Jeep మెరిడియన్‌ టెస్ట్‌ డ్రైవింగ్‌లో భారీ ప్రమాదం.. దూరంగా ఎగిరిపడిన కారు టైర్లు..!

సాధారణంగా కొత్త లేదా పాత కార్లను కొనుగోలు చేసే సమయంలో టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తుంటాం. ఇటీవల అనేక సంస్థలు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌లు కూడా చేస్తున్నాయి. అయితే టెస్ట్‌ డ్రైవింగ్‌ సమయంలో కొన్నిసార్లు డ్రైవర్లు లేదా ఇతర వాహనాల డ్రైవర్ల అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి.

ఇటువంటి ఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. టెస్ట్‌ డ్రైవింగ్‌కు తీసుకొచ్చిన జీప్‌ మెరిడియన్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రతీక్‌ సింగ్‌ తన యూట్యూబ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Jeep Meridian suv crashed during test drive

జీప్‌ మెరిడియన్‌ కారుపై ఆసక్తి ఉన్న కస్టమర్‌ ఆ వాహనాన్ని టెస్ట్‌ డ్రైవ్‌కు తీసుకెళ్లారు. ఆ కారులో కస్టమర్‌ సహా షోరూం సిబ్బంది ఉన్నారు. అయితే కొంత దూరం ప్రయాణం చేశాక.. కారు నియంత్రణ కోల్పోయింది. ఫలితంగా రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు భారీగా డ్యామేజీ అయింది. ఏకంగా కారు చక్రాలు దూరంగా వచ్చిపడ్డాయి. ముందు బంపర్‌, గ్రిల్‌, హెడ్‌ల్యాంప్‌లు, బానెట్‌, డ్రైవర్‌ వైపున్న డోర్‌ భారీగా దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.

Jeep Meridian suv crashed during test drive

ప్రమాద సమయంలో రోడ్లు తడిగా ఉందని వీడియో చూస్తే అర్థం అవుతుంది. మరియు అతివేగం కారణంగా కారు నియంత్రణ కోల్పోయి ఉండవచ్చు. ఈ సమయంలో వాహనంలోని ట్రాక్షన్‌ కంట్రోల్‌ ఫీచర్‌ ఆఫ్‌ చేసి ఉండవచ్చు. అందువల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం కారు వీడియో వైరల్‌ అవుతోంది.

వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రస్తుతం ఎక్కువ మంది టెస్ట్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కారు పరిస్థితిపై పూర్తి అవగాహన ఉండదు. అందువల్ల వాహనాన్ని తక్కువ వేగంతో నడపాల్సి ఉంటుంది. టెస్ట్ డ్రైవింగ్‌ సమయంలో ప్రమాదాలు జరిగినప్పుడు.. షోరూం యజమాన్యాలు నష్టపరిహారం చెల్లించాలని కోరిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ ఘటనలో ఇలా జరగలేదని తెలుస్తోంది.

Jeep Meridian suv crashed during test drive

గత సంవత్సరం జీప్‌ మెరిడియన్‌ SUV లాంచ్‌ అయింది. ఈ వాహనం 2.0 లీటర్‌ టర్బోఛార్జడ్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 170ps శక్తి, 350Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఈ కారు 6-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 9- స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడుతుంది. జీప్‌ మెరిడియన్‌ ప్రారంభ ధర రూ.33.41 లక్షలుగా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 12, 2023, 12:26 [IST]
English summary
Jeep meridian suv crashed road divider at high speed during test drive
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+