కొడుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో ఆనంద భాష్పాలతో మాటలు రాని క్షణం.. ఏకంగా బెంజ్ కారు..చూస్తే కన్నీళ్లాగవు

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితంలో ఎదగాలని కోరుకుంటారు. వారికి ఎలాంటి కష్టాలు రాకూడదని సంతోషంగా ఉండాలని విద్యా, బుద్ధులు అన్ని నేర్పిస్తారు. అందుకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అయితే కొంత మంది పిల్లలు పెద్దయ్యాక తమ తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోయి వారిని సరిగ్గా పట్టించుకోక పోవడం అలాగే, వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వినబడుతున్నాయి. కానీ కొంతమంది పిల్లలు మాత్రం వృద్ధిలోకి వచ్చిన తర్వాత తాము ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటారు. వారి ఇష్టాలను తెలుసుకుని వాటిని నెరవేరుస్తుంటారు. అలాంటి సంఘటనే ఇటీవల జరిగింది.

చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచిన తల్లిదండ్రులకు తిరిగి ఏదైనా చేయాలనే కోరికతో ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకు కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఎస్ ఎస్‌యూవీ(Mercedes-Benz GLS SUV) కారును బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ కొడుకు ఊహించని బహుమతి ఇవ్వడంతో తల్లిదండ్రుల ముఖం ఆనందంతో వెలిగిపోయింది.

Jeweller Gifted His Parents To Rs 1 7 Crore Benz

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే, పూణేకు చెందిన ప్రసాద్ నాగర్కర్ ఒక నగల వ్యాపారి. అతను తన తల్లిదండ్రులకు రూ.1.7 కోట్ల విలువ చేసే బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడు. మొదటగా అతను భార్య, తల్లిదండ్రులతో కలిసి మెర్సిడెస్-బెంజ్ షోరూమ్‌కు వచ్చాడు. తర్వాత తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టి కారు వద్దకు తీసుకెళ్లి దాని ముందు నిలబెట్టి గంతలు విప్పాడు.

తరువాత కారు మీద ఉన్న కవర్‌ను తొలగించి చూడగా ఖరీదైన కారు ఎదురుగా ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా తమ కొడుకు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌ను చూసి వారు సంతోషంలో మునిగిపోయారు. ఈ వేడుక జరుగుతున్న సమయంలో మొత్తం డీలర్‌షిప్ సిబ్బంది చప్పట్లు కొడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రసాద్ నాగర్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశాడు.

Jeweller Gifted His Parents To Rs 1 7 Crore Benz Gls

ప్రసాద్ నాగర్కర్ తన తల్లిదండ్రలకు ఇచ్చిన మెర్సిడెస్ బెంజ్ GLS SUV ధర రూ.1.7 కోట్లు. ఇది భారతదేశంలో చాలా మంది సెలబ్రిటీల దగ్గర ఉంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్, వ్యాపారవేత్తలు కొనుగోలు చేశారు. SUV ఈ సంవత్సరం ప్రారంభంలో ఫేస్‌లిఫ్ట్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే ప్రకాష్ తన తల్లిదండ్రులకు ఏ వేరియంట్‌ను ఇచ్చాడనే దానిపై స్పష్టత లేదు.

3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ 362 బీహెచ్‌పీ పవర్ వద్ద 750 ఎన్ఎమ్ టార్క్‌ను, 3.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 375 బీహెచ్‌పీ పవర్ వద్ద 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయి.

Jeweller Surprise Gifted To His Parents

కారు బయటి భాగంలో LED హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఎయిర్ ఇన్‌లెట్ గ్రిల్స్, హై-గ్లోస్ బ్లాక్ సరౌండ్‌లు, LED టైల్‌లైట్‌లు వంటివి ఉన్నాయి. క్యాబిన్ లోపల అనుకూలమైన సీట్లు, అప్‌డేటెడ్ MBUX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 13-స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టం, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ADAS వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

కొత్తగా తన తల్లిదండ్రులకు బహుమతిగా అందించిన Mercedes-Benz GLS కాకుండా, ప్రసాద్ నాగార్కర్ వద్ద కొన్ని ఇతర కార్లు కూడా ఉన్నాయి. అతని కార్ల కలెక్షన్‌లో ప్రధాన హైలైట్ అతని లంబోర్ఘిని హురాకాన్ EVO స్పైడర్. దీని ఇంజిన్ గరిష్టంగా 630 బీహెచ్‌పీ పవర్ వద్ద 600 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్‌ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది.

Jeweller Gifted His Parents To Rs 1 7 Crore Car

More from DriveSpark

Article Published On: Friday, October 25, 2024, 11:14 [IST]
English summary
Jeweller gifted his parents to rs 1 7 crore mercedes benz gls luxury suv
Read more on: #mercedes benz #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+