ఆడి క్యూ7 ఎస్‌యూవీను కొనుగోలు చేసిన జాన్ అబ్రహామ్

ఈ సందర్భంగా జాన్ ముంబైలోని ఆడి షోరూమ్‌ను సందర్శించి సందడి చేశాడు. ఆడి అధికారులు క్యూ7 తాళం చెవులను జాన్ అబ్రహామ్‌కు అందజేశారు. నలుపు రంగులో ఉండే క్యూ7 ఎస్‌యూవీను జాన్ ఎంచుకున్నాడు. ఆడి షోరూమ్‌ను సందర్శించిన జాన్, అక్కడ ప్రదర్శనకు ఉంచిన ఆడి ఆర్ 8 స్పోర్స్ కారులో కాసేపు కూర్చుని ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు.
జాన్ అబ్రహామ్ ఆడి క్యూ7 కారు చిత్రాలు | John Abraham gets his new Audi Q7
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారత మార్కెట్లో అందిస్తున్న క్యూ7 ప్రీమియం ఎస్‌యూవీ విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్లో దీని రూ. 60 లక్షల పైమాటే. మూడు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. కాగా.. ఎంట్రీలెవల్ వేరియంట్ పెట్రోల్ వెర్షన్‌తో 3-లీటర్ ఇంజన్‌తో లభిస్తుంది. డీజిల్ వేరియంట్ వెర్షన్ ఆడి క్యూ7 3-లీటర్ టిడిఆ మరియు 4.2 లీటర్ టిడిఐ ఇంజన్లతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








