మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

సాధారణంగా చాలా మందికి ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని కలలు కంటూ ఉంటారు. ఇందులో ఐఏఎస్ లు కావచ్చు, ఐపీఎస్ లు కావచ్చు మరియు పైలెట్లు కూడా కావచ్చు. మనలో చాలామందికి పైలెట్ అవ్వాలని ఉంటుంది. కొంతమంది ఈ కలను నిజం చేసుకుంటారు, మరి కొంత మందికి ఈ కల కలగానే మిగిలిపోతుంది.

మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

ప్రస్తుతం భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. అది మిలటరీ కావచ్చు, పైలట్లు కావచ్చు, ఇప్పుడు ప్రతి రంగంలోనూ స్త్రీలు తమ సత్తా చాటుతున్నారు. ఇటీవల కేరళలోని త్రివేండ్రం సమీపంలోని కొచుతురా గ్రామానికి చెందిన జెన్నీ జెరోమ్ అనే ఒక యువతి పైలెట్ కావాలన్న తన కలను నిజం చేసుకుంది.

మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

జెన్నీ జెరోమ్ కేరళలో మొట్టమొదటి కమర్షియల్ పైలట్ గా నిలిచింది. ఈ కారణంగా ఆమెకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఘనంగా స్వాగతం పలికాయి. జెన్నీ జెరోమ్ వయసు ఇప్పుడు 23 సంవత్సరాలు మాత్రమే. ఈ వయస్సులో పైలెట్ కావడం ద్వారా చాలా మంది యువతులకు ఆదర్శంగా నిలిచింది.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

కేరళ రాజకీయ నాయకులందరూ జెన్నీ జెరోమ్‌ సృష్టించిన కొత్త చరిత్రకు ఎంతగానో అభినందిస్తున్నారు. జెన్నీ జెరోమ్ గత ఆదివారం తన మొదటి వాణిజ్య విమానాన్ని విజయవంతంగా నడిపింది. ఆమె ఎయిర్ అరేబియా జి9449 లో ప్రయాణించింది. ఈ ఫ్లైట్ షార్జా నుంచి ప్రారంభమై, త్రివేండ్రంకి చేరింది.

మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

ఈ విజయవంతమైన ప్రయాణంలో జెన్నీ జెరోమ్‌కు మరచిపోలేని అనుభూతి ఏర్పడింది. ఈమె విజయవంతంగా ఫ్లైట్ నడిపినందుకు ఎంతోమంది ఈమెను అభినందించారు. పినరయి విజయన్, ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సహా పలువురు మంత్రులు జెన్నీ జెరోమ్‌ను అభినందించారు.

MOST READ:బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

జెన్నీ జెరోమ్ సాధించిన విజయాల గురించి ట్వీట్ చేసిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ జెన్నీ జెరోమ్ సాధించిన విజయం యువతులకు, సాధారణ ప్రజలకు గొప్ప ప్రేరణ అని అన్నారు. జెన్నీ జెరోమ్ కల నెరవేరడానికి ఆమె కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. జెన్నీ జెరోమ్ తన జీవితంలో మరింత గొప్ప విజయాలు సాధిస్తారని మేము ఆశిస్తున్నాము, అని ఆయన అన్నారు.

మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

తిరువనంతపురం ఎంపి శశి థరూర్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కుగ్రామానికి చెందిన మొదటి కమర్షియల్ పైలట్ అని జెన్నీ జెరోమ్‌ను అభినందించారు. ఒక చిన్న గ్రామానికి చెందిన యువతీ పైలట్ కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇది ప్రస్తుతం సమాజంలో ఉన్న యువతకు ప్రేరణగా నిలవనుంది.

MOST READ:ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?

Most Read Articles

English summary
Jeni Jerome Becomes The First Woman Commercial Pilot Of Kerala. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X