15 ఏళ్లకే చదువులు ప్రక్కన పెట్టాడు ప్రపంచ ఉత్తమ ఫెరారి డీలర్ అయ్యాడు: ఎలా?
అతనో సామాన్య విద్యార్థి చదువులంటే చిరాకు, పాఠాలంటే పరాకు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే హై స్కూల్ చదువులకు మధ్యలోనే స్వస్తి పలికాడు. అయితేనేం నేడు కొన్ని కోట్ల రుపాయలు విలువ చేసే ఫెరారి కార్ల కార్లను సునాయసంగా అమ్ముతూ బెస్ట్ క్లాసిక్ ఫెరారి డీలర్‌గా మారిపోయాడు. బ్రిటీష్‌లో ఇప్పుడు అందరూ ఇతని గురించే మాట్లాడుకుంటున్నారు. సాధారణ విధ్యార్థి ఇలా ఎలా ఎదిగాడు అని అనుకుంటున్నారా ? ఓ సారి క్రింద గల స్లైడర్లను చదవండి మీకే అర్థం అవుతుంది.

ఇతని పేరు జాన్ కొల్లిన్స్, బ్రిటన్‌లోని గ్లాస్గోలో బాల్యాన్ని గడిపాడు. అప్పట్లో తన గురించి తమ టీచర్లు ఏదో ఒక రోజుకి నీకు ఇల్లు కూడా లేకుండా పోతుంది, కాబట్టి బాగా చదువుకో అన్నట్లు గుర్తు చేసుకున్నాడు.

ఇతను 15 ఏళ్ల వయస్సులో ఉన్నపుడు మొదటిగా గ్లాస్గోలో టీ బాయ్‌గా ఉద్యోగంలో చేరాడు.

అయితే ఇపుడు గ్లాస్గో లో ఉన్న తన షోరూమ్ నుండి 20 లక్షల యూరోల విలువైన కార్లను అమ్ముతున్నాడు.

అయితే కార్లను అమ్మడానికి ముందు జాన్ ఫోటో గ్రాఫర్‌గా తన 25 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరాడు. అపుడు నెలకు 11,000 యూరోల జీతాన్ని పొందేవాడు.

తరువాత 7,000 యూరోల వెచ్చించి ఫెరారి 246 డినో మోడల్ కారును కొనుగోలు చేశాడు.

ఆ తరువాత తాను సంపాదించిన మొత్తాన్ని ఒక స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టాడు. అయితే పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరయిపోయింది. తిరిగి యథాస్థానంలోకి వచ్చాడు.

ఈ నష్టాల ఊబిలోనుండి బయటపడటానికి తను ఎంతో ఇష్టం కొనుకున్న కారును కూడా అమ్మేయాల్సి వచ్చింది.

అయితే జాన్ 300,000 యూరోలను తన స్నేహితుని వద్ద నుండి అప్పుగా తీసుకుని ఫెరారి నుండి పది కార్లను తీసుకున్నాడు.

రిస్క్ తీసుకుని మరీ ప్రారంభించిన ఈ బిజినెస్‌లో పది కార్లను కూడా ఆరు నెలలు తిరక్కుండానే అమ్మేశాడు.

మొదటి వ్యాపారంలో దాదాపుగా 500,000 యూరోల లాభాన్ని చవిచూశాడు.

ఇలా మొదలైన జాన్ జీవితం, కెమెరాను ప్రక్కకు పెట్టేసి కార్ల అమ్మకాలను మొదలెట్టాడు. ఇప్పుడు సుమారుగా 12 మిలియన్ యూరోల విలువైన కార్లను అమ్ముతున్నాడు.

2008 లో పోలో ఆట ఆడుతుండగా గాయపడిని జాన్ కొల్లిన్స్ తిరిగి క్లాసిక్ ఫారారి డీలర్ షిప్ ప్రారంభించాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫెరారి కార్ల డీలర్లలో ఇతనే అత్యంత ధనికుడు.

చిన్నపుడే చదువులకు స్వస్తి పలికిన జాన్ నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ ఫెరారి కార్ డీలర్‌గా ఎదిగాడు.

15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు
ఇండియన్ ఇస్రో దాటికి బెంబేలెత్తుతున్న అమెరికా


Click it and Unblock the Notifications








