విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకి చాపకింద నీరులా ధరలు పెరుగుతుండటం సామాన్యుడి పాలిట శాపంగా మారింది. పెరుగుతున్న డీజిల్ మరియు పెట్రోల్ ధరలపై ప్రభుత్వాలు కూడా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అంతే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి వాహనదారులను ప్రోత్సహిస్తున్నాయి.

విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

ఈ నేపథ్యంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు కేవలం పెద్ద పెద్ద కంపెనీలు తయారుచేసిన ఎలక్ట్రిక్ బైకులు అధిక ధరలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్యుడి చెంతకు చేరే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల కాలంలో సెరైకేలా ఖర్సావన్ జిల్లాలోని బసుర్దా గ్రామంలో నివసిస్తున్న కామ్‌దేవ్ పాన్ అనే యువ శాస్త్రవేత్త ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ చేసి స్థానికులకు పెట్రోల్ బైక్‌లకు ప్రత్యామ్నాయాన్ని అందించారు.

విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

కామ్‌దేవ్ పాన్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజిక్స్ పూర్తి చేసి, చాలా రోజులు ఈ ఎలక్ట్రిక్ బైక్ పై 2 సంవత్సరాలు పరిశోధనలు చేసి మొత్తానికి ఎకో ఎలక్ట్రిక్ బైక్ ను తయారుచేసాడు. కామ్‌దేవ్ తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఎలెక్ట్రిక్ బైక్‌ను కేవలం 34,000 ఖర్చుతో నిర్మించారు. ఇది ఒకసారి ఛార్జ్ చేయబడిన తర్వాత 50 నుండి 60 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించగలదు. అంతే కాకుండా దీని బరువు 150 కేజీల వరకు ఉంటుంది.

MOST READ:మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ఈ అద్భుతమైన నిర్మాణాన్ని ప్రశంసించారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలవడానికి రాంచీకి వచ్చిన కామ్‌దేవ్ ఎలక్ట్రిక్ బైక్‌ను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పూర్తిగా పరిశీలించి, ఈ యువ శాస్త్రవేత్తను ప్రశంసించాడు.

విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

కామ్‌దేవ్ పాన్ తన గ్రామంలో తన 16 సంవత్సరాల వయసులో పరిశోధన చేస్తున్నప్పుడు తన సైకిల్ మోటారును నడిపించాడు, అప్పటి నుండి, కామదేవ్ కొత్త పరిశోధన చేయడానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ బైక్‌లు లేదా స్కూటర్ లు ఎలక్ట్రికల్ ఛార్జ్ చేయబడతాయి.

MOST READ:2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ రివ్యూ ; కొత్త ఫీచర్స్ & పూర్తి వివరాలు

విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

కామ్‌దేవ్ తయారు చేసిన ఈ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్ ఎలక్ట్రిక్ అవసరం లేకుండా, డ్రైవింగ్ చేయడం ద్వారా సులభంగా ఛార్జ్ చేసే విధంగా తయారుచేసాడు. ఇది ఒక కొత్త లేటెస్ట్ టెక్నాలజీ.

విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

కామ్‌దేవ్ పరిశోధనలు చేసి ఎలక్ట్రిక్ బైక్ ను తయారుచేయడం వల్ల, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్త పరిశోధనలు మరియు ఆవిష్కరణల వైపు ఆసక్తి కనపరుస్తున్నారు. చాలా తక్కువ వ్యవధిలో, కామ్‌దేవ్ మొత్తం జార్ఖండ్‌ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. కామ్‌దేవ్ కృషితో జార్ఖండ్‌లో తయారు చేసిన ఈ బైక్ కి ఎకో ఫ్రెండ్లీ బైక్ అని పేరుపెట్టారు.

MOST READ:వాహ్.. కేవలం 18 గంటల్లో 25.54 కిమీ రోడ్డు పూర్తి.. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

కామదేవ్ సృష్టించిన అద్భుత సృష్టితో కేవలం తన కుటుంబం మాత్రమే కాదు, ఆ గ్రామం మొత్తంగా గర్వంగా ఉంది. కామదేవ్ కి ఉన్న అత్యంత ఆసక్తి వల్ల ఇప్పుడు తన భార్యకు కూడా పరిశోధన గురించి అవగాహన కల్పిస్తున్నాడు. ఏదైనా సంస్థ పెట్టుబడికి సహాయం చేస్తే, ఈ బైక్‌ను మరింత తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చని అతడు చెబుతున్నాడు. ఏది ఏమైనా సరైన నిత్యావసరాలు కూడా లేని ఒక చిన్న గ్రామంలో పట్టుదలతో ఇంతటి ఎలక్ట్రిక్ బైక్ తయారుచేయడం నిజంగా ప్రశంసనీయం.

Source: Etv Bharat

Most Read Articles

English summary
Villager Builds Cheap Electric Bike. Read in Telugu.
Story first published: Wednesday, March 3, 2021, 11:17 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X