Flying Car ఎగిరే కారు విడుదల.. రూ.6.54 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.. 'పైలట్ లైసెన్స్' అవసరం లేదు!!

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఆధారంగా కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. రోడ్లపై ఎన్నో కంపెనీలకు చెందిన కార్లు తిరుగుతున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా ఎగిరే కారు కూడా అందుబాటులో వచ్చింది. ఇలాంటి కారు ప్రపంచంలో ఉందా అనే సందేహం మీకు కలగవచ్చు. అవును మీరు విన్నది నిజమే ప్రస్తుతం ఆ కారు కొనుగోలుకు కూడా సిద్ధంగా ఉంది.

ఎగిరే కార్లను ఉత్పత్తి చేసేందుకు చాలా కంపెనీలు అనేక పరిశోధనలు చేశాయి. అయితే ఇప్పటివరకు ఎగిరే కార్ల అంశం అనేది కేవలం పరిశోధన స్థాయికి మాత్రమే పరిమితం అయ్యింది. తాజాగా అమెరికాకు చెందిన ఓ సంస్థ దీనిని రూపొందించి ఔరా అనిపించింది. ఈ కారు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగించనుంది. ఆ వివరాలు మీకోసం..

Jetson One Flying Car

అమెరికాకు చెందిన జెట్సన్ అనే కంపెనీ తొలిసారిగా తమ ఫ్లయింగ్ కార్లను విక్రయానికి అందుబాటులోకి తెచ్చింది. జెట్సన్ వన్ అనే పేరుతో ఈ ఫ్లయింగ్ కారును రూపొందించింది. ఈ కారు USD 80,000 వద్ద అమ్మకానికి అందుబాటులో ఉంది. భారత కరెన్సీ విలువ ప్రకారం దీని విలువ రూ.80.19 లక్షలుగా ఉండనుంది.

ఈ ఫ్లయింగ్ కారును కొనాలనుకునే వారు కేవలం 8000 అమెరికన్ డాలర్లు అంటే రూ.6.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు. EMI పద్ధతిలో మిగిలిన మొత్తాన్ని చెల్లించే సదుపాయాన్ని కల్పించింది. ఈ ఎగిరే కారు పూర్తిగా విద్యుత్ శక్తితో నడుస్తుంది. ఇది చూడడానికి పూర్తిగా డ్రోన్ మాదిరిగా ఉంటుంది. డ్రోన్ మోడల్ ఆధారంగా దీనిని రూపొందించారు. చిన్నపాటి హెలికాప్టర్ లో వెళ్తున్న అనుభూతిని పొందవచ్చు.

Jetson One Car

ఇది నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఈ ఎగిరే కారులో 20 నిమిషాల పాటు నిరంతరాయంగా ఎగరగలిగే బ్యాటరీ ఉంది. ఈ ఎగిరే కారు పొడవు 2480 mm, వెడల్పు 1500 mm, ఎత్తు 1030 mm ఉంటుంది. ఇది ఎగిరే కారు కాబట్టి దీనిని నడిపేందుకు లైసెన్స్ కావాలని సందేహం మీలో ప్రతి ఒక్కరికి రావచ్చు. అయితే ఈ కారు నడిపేందుకు ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు.

ఈ ఎగిరే కారు దాదాపు బరువు 86 కిలోలు ఉండనుంది. కారు eVTOL టెక్నాలజీతో నడుస్తుంది. US చట్టం ప్రకారం దీన్ని ఆపరేట్ చేయడానికి పైలట్ లైసెన్స్ అవసరం లేదు. కానీ ఇతర దేశాలలో దాని పనితీరుని బట్టి మార్పులు ఉండవచ్చు. దీనిని ఆపరేట్ చేయడానికి లైసెన్స్ అనేది అయా దేశాలపై ఆధారపడి ఉంటుంది.

Jetson One car

ఈ ఎగిరే కారును ఆపరేట్ చేయడానికి సింగిల్ పోల్ ఫార్ములా లేదు. దీనికి రెండు జాయ్‌స్టిక్‌లు ఉన్నాయి. ఒకటి ఎగిరే కారు ఎత్తును నియంత్రిస్తుంది. మరొకటి జాయ్ స్టిక్ దిశను నియంత్రిస్తుంది. ఇది దాదాపు వీడియోగేమ్ ఆడినట్లుగా నియంత్రించబడుతుంది. కాబట్టి ఎవరైనా ఈ ఎగిరే కారును సులభంగా ఆపరేట్ చేయవచ్చు. అందువల్ల ఇది ఒక మంచి హెలికాప్టర్ గా ఉపయోగపడునుంది.

ఈ ఎగిరే కారుకి 88 kWh బ్యాటరీని అమర్చారు. ఇది భూమి నుంచి దాదాపు 1500 అడుగుల దూరం వరకు ఎగురుతుంది. అంతే కాదు గంటకు 101 కి.మీ వేగంతో ప్రయాణించే విధంగా సరికొత్త కారుని సంస్థ రూపొందించింది. దీని ల్యాండింగ్ మెకానిజం ఆటోమేటెడ్ LiDAR సెన్సార్‌తో భూమిపై స్వయంచాలకంగా నడవగలదు. అయితే ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుంది? అలానే ఎంత రేంజ్ ఇస్తుంది అనే విషయాలను సంస్థ వెల్లడించలేదు.

ఈ ఫ్లయింగ్ కారు హ్యాండ్స్ ఫ్రీ హోవర్ ఫంక్షన్‌తో రానుంది. ఈ ఎగిరే కారు ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రత ఫీచర్లను కల్పిస్తుంది. మనం కార్లను ఎలా ఉపయోగిస్తామో అలాగే ఈ ఎగిరే కార్లను కూడా ఉపయోగించవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరికి ఈ కారును పొందే అవకాశం ఉంది. జెట్సన్ ఇప్పుడు ఈ ఫ్లయింగ్ కార్ల కోసం అధికారిక బుకింగ్‌లను ప్రారంభించింది. దీని డెలివరీ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అన్ని కుదిరితే త్వరలోనే ఈ కారు ఆకాశంలో ఎగరనుంది.

More from DriveSpark

Article Published On: Monday, May 1, 2023, 9:07 [IST]
English summary
Jetson one flying car available at 6 54 lakhs details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+