టోల్‌గేట్‌ వద్ద గొడవ.. జేసీబీతో బూత్‌లను ధ్వసం చేసిన ఆపరేటర్‌

ఉత్తరప్రదేశ్‌లో హాపూర్ జిల్లాలో ఓ షాకింగ్‌ సంఘటన జరిగింది. టోల్‌గేట్‌ వద్ద ఓ బుల్డోజర్ (JCB)తో టోల్‌బూత్‌లను కూల్చివేసిన షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంది. అసలు జేసీబీ డ్రైవర్‌ అలా చేయడానికి కారణం ఏమిటి? అసలు వివాదం ఎలా చెలరేగింది అనే దానిపై విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ ఓ వ్యక్తి రికార్డు చేశాడు. ప్రస్తుతం వైరల్‌ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బుల్డోజర్‌ ఆపరేటర్‌ని అరెస్ట్‌ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని చజర్సీ టోల్‌ప్లాజాలో గల బూత్‌లను జేసీబీతో ఓ వ్యక్తి ధ్వసం చేశాడు. దీంతో టోల్‌ప్లాజాలోని రెండు బూత్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీనిపై విచారణ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. టోల్ చెల్లించాలని అడిగినందుకు జేసీబీతో దాడి చేసినట్లు తెలిసింది. జేసీబీలోని వ్యక్తి దురుసుగా వ్యవహరించినట్లు అక్కడి సిబ్బంది పోలీసులకు తెలిపారు. దీనిపై చట్టరీత్యా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.

JCB-Attack-In-Tollgate

టోల్ బూత్‌లను బుల్డోజర్ ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టోల్ చెల్లించేందుకు వచ్చిన బుల్డోజర్‌ని అక్కడి ఆపరేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీంతో అతను పూర్తిగా రెండు బూత్‌లను ధ్వంసం చేసినట్లు సమాచారం. దీనిపై అక్కడి వారితో వాదోపవాదాల తర్వాత బుల్డోజర్ డ్రైవర్‌ సహనాన్ని కోల్పోయినట్లు తెలిసింది. సిబ్బంది సహకారం సరిగ్గ లేక దాడి చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. అయితే అతని వివరణపై పోలీసులు సీరియస్‌ అయ్యారు.

భవిష్యత్తులోనూ ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యేందుకు అవకాశం ఉన్నట్లు వారు చెప్పారు. టోల్‌బూత్‌లను కూల్చివేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ వీడియో ఆధారంగా జేసీబీ ఆపరేటర్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎక్స్‌ (ట్విట్టర్‌)లోని ఒక వీడియోని ప్రామాణికంగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకి సంబంధించి నిందితుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు.

JCB-Opertater-Attack-On-Toll Gate

ఈ ఘటనను టోల్‌బూత్ వద్ద ఉన్న కార్మికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఢిల్లీ-లక్నో హైవే-9లో గల పిల్ఖువా కొత్వాలి ప్రాంతంలోని చిజార్సీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియో ప్రకారం జేసీబీ నెంబర్ యూపీ 14 కేజీ 4255 గా ఉన్నాయి. దీంతో ఆ వ్యక్తి సంఘటన ప్రాంతం నుంచి బుల్డోజర్ వదిలేసి పారిపోయాడు.

ఈ ఘటనలో టోల్ బూత్ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. అదృష్టశావత్తు ఆ వ్యక్తులు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వీడియో ఆధారంగా బుల్డోజర్ ఆపరేటర్‌ని పట్టుకునేందుకు రంగంలోని దిగి వెంటనే అరెస్ట్‌ చేశారు. ఇలాంటి ఘటనలు దేశంలో పెరుగుతున్నాయి. తాజా ఘటనపై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు.

దేశంలో త్వరలోనే టోల్‌ విధానానికి స్వస్తి పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫాస్టాగ్ ద్వారా టోల్‌గేట్ల వద్ద వాహనాలకు టోల్‌టాక్సీ వసూలు చేస్తున్నారు. త్వరలోనే జీపీఎస్‌ విధానం ద్వారా టోల్‌ టాక్స్‌ని వసూలు చేసే అవకాశం ఉంది. జీపీఎస్‌ కోసం ప్రత్యేక లేన్‌లను ఏర్పాటు చేయనున్నారు. అతి త్వరలోనే దేశంలో జీపీఎస్‌ టోల్‌టాక్స్‌ కలెక్షన్‌ అందుబాటులోకి రానుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 12, 2024, 13:39 [IST]
English summary
Jcb operator brings down chhjarsi toll gate booths video gone viral
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+