నేటి ఫేస్‌బుక్ వీడియో: జెట్ ఇంజన్ ట్రక్కులతో డ్రాగ్ రేసింగ్!
మీరు ఇప్పటి వరకు ఫార్ములా వన్ రేస్‌లు చూసి ఉంటారు, మోటార్‌సైకిల్ రేస్‌లు చూసి ఉంటారు, కొన్ని రకాల సరదా కార్ డ్రాగ్ రేసింగ్‌లను చూసి ఉంటారు..! కానీ ఇలాంటి భయంకరమైన అలాగే అత్యద్భుతమైన ట్రగ్ డ్రాగ్ రేసింగ్‌ని మాత్రం చూసి ఉండరు.
జెట్ విమానాల్లో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఇంజన్లతో తయారు చేయబడిన భారీ ట్రక్కులు, కళ్లకు కనిపించని వేగంతో రయ్ రయ్ మని దూసుకుపోతుంటే, ఆ అద్భుతాన్ని మాటల్లో వివరించడం కష్టం.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ట్రక్
ఈ ట్రక్కులు గరిష్టంగా 36,000 హార్స్ పవర్‌ల శక్తిని (వామ్మో అంత పవరా...) ఉత్పత్తి చేస్తాయి. ఇవి 400 మీటర్ల దూరాన్ని కేవలం 6.5 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే అధిగమించగలవు. ఇందులో షాక్‌వేవ్ అనే జెట్ పవర్డ్ ట్రక్ ప్రపంచంలో కెల్లా అత్యంత శక్తివంతమైనది.
మూడు గిగాంటిక్ జెట్ ఇంజన్లతో తయారు చేయబడిన ఈ ట్రక్కు గరిష్ట వేగం గంటకు 643.7 కిలోమీటర్లు. మరి ఇలాంటి రెండు పవర్‌ఫుల్ ట్రక్కులు ఒకదానితో ఒకటి పోటీ పడితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? మరి ఆలస్యమెందుకు నేటి ఫేస్‌బుక్ వీడియోలో ఆ వింతను చూసేద్దాం రండి.


Click it and Unblock the Notifications








