జెకె పంక్చర్ గార్డ్ టైర్స్: ఈ టైర్లు పంక్చర్ కావు.. ఒకవేళ పంక్చర్ అయినా అస్సలు గాలి పోదు..!!

భారతదేశంలో టైర్ మార్కెట్‌ శరవేగంగా విస్తరిస్తుంది. మనదేశంలో ముడి రబ్బరు లభ్యత సంవృద్ధిగా ఉండటంతో ఇక్కడ తయారైన టైర్లు విదేశాలకు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడు కొత్త రకం టైర్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి.

జెకె పంక్చర్ గార్డ్ టైర్స్: ఈ టైర్లు పంక్చర్ కావు.. ఒకవేళ పంక్చర్ అయినా అస్సలు గాలి పోదు..!!

తాజాగా, ప్రముఖ దేశీయ టైర్ తయారీ సంస్థ జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ (JK Tyre & Industries) సరికొత్త పంక్చర్ గార్డ్ (Puncture Guard) టెక్నాలజీతో కూడిన టైర్లను మార్కెట్లో విడుదల చేసింది. జెకె టైర్ నాలుగు చక్రాల వాహనాలలో ఉపయోగించే భారతదేశపు మొట్టమొదటి పంక్చర్ గార్డ్ టైర్ (JK Puncture Guard Tyre) ను పరిచయం చేసింది.

జెకె పంక్చర్ గార్డ్ టైర్స్: ఈ టైర్లు పంక్చర్ కావు.. ఒకవేళ పంక్చర్ అయినా అస్సలు గాలి పోదు..!!

ఈ పంక్చర్ గార్డ్ టైర్లు భారతీయ రహదారి పరిస్థితులకు అనుకూలంగా ఉండే అధిక పనితీరు గల టైర్లు అని కంపెనీ తెలిపింది. టైర్ల తయారీలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో పనిచేసే జెకె టైర్, మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త తరం కార్ల కోసం ఈ పంక్చర్ గార్డ్ టైర్లతో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జెకె పంక్చర్ గార్డ్ టైర్స్: ఈ టైర్లు పంక్చర్ కావు.. ఒకవేళ పంక్చర్ అయినా అస్సలు గాలి పోదు..!!

జెకె పంక్చర్ గార్డ్ టైర్ లోపలి భాగం ప్రత్యేకంగా రూపొందించబడిన సెల్ఫ్ హీలింగ్ ఎలాస్టోమర్ (Self-healing Elastomer) కోటింగ్‌తో వస్తుంది. ఈ సాంకేతికతతో టైర్ 6 మిమీ వ్యాసం కలిగిన పదునైన వస్తువుల వల్ల కలిగే పంక్చర్‌ లను దానంతట అదే ఆటోమేటిక్ గా రిపేరు చేయగలదు. ఇలా ఒకటి లేదా రెండు కాదు, ఒకేసారి అనేక పంక్చర్లను కూడా రిపేర్ చేయగలదు.

జెకె పంక్చర్ గార్డ్ టైర్స్: ఈ టైర్లు పంక్చర్ కావు.. ఒకవేళ పంక్చర్ అయినా అస్సలు గాలి పోదు..!!

అన్ని రకాల రోడ్లపై సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి, కంపెనీ భారతీయ ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ పరిస్థితులలో ఈ పంక్చర్ గార్డ్ టైర్‌ ను పరీక్షించింది. ఈ టైర్లను మార్కెట్లో లాంచ్ చేసే సమయంలో కూడా కంపెనీ డెమోగా టైర్లను మ్యాన్యువల్ గా పంక్చర్ చేసి చూపించింది. ఆ సమయంలో టైర్లలో ఎన్ని మేకులు గుచ్చుకున్నప్పటికీ, టైర్ల నుండి గాలి మాత్రం బయటకు రాలేదు. పంక్చర్ గార్డ్ టెక్నాలజీతో కూడిన టైర్లు, సదరు టైరు యొక్క జీవితకాలం ముగిసే వరకు ఎలాంటి అవాంతరాలు లేని రైడ్‌ ను అందిస్తుందని, దీని వలన టైర్లలో కూడా గాలి కూడా తగ్గిపోదని కంపెనీ తెలిపింది.

జెకె పంక్చర్ గార్డ్ టైర్స్: ఈ టైర్లు పంక్చర్ కావు.. ఒకవేళ పంక్చర్ అయినా అస్సలు గాలి పోదు..!!

గడచిన 2020లో స్మార్ట్ టైర్ టెక్నాలజీని మరియు ఇప్పుడు పంక్చర్ గార్డ్ టైర్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా తాము తమ కస్టమర్‌ లకు అధునాతన మొబిలిటీ సొల్యూషన్‌లను అందించాలనే నిబద్ధతకు కట్టుబడి ఉన్నామని, ఈ లేటెస్ట్ టెక్నాలజీ వాహన యజమానులకు అత్యున్నత స్థాయి భద్రత మరియు సౌకర్యాన్ని అందిస్తుందని జెకె టైర్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రఘుపతి సింఘానియా తెలిపారు.

