సంజయ్ గుప్తాకు యమహా విమ్యాక్స్‌ను కానుకిచ్చిన జాన్ అబ్రహామ్
బాలీవుడ్ ప్రముఖ హీరో జాన్ అబ్రహామ్‌కు యమహా బైక్‌లంటే పిచ్చ ఇష్టమన్న సంగతి మనందరికి తెలిసనదే. ఈయన యమహా ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నా విషయం విదితమే. గతంలో హౌస్‌ఫుల్ 2 చిత్రం విజయం సాధించడంతో తన మిత్రుడు, తోడి నటుడు అక్షయ్ కుమార్‌కు జాన్ అబ్రహామ్ ఓ ఖరీదైన యమహా విమ్యాక్స్ బైక్‌ను కానుకగా ఇచ్చాడు.
ఇప్పుడు తాజాగా, జాన్ అబ్రహామ్ నటించిన 'షూట్అవుట్ ఎట్ వాడలా' ఇటీవలే విడుదల కావటం, ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించడంతో మన బాలీవుడ్ హీరో ఆ చిత్ర దర్శకుడు సంజయ్ గుప్తాకు కూడా ఓ యమహా విమ్యాక్స్ బైక్‌ను కానుకగా అందజేశాడు. దీంతో సంజయ్ గుప్తా ఎగిరి గంతేసి జాన్ అబ్రహామ్‌ను వాటేసుకుని, సంబరాల్లో మునిగిపోయాడు.
ఈ విషయమై సంజయ్ గుప్తా ట్విట్టర్‌లో ఇలా పేర్కొన్నాడు.. ఇప్పుడు నేను యమహా విమ్యాక్స్ మోటార్‌సైకిల్‌కు యజమానిని, నా హీరో జాన్ అబ్రహామ్‌కు ధన్యవాదములు. నా కొత్త బ్యూటీపై లాంగ్ రైడ్ వెళ్లాలనుంది. ఇదొక అత్యుత్తమ కానుక అంటూ జాన్ అబ్రహామ్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు సంజయ్. అంతేకాకుండా, ఈ బైక్ ఫొటోను 'ఇది నా కొత్త బ్లాక్ బ్యూటీ' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

యమహా అందిస్తున్న క్రూయిజ్ బైక్ విమ్యాక్స్‌లో శక్తివంతమైన 1679సీసీ, లిక్విడ్ కూల్డ్, 4-స్ట్రోక్, డిఓహెచ్‌సి, 4-వాల్వ్, వి-టైప్, 4-సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 200.1 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 166.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 15 లీటర్లు. ఇది ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్‌తో లభిస్తుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.24 లక్షలకు పైమాటే.

Click it and Unblock the Notifications