మీరు ఇప్పటి వరకు చూడని JRD టాటా, ధీరూభాయ్ అంబానీ, రతన్‌టాటా క్లాసిక్ కార్లు..!!
ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ప్రపంచంలోని ఓ మూలన ఏం జరిగినా, ఎవరి దగ్గర ఏం ఉన్నా క్షణాల్లో తెలిసిపోతుంది. ఫలితంగా ప్రపంచంలోని ఏ బిలియనీర్ ఎటువంటి కారును కలిగి ఉన్నారో తెలుసుకోవడం చాలా సులభం. క్షణాల్లో వారి సమాచారం మనం తెలుసుకోగలుగుతున్నాం.
కానీ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అందుబాటులో లేని సమయంలోనూ చాలా మంది బిలియనీర్లు ఖరీధైన కార్లను కలిగి ఉండేవారు. వ్యాపార దిగ్గజాలైన JRD టాటా, ధీరూభాయ్ అంబానీ, రతన్ టాటాలు చాలా అరుదైన లగ్జరీ కార్లను కలిగి ఉండేవారు. ఆ కార్ల గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

JRD టాటా - మెర్సిడెస్ బెంజ్ 190D : ప్రస్తుతం ఎవరైనా మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేయవచ్చు. కానీ 1960లలో బెంజ్ కారు కొనడం ఎవరూ ఊహించలేనిది. ఆ సమయంలోనే జేఆర్‌డీ టాటా ఈ క్లాసిక్ మెర్సిడెస్ కారును కలిగి ఉన్నారు. జేఆర్‌డీ టాటా మెర్సిడెస్ బెంజ్ 190D కారును 1961లో కొనుగోలు చేశారు. కారును జర్మనీలో ప్రత్యేకంగా తయారుచేశారు.
భారత్‌కు రావడానికి మరో ఆరునెలల సమయం పట్టింది. జనవరి 1, 1962లో ఈ కారును రిజిస్టర్ చేశారు. ఆ సమయంలోనే ఆ కారు ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. అడ్జస్టబుల్ సీట్లు, బై ఫోకల్ రియర్‌వ్యూ మిర్రర్‌లను ఈ కారు కలిగి ఉంది. 1.8 లీటర్ ఇన్‌లైన్ 4- సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉండేది. బెంజ్ కారు గంటకు 120 కిమీ వేగంతో ప్రయాణం చేయగలదు.

రతన్ టాటా - బ్యూక్ స్కైలార్క్ : నిరాడంబరమైన జీవనశైలితో ఉండే రతన్‌టాటా చిన్నతనం నుంచే కార్లపై ఎక్కువ మక్కువ చూపించేవారు. బ్యూక్ స్కైలార్క్ కారును రతన్‌టాటా ఇష్టపడేవారు. 1978లో వచ్చిన 5.0 లీటర్ ఇంజిన్‌తో కూడిన బ్యూక్ స్కైలార్క్ 178 రతన్‌టాటా గ్యారేజ్‌లో ఉండేది.

ధీరూభాయ్ అంబానీ BMW 750 XL L7 లిమోసిన్ : భారత్‌లో గొప్ప వ్యాపారవేత్తలతో ధీరూభాయ్ అంబానీ ఒకరు. అప్పట్లోనే BMW 750 XL L7 లిమోసిన్ కారును కలిగి ఉండేవారు. ఈ కారు 5.4 లీటర్ V12 పెట్రోల్ ఇంజిన్ 322bhp శక్తి మరియు 490Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
BMW 750 XL L7 లిమోసిన్ కారును సౌత్ ఈస్ట్ ఆసియన్, యూరోపియన్, మిడిల్ ఈస్టర్న్ మార్కెట్ల కోసం ప్రత్యేకంగా తయారుచేసింది. ఈ కారు పేరులోని XL వాహనం పొడవును సూచిస్తుంది. BMW 8 సీరిస్ కారు కంటే పొడగుగా ఉండేది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








