అక్షయ్ కుమార్‌కు ఖరీదైన కానుకిచ్చిన జాన్ అబ్రహామ్

గరమ్ మసాలా, దేసీ బాయ్స్, హౌస్‌ఫుల్ 2 ఈ సినిమాల పేర్లు వినగానే ఇటు యాక్షన్‌తో అటు కామెడీని పంచే కండల వీరులు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహామ్‌లు గుర్తుకు వస్తారు. ఆన్-స్క్రీన్‌పై కాకుండా ఆఫ్-స్క్రీన్‌లో సైతం వీరిద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి జంటగా నటించిన మూడవ చిత్రం హౌస్‌ఫుల్ 2 విజయం సాధించినట్లయితే, ఓ ఖరీదైన బైక్‌ను 'కిలాడి' అక్షయ్ కుమార్‌కి కానుకగా ఇస్తానని జాన్ అబ్రహామ్ ప్రామిస్ చేశాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో, తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు జాన్ అబ్రహామ్ ఓ నలుపు రంగు కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్‌ను అక్షయ్ కుమార్‌కు కానుకగా ఇచ్చాడు. ఈ బైక్ విలువ సుమారు రూ.30 లక్షల వరకూ ఉండొచ్చని సమాచారం. స్వతహాగా వీరిద్దరికీ సూపర్‌బైక్‌లంటే మహా క్రేజ్. జాన్ అబ్రహామ్, అక్షయ్ కుమార్‌ల వద్ద చెరొక యమహా వి-మ్యాక్స్ సూపర్‌బైక్‌లు ఉన్నాయి.


అక్షయ్ కుమార్‌తో తొలిసారిగా పనిచేసినప్పటి నుండి అతను ఎంతో సపోర్ట్ ఇచ్చేవాడని, ఈ విధంగా అక్షయ్‌పై తనుకున్న ప్రేమను, గౌరవాన్ని చూపించుకుంటున్నానని, తనకు మాదిరిగానే అక్షయ్‌కు కూడా మోటార్‌సైకిళ్లంటే ఇష్టమని, తాముద్దరూ ఇష్టపడే దానిని బహుమతిగా ఇవ్వడమే మంచిదని భావించానని, అందుకే హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్‌ను కానుకగా ఇవ్వడానికి ఎంచుకున్నాని జాన్ అబ్రహామ్ తెలిపాడు. అక్షయ్‌కు నలుపు రంగు అంటే ఇష్టమని, అందుకే నలుపు రంగు హ్యార్లీ బైక్‌ని కానుకగా ఇస్తున్నానని జాన్ అబ్రహామ్ చెప్పుకొచ్చాడు.

More from DriveSpark

Article Published On: Friday, May 18, 2012, 10:30 [IST]
English summary
John Abraham is someone who likes to keep his promises. Reportedly, during the shooting of Desi Boyz, John had promised Akshay Kumar that he will gift him an expensive bike, after the success of their third film together at the Box-Office. John did not forget his promise and after the success of Housefull 2, John Abraham surprised Khiladi Kumar by gifting him a super bike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+