మళ్ళీ కొత్త కారు కొన్న యంగ్ టైగర్ NTR.. ధర తెలిస్తే షాకవుతారు!
సాధారణ ప్రజల మాదిరిగా కాకుండా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే జూ.ఎన్‌టీఆర్ ఓ కొత్త కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఆ కారు రిజిస్ట్రేష కోసం ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసులో కనిపించారు.
జూనియర్ ఎన్‌టీఆర్ (Jr NTR) కొనుగోలు చేసిన కారు 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) కంపెనీకి చెందిన 'మేబ్యాచ్ ఎస్ - క్లాస్ 580' (Maybach S-Class 580). దీని ధర రూ. 2 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఎన్‌టీఆర్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసుకు వచ్చినట్లు సమాచారం. ఈ ప్రీమియం SUV చూడటానికి చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉండటం చూడవచ్చు.

ఎన్‌టీఆర్ కొనుగోలు చేసిన ఈ కారు బ్లాక్ కలర్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి నాటిక్ బ్లూ, ఒనిక్స్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు డిజైనో డైమండ్ వైట్ బ్రైట్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పరిమాణం పరంగా కూడా ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఇది కొంచెం పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తోంది.
నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో జూనియర్ ఎన్‌టీఆర్ ఆర్టీవో ఆఫీస్ దగ్గర కనిపిస్తారు. ఈయన ఆఫీసు నుంచి బయటకు వచ్చి కారు దగ్గరకు వస్తారు. ఆ సమయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి మళ్ళీ కారులోకి వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత కారు అక్కడ నుంచి వెళ్లిపోవడం చూడవచ్చు. ఈ వీడియో ఇప్పటికే లెక్కకు మించిన వ్యూస్ సంపాదించింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ ఎస్580 లగ్జరీ కారు 3982 సీసీ డీఓహెచ్సీ ఇంజిన్ పొందుతుంది. ఇది 5500 rpm వద్ద 496 Bhp పవర్, 2000 rpm వద్ద 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు కేవలం 4.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేంగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం 250 కిమీ/గం.
చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ఈ కారు ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు డీఆర్ఎల్ వంటివి పొందుతుంది. కారు వెలుపలి భాగంలో సిల్వర్ కలర్ కూడా చూడవచ్చు. ముందు భాగంలో బ్రాండ్ లోగో కూడా ఉంది. పరిమాణం పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు ప్రయాణ సమయంలో మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. డిజైన్ మాత్రమే కాకుండా ఇది ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కారులో 12.8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. వాయిస్ కమాండ్, జీపీఎస్ న్యావిగేషన్, వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేవంటివి ఉన్నాయి. వీటితో పాటు మల్టిఫుల్ ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ వార్ణింగ్, మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