జెకె పంక్చర్ గార్డ్ టైర్స్: ఈ టైర్లు పంక్చర్ కావు.. ఒకవేళ పంక్చర్ అయినా అస్సలు గాలి పోదు..!!

జెకె 'స్మార్ట్ టైర్' టెక్నాలజీ

ఇదిలా ఉంటే, జెకె టైర్ భారతదేశపు మొట్టమొదటి 'స్మార్ట్ టైర్' టెక్నాలజీని కూడా ప్రారంభించింది మరియు కొత్త టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ను ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీ వాహనం టైర్లలోని గాలి పీడనం మరియు ఉష్ణోగ్రతతో సహా టైర్ల యొక్క ముఖ్యమైన డేటాను పర్యవేక్షిస్తుంది.

జెకె పంక్చర్ గార్డ్ టైర్స్: ఈ టైర్లు పంక్చర్ కావు.. ఒకవేళ పంక్చర్ అయినా అస్సలు గాలి పోదు..!!

జెకె టైర్ బ్రాండ్ గురించి..

జెకె ఆర్గనైజేషన్ యొక్క ఫ్లాగ్‌షిప్ కంపెనీ, జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ప్రపంచంలోని టాప్ 25 టైర్ల తయారీదారులలో ఇది కూడా ఒకటి. కంపెనీ ఇటీవలే 20 మిలియన్ ట్రక్ / బస్ రేడియల్ టైర్ల ఉత్పత్తిని పూర్తి చేసింది, ఈ ఘనత సాధించిన మొదటి మరియు ఏకైక భారతీయ కంపెనీ కూడా జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ కావడం విశేషం.

జెకె పంక్చర్ గార్డ్ టైర్స్: ఈ టైర్లు పంక్చర్ కావు.. ఒకవేళ పంక్చర్ అయినా అస్సలు గాలి పోదు..!!

రేడియల్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న, ఈ కంపెనీ 1977లో మొదటి సారిగా రేడియల్ టైర్‌ ను ఉత్పత్తి చేసింది మరియు ప్రస్తుతం ట్రక్ బస్ రేడియల్ సెగ్మెంట్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. కంపెనీ ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆఫ్-రోడ్ వాహనాలు మరియు ద్విచక్ర వాహనాల కోసం కూడా టైర్లను తయారు చేస్తుంది.

జెకె పంక్చర్ గార్డ్ టైర్స్: ఈ టైర్లు పంక్చర్ కావు.. ఒకవేళ పంక్చర్ అయినా అస్సలు గాలి పోదు..!!

జెకె టైర్ సంస్థకు 180 కి పైగా గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్‌ లతో 105 దేశాలలో వ్యాపారం నిర్వహిస్తోంది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 12 బెంచ్‌మార్క్ తయారీ సౌకర్యాలను కలిగి ఉంది, భారతదేశంలో 9 మరియు మెక్సికోలో 3 ఉన్నాయి. కంపెనీ సమిష్టిగా ఏటా 35 మిలియన్ టైర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ 2019 లో వరుసగా ఏడవ సంవత్సరం కూడా సూపర్ బ్రాండ్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ టైర్ తయారీదారుగా నిలిచింది. జెకె టైర్ సంస్థ యూకే ప్లాంట్‌ లలో పాటిస్తున్న భద్రత కోసం బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ స్వోర్డ్ ఆఫ్ హానర్‌ తో సత్కరించింది.

జెకె పంక్చర్ గార్డ్ టైర్స్: ఈ టైర్లు పంక్చర్ కావు.. ఒకవేళ పంక్చర్ అయినా అస్సలు గాలి పోదు..!!

ఎనిమిదవ ఎడిషన్ జెకె టైర్ హిమాలయన్ డ్రైవ్ షురూ..

ఇదిలా ఉంటే, జెకె టైర్ హిమాలయన్ డ్రైవ్ యొక్క ఎనిమిదవ ఎడిషన్ బుధవారం సిలిగురిలోని సిటీ సెంటర్ నుండి లాంఛనంగా ప్రారంభమైంది. జస్ట్ స్పోర్ట్జ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫెడరేషన్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (FMSCI) అనుబంధ సంస్థ, భారత ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ మార్చి 23 నుండి మార్చి 27 వరకు జెకె టైర్ హిమాలయన్ డ్రైవ్ సీజన్ 8ని అమలు చేయాలని నిర్ణయించింది. హిమాలయన్ డ్రైవ్ ఒక ప్రధాన పోటీ TSD (టైమ్-స్పీడ్-డిస్టెన్స్) కార్ ర్యాలీ, ఇది ఇప్పటికే 2013, 2014, 2015, 2016, 2017, 2018 మరియు 2019లో ఏడు విజయవంతమైన ఎడిషన్‌లను పూర్తి చేసుకుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 25, 2022, 12:49 [IST]
English summary
Jk tyre and industries launches puncture guard tyres for four wheelers details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+