Just In
- 9 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 11 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 13 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
- 13 hrs ago
2021 లో టాప్ 5 పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లు ; ధరలు & పూర్తి వివరాలు
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఓ రాశి వారు ఈరోజు ప్రత్యర్థులకు కఠినమైన పోటీ ఇస్తారు...!
- News
మార్చి 15 తర్వాత బడ్జెట్ సమావేశాలు... ఈసారి కేటాయింపులు ఎక్కువే... : సీఎం కేసీఆర్
- Sports
India vs England: బెయిల్ దాచేసిన రిషబ్ పంత్.. వెతికిన అంపైర్, ఆటగాళ్లు! చివరకు!
- Movies
ట్రెండింగ్ : ఆనందంలో తప్పు చేసేసింది!.. 18 నెలల కాపురం.. సంచలనం రేపుతున్న కిమ్
- Finance
భారీగా క్షీణించిన ఎలాన్ మస్క్ సంపద, ఎందుకంటే?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?
అమెరికాలో జోసెఫ్ ఆర్ బైడెన్ చారిత్రాత్మక విజయాన్ని సాధించి డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆ దేశ అధ్యక్ష పదవిని చేపట్టిన విషయం తెలిసినదే. అమెరికాకు 46వ అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల పార్లమెంట్‌పై జరిగిన దాడి నేపథ్యంలో, ఆయనకు భద్రతను మరింత పెంచారు.

ఇప్పటి వరకూ మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ఉపయోగించిన అమెరికా అధ్యక్ష వాహనం 'బీస్ట్'ను ఇకపై జో బైడెన్ కోసం ఉపయోగించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వాహనాల్లో అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే బీస్ట్ కూడా ఒకటి. మరి ఈ బీస్ట్ కారుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

జనరల్ మోటార్స్ క్యాడిలాక్ వన్
నిజానికి ఇదొక జనరల్ మోటార్స్ తయారు చేసిన మోడిఫైడ్ క్యాడిలాక్ కారు. లీమోజైన్ రూపంలో ఉండే ఈ క్యాడిలాక్ వన్ కారును అమెరికా సైన్యం ముద్దుగా 'బీస్ట్' అని పిలుస్తుంది. అధ్యక్షుడి కోసం ఇలాంటివి రెండు కార్లను మాత్రమే తయారు చేశారు. ఆయన కాన్వాయ్‌లో ఎల్లప్పుడూ ఈ రెండు కార్లు ఉంటాయి. ప్రెసిడెంట్ ఏ కారులో ప్రయాణిస్తున్నాడో తెలుసుకోవటం అంత సులువైన విషయం కాదు.
MOST READ:బైక్ మ్యూజియంలో అగ్నికి ఆహుతైన అరుదైన వాహనాలు

అసలు బీస్ట్ కారును ఎందుకు తయారు చేశారు?
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీని 1963 నవంబర్ 22వ తేదీన డల్లాస్‌లో తన కాన్వాయ్‌పై దాడి చేసి హతమార్చారు. ఆయన మరణం తర్వాత, అమెరికా అధ్యక్షుడి భద్రత విషయంలో అనేక విమర్శలు రావటంతో, కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుని భద్రతను మరింత పెంచాలని యూఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుండి ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తూ వస్తోంది.

కాడిలాక్ వన్ కారు ఎప్పుడొచ్చింది?
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రయాణించే కాడిలాక్ వన్ కారును 2018 సెప్టెంబరు 24న ప్రవేశపెట్టారు. దీనిని బీస్ట్ 2.0గా పిలుస్తారు. యూఎస్ సీక్రెట్ సర్వీసెన్ ఇచ్చిన నిబంధనల మేరకు జనరల్ మోటార్స్ సంస్థ ఈ కారును ప్రత్యేకం తయారు చేసింది. ఒక్కో కారు తయారీకి సుమారు రూ.12 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇలాంటి కారును బయటి వ్యక్తుల కోసం తయారు చేయరు. అంతేకాదు, దీని తయారీకి సంబంధించిన రహస్యాలను కూడా కంపెనీ బయటపెట్టదు.
MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

బుల్లెట్ ప్రూఫ్, గ్రనేడ్ ప్రూఫ్, కెమికల్ ప్రూఫ్
బీస్ట్ ఆషామాషీ కారు కాదు. ఈ కారులోని గాజు కిటికీలను 5 అంగుళాల మందంతో తయారు చేశారు. అలాగే డోర్లను 8 అంగుళాల మందంతో తయారు చేశారు. ఇది సుమారు బోయింగ్ విమానంలో ఉన్న డోరుతో సమానం. ఇంధన ట్యాంక్ పేలిపోకుండా ఉండేందుకు కూడా ఇందులో ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది.

