జియో మరో సంచలనం.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం 'ఛార్జింగ్‌ డివైజ్‌' లాంచ్‌, ధర కూడా తక్కువే!!

దేశంలోని టాప్‌ టెలికాం ఆపరేటర్ సంస్థ రిలయన్స్ జియో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ డివైజ్‌ని లాంచ్ చేసింది. ఇది యూనివర్సల్ టైప్ 2 రకం ఛార్జింగ్ డివైజ్‌గా ఉంది. దీంతో అన్ని రకాల ఎలక్ట్రిక్ కార్లు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రకాల కార్లను ఛార్జ్ చేయవచ్చు. ఈ సరికొత్త స్మార్ట్‌ ఈవీ ఛార్జింగ్ డివైజ్‌తో ఈవీ ఛార్జింగ్‌ మార్కెట్‌ని శాసించేందుకు జియో ప్లాన్‌ చేస్తుంది. ఈ డివైజ్‌కి సైతం స్మార్ట్‌ ఫీచర్లను సంస్థ జోడించింది. అసలు ఈ డివైజ్‌ ఎలా పనిచేయనుంది.? ఇందకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..

ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ ఛార్జింగ్‌ కోసం జియో ఏరీస్‌ (JioEV Aries)ని డివైజ్‌ని లాంచ్‌ చేసింది. ఇది CE మరియు ARAI నుంచి ఈ డివైజ్‌ని సర్టిఫైడ్‌ పొదింది. ఇది 7.4 kW ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా రాత్రిపూట ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. 3.3 kW ఛార్జర్‌తో పోలిస్తే ఈ ఛార్జింగ్ డివైజ్‌ సమయాన్ని ఆదా చేయనుంది.

Jio-EV-Aries-Charger

దీనిని 360 డిగ్రీల ప్రొటెక్షన్‌తో రూపొందించినట్లు తెలుస్తుంది. దీనివల్ల ఛార్జర్‌ ఇంటర్నల్‌ సేఫ్టీ (RCD), ఓవర్‌కరెంట్ ప్రొటెక్షన్, ఓవర్‌వోల్టేజ్ ప్రొటెక్షన్, అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, ఓవర్-టెంపరేచర్ ప్రొటెక్షన్, గ్రౌండ్ ఫాల్ట్ ప్రొటెక్షన్ మరియు ఇంటిగ్రేటెడ్ సర్జ్ ప్రొటెక్షన్‌ వంటివి కలిగి ఉండనుంది. ఈ ఛార్జింగ్ పరికరానికి IP55 మరియు IK 10 రేటింగ్‌ని కలిగి ఉంది. దీని ప్రకారం క్లిష్ట పరిస్థితులను తట్టుకుంటుంది.

పైన తేలిపిన రేటింగ్‌ ప్రకారం ఇది దుమ్ము, నీటి (Water Resistant)గా ఉండనుంది. దీని వాల్‌బాక్స్ బరువు 3.75 కిలోలుగా ఉంది. ఈ డివైజ్‌ని సులభంగా గోడ, స్తంభం లేదా ఇతర పోల్‌లపై అమర్చవచ్చు. ఇది RFID సాంకేతికతతో కూడిన ప్లగ్-అండ్-ప్లే పరికరాన్ని కలిగి ఉంది. ఛార్జింగ్‌ సరఫరాను ప్రారంభించేందుకు, నిలిపివేయడానికి కనెక్ట్ RFID అనుమతిస్తుంది.

Jio-EV-Aries-Charger

అధునాతన ఛార్జింగ్ అనుభవాన్ని అందించేందుకు వినియోగదారులకు ఈ డివైజ్‌ని జియో పరిచయం చేసింది. జియో ట్రూ పవర్ యాప్ ద్వారా ఈ డివైజ్‌ని కనెక్ట్‌ చేయవచ్చు. ఈ కనెక్టివిటీ ఫీచర్ ద్వారా ఛార్జింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని పూర్తిగా అనుభవించవచ్చు. ఇంకా రిలయన్స్ జియో ఛార్జింగ్ డివైజ్‌లో ఇలాంటి ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ డివైజ్‌ ధర రూ. 46,499గా ఉంఏది.

డ్రైవ్స్‌పార్క్‌ వ్యాఖ్య: కస్టమర్లకు ఎప్పుడు మంచి సౌకర్యాలు అందిచాలనే ఉద్దేశంతో ‌అంబానీ కుటుంబానికి చెందిన జియో ముందుంటుంది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్‌ సదుపాయాన్ని మరింత అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు వినియోగదారులను కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడంలో ఇది చాలా సహాయపడుతుందని భావిస్తున్నాం.

Jio-EV-Aries-Charging-Device

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జియో ఈ ఛార్జింగ్ డివైజ్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కంపెనీ త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రారంభిస్తుందనడంలో సందేహం లేదు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, June 14, 2024, 8:50 [IST]
English summary
Jio ev charger aries launched available in amazon at rs 46 499
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+