2014 సింగపూర్ గ్రాండ్ ప్రిలో జెన్నిఫర్ లోపెజ్ పెర్ఫార్మెన్స్!

By Ravi

ఈసారి సింగపూర్ గ్రాండ్ ప్రి అంగరంగ వైభవంగా జరగనుంది. 2014 ఫార్ములా 1 సింగపూర్ ఎయిర్‌లైన్స్ సమర్పిస్తున్న సింగపూర్ గ్రాండ్ ప్రి ప్రకటించిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది సింగపూర్ జిపి ముగింపు సమయంలో ప్రముఖ హాలీవుడ్ గాయిని జెన్నిఫర్ లోపెజ్ తమ ప్రదర్శనను ఇవ్వనున్నారు.

సెప్టెంబర్ 21న రేస్ ముగిసిన తర్వాత పడాంగ్ స్టేజ్ వద్ద ఆమె తమ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేవలం జెన్నిఫర్ లోపెజ్ మాత్రమే కాకుండా మేడే, రాబీ విలియమ్స్, జిగ్గీ మార్లీ, పెట్ షాప్ బాయ్స్ మరియు జాన్ లెజెండ్ వంటి హేమాహేమీలు ఆ వారాంతం పొడవును తమ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు సింగపూర్ జిపి ప్రకటించింది.


రెండు సార్లు గ్రామీ నామినీ మరియు 2014 బిలియర్డ్ మ్యూజిక్ అవార్డ్‌లో లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ ఐకాన్ అవార్డును అందుకున్న జెన్నీఫర్ లోపెజ్ ఇటీవలే తన 8వ స్టూడియో ఆల్బమ్‌ను విడుదల చేసింది. అమెరికన్ ఐడిల్ జడ్జ్ అయిన లోపెజ్ ఇటీవలే ఫిఫా వరల్డ్ కప్ 2014 ప్రారంభోత్సవ సమయంలో వుయ్ ఆర్ వన్ అనే పాటను ప్రదర్శించింది.

ఈ ఏడాది సింగపూర్ గ్రాండ్ ప్రికి ఆ దేశపు ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్‌లైన్స్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యహరించనుంది. ఈ రేస్ మరీనా బే స్ట్రీట్ సర్క్యూట్‌పై సెప్టెంబర్ 19 నుంచి 21, 2014 వరకు జరుగుతుంది.

Jennifer Lopez To Perform At Singapore Grand Prix

More from DriveSpark

Article Published On: Wednesday, July 2, 2014, 12:01 [IST]
English summary
Race promoter Singapore GP Pte Ltd announced today that global icon JENNIFER LOPEZ will headline the Padang Stage at the 2014 FORMULA 1 SINGAPORE AIRLINES SINGAPORE GRAND PRIX on Sunday, 21 September 2014. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+