ఆక్సిజన్, కెమికల్ మాస్కులు
ఈ కారు అన్ని వైపుల నుండి పూర్తి బుల్లెట్ ప్రూఫ్‌ని కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇది గ్రనేడ్ దాడులను, రసాయనిక దాడులను సైతం తట్టుకుంటుంది. ఇందులో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ఆక్సిజన్ సరఫరా, కెమికల్ దాడిని తట్టుకునే రసాయనిక మాస్కులు కూడా ఉంటాయి.
MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]

దాడులను ఎదుర్కుంటుంది, అవసరమైతే ప్రతిదాడి కూడా చేస్తుంది
ఈ కారుకి ఎలాంటి దాడులనైనా తట్టుకునే శక్తి ఉంది. ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించడానికి వీలుగా ఇందులో తగినన్ని షాట్ గన్లు, భాష్ప వాయువు క్యాన్లు, ఫైర్ ఫైటింగ్ సిస్టం, పొగను పీల్చుకునే స్క్రీన్ డిస్పెన్సర్లు, టియర్ గ్యాస్ గ్రనైడ్ లాంచర్లు వంటి సాయుధ సామాగ్రీ ఇందులో ఉన్నాయి. కొన్ని స్విచ్‌ల సాయంతోనే వీటన్నింటినీ కంట్రోల్ చేయవచ్చు.

అధ్యక్షుడి కోసం బ్లడ్ బ్యాగ్స్
అధికారంలో ఉన్న అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్‌కి చెందిన బ్లడ్ బ్యాగ్స్‌ను ఈ కారులో ఎల్లప్పుడూ భద్రపరచి ఉంటారు. ఇందుకోసం ఈ కారులో ఓ ప్రత్యేకమైన కూలర్ వ్యవస్థ కూడా ఉంటుంది. ప్రమాదాల్లో అవసరమైనప్పుడు అధ్యక్షునికి ఈ రక్తాన్ని ఎక్కిస్తారు.
MOST READ:కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

పేలిపోయినా పరుగులు తీసే టైర్లు, చక్రాలు
బీస్ట్ కారులోని టైర్లకు పంక్చర్లు పడవు, ఒకవేళ దురదృష్టవశాత్తు టైర్లు పేలిపోయినా ఇందులోని స్టీల్ రిమ్ముల సాయంతోనే కారు వేగంగా పరుగులు తీయగలదు. ఈ కారు బాడీని మిలిటరీ గ్రేడ్ ఆర్మర్ మేడ్ 5-ఇంచ్ స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్ పదార్థాలను ఉపయోగించి తయారు చేశారు.

అధునాత డ్రైవర్ క్యాబిన్, కమ్యూనికేషన్ సిస్టమ్
ఈ కారులోని డ్రైవర్ క్యాబిన్ అధునాతన జిపిఎస్ కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ కారు ఏ ప్రాంతంలో ఉన్నా శాటిలైట్ సాయంతో ఇట్టే పసిగట్టవచ్చు. సాధారణ డ్రైవర్లు ఈ వాహనాన్ని నడపలేరు. ఇందుకోసం అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన డ్రైవర్‌ను నియమిస్తుంది.

శాటిలైట్ ఫోన్, న్యూక్లియర్ కోడ్స్
కమ్యూనికేషన్ వ్యవస్థ లేని చోట కూడా శాటిలైట్ ఫోన్ సాయంతో ప్రెసిడెంట్ కారులో కూర్చునే వైట్‌హౌస్‌తో మరియు సీక్రెట్ సర్వీసెస్‌తో సంప్రదింపులు చేయవచ్చు. ఇంకా ఇందులో న్యూక్లియర్ వెపన్స్‌కి సంబంధించిన కోడ్స్ కూడా ఉంటాయని, వాటిని నియంత్రించే అధికారం ప్రెసిడెంట్‌కి మాత్రమే ఉంటుందని సమాచారం.

భారీ బరువు, పవర్‌ఫుల్ ఇంజన్
ఈ కారును హెవీగ్రేడ్ స్టీల్స్ మరియు బుల్లెట్ ప్రూఫ్ పదార్థాలను ఉపయోగించిన తయారు చేసిన కారణంగా, దీని బరువు కూడా భారీగానే ఉంటుంది. పాత బీస్ట్ కారు 14,000 నుండి 20,000 పౌండ్ల మధ్య బరువును కలిగి ఉండేది. అయితే, ఈ కొత్త బీస్ట్ కాస్తంత తేలికైనదిగా చెబుతారు. ఇంత బరువైన కారును ఇందులోని 5 లీటర్ డీజిల్ ఇంజన్ ముందుకు నడుపుతుంది.

బీస్ట్ కారు కోసం స్పెషల్ కార్గో ఫ్లైట్
అధ్యక్షుడు ఉపయోగించే ఈ బీస్ట్ లీమోజిన్ కారు కోసం ఓ ప్రత్యేకమైన సి-17 గ్లోబ్ మాస్టర్ అనే కార్గో విమానం కూడా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు వీదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన కంటే ముందుగా ఈ కార్గో విమానం బయలుదేరుతుంది. అందులో ఈ రెండు కాడిలాక్ కార్లు ఉంటాయి.

ఇంకా తెలియని రహస్యాలెన్నో..
ఈ బీస్ట్ కారు గురించి ఇప్పటి వరకూ మనం తెలుసుకున్నది కొంత మాత్రమే. ఇంకా ఈ కారు గురించి మనకు తెలియని రహస్యాలు చాలానే ఉన్నట్లు సమాచారం.

ఈ రహస్యాలన్ని కారును తయారు చేసిన జనరల్ మోటార్స్ ఇంజనీర్లకు మరియు యూఎస్ సీక్రెట్ సర్వీసెస్‌కి తప్ప మరెవ్వరికీ తెలియవు.ఒక దేశ అధ్యక్షునికి ఆ మాత్రం కట్టుదిట్టమైన భద్రత అవసరం, అందుకే ఈ విధంగా తయారుచేయడం జరుగుతుంది.