలి.

జేసీబీ స్పేర్ పార్ట్స్ ఖర్చు కూడా ఖరీదైనవే అని చెప్పాలి. సాలిడ్ ఐరన్‌తో తయారయ్యే దీని విడి భాగాల తయారీకి భారీగా ఖర్చు అవతుంది. అందువల్ల ఈ స్పేర్ పార్ట్స్ ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి ఒకవేళ డ్యామేజ్ అయితే వీటి రిపేర్‌కు రూ.వేలల్లో వెచ్చించాల్సి వస్తుంది.

జేసీబీ రిపేర్ కూడా బాగా ఖరీదైన ప్రక్రియే. జేసీబీకి ఏదైనా రిపేర్ సమస్య వస్తే తప్పకుండా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. రోడ్డు పక్కన జేసీబీని రిపేర్ చేపిస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు దీని పనితీరును సమీక్షించాలి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, January 13, 2025, 15:36 [IST]
English summary
Jcb machine mileage is how much know full details here about jcb
Read more on: #india #offbeat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+