హెల్మెట్ లేకుండా సూపర్‌బైక్ నడిపిన జాన్ అబ్రహామ్
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహామ్‌కు బైక్‌లంటే క్రేజ్ అన్న సంగతి తెలిసిందే. అందులోను స్పోర్ట్స్ బైక్, ప్రత్యేకించి యమహా బైక్స్ అంటే ఎక్కువగా ఇష్టపడే మన జాన్ ఇప్పుడు ఓ కొత్త బైక్‌పై కనిపిస్తున్నాడు. ఇండియాలో యమహా బ్రాండ్‌కు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్న జాన్ అబ్రహామ్ తాజాగా ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 స్పోర్ట్స్ బైక్‌పై ముంబైలో చక్కర్లు కొడుతున్నాడు.
ఆయన చక్కర్లు కొడితే కొట్టాడు కానీ, హెల్మెట్ పెట్టుకోకుండా చక్కర్లు కొట్టడటమే ఇప్పుడు చర్చనీయాసంగా మారింది. ఓవైపు తమిళ సూపర్ స్టార్ అజిత్ ఇటీవలే కొనుగోలు తన కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ (BMW S1000RR) మోటార్‌సైకిల్‌పై చెన్నై నుంచి బెంగళూరు వరకు రైడ్ చేసుకుంటూ వెళ్లి, రోడ్ సేఫ్టీ గురించి, హెల్మెట్ ఆవశ్యకత గురించి బైకర్లలో అవగాన కల్పించే ప్రయత్నం చేస్తే, జాన్ మాత్రం హెల్మెట్ లేకుండా బైక్ నడిపి వివాదాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు.
సరే ఆ విషయం అటుంచి, జాన్ అబ్రహామ్‌ను వరించిన ఈ లేటెస్ట్ బ్యూటీ ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 గురించి ఓ లుక్కేద్దాం రండి.

హెల్మెట్ లేకుండా సవారీ
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి జాన్ అబ్రహామ్ ఇలా తన యల్లో కలర్ ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 స్పోర్ట్స్ బైక్‌పై హెల్మెట్ లేకుండా వెళ్తూ కెమరాకు చిక్కాడు.

ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 ఆవిష్కరణ
2012లో నిర్వహించిన కొత్త ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా జాన్ అబ్రహామ్ పాల్గొన్నాడు. అప్పటి నుండే గురుడు ఈ బైక్‌పై మనసు పారేసుకున్నట్లు సమాచారం.

ఇంజన్
ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 స్పోర్ట్స్ బైక్‌లో శక్తివంతమైన 999.6సీసీ వి-4 సిలిండర్, లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి ఇంజన్ ఉపయోగించారు.

పెర్ఫామెన్స్
ఈ ఇంజన్ 12500 ఆర్‌పిఎమ్ వద్ద 180 బిహెచ్‌పిల శక్తిని, 10000 ఆర్‌పిఎమ్ వద్ద 115 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు

ట్రాన్సిమిషన్
ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

యమహా వి-మ్యాక్స్
జాన్ అబ్రహామ్ యమహా బ్రాండ్‌కు వీరాభిమాని. ఇండియాలో యమహా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న జాన్ అబ్రహామ్ వద్ద పవర్‌ఫుల్ యమహా వి-మ్యాక్స్‌తో పాటుగా మరికొన్ని స్పోర్ట్స్ బైక్‌లు ఉన్నట్లు సమాచారం.

యమహా వి-మ్యాక్స్ గిఫ్ట్
జాన్ అబ్రహామ్‌కు ఎవరైనా నచ్చిన సరే యమహా బైక్‌లతో వారిని సత్కరిస్తుంటాడు. జాన్ నటించిన 'షూట్అవుట్ ఎట్ వాడలా' చిత్ర దర్శకుడు సంజయ్ గుప్తాకు కూడా ఓ యమహా విమ్యాక్స్ బైక్‌ను కానుకగా అందజేశాడు. గతంలో అక్షయ్ కుమార్‌కు కూడా జాన్ ఓ యమహా బైక్‌ను కానుకగా ఇచ్చాడు.


Click it and Unblock the Notifications








