వీడియో: ట్రాఫిక్ మధ్యలో జగ్లింగ్ చేసిన జగ్లర్
మీరు చివరిగా సర్కస్‌కు ఎప్పుడు వెళ్లారు..? సర్కస్‌లో జగ్లర్స్ (బాల్స్, బాటిల్స్ వంటి వస్తువులను పదికి పైగా గాలిలో ఎగరేసి బ్యాలెన్స్ చేసేవాళ్లు) చేసే స్టంట్స్ మీకు గుర్తున్నాయా..? అయితే, ఇదిగో ఈ వీడియో చూడండి. సర్కస్‌కు వెళ్లి ఇలాంటి ఫీట్లు చూసే సమయం లేని వారి కోసం ఒకతను రోడ్డుపైనే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జగ్లింగ్ చేస్తూ వచ్చే పోయేవారికి వినోదం పంచుతున్నాడు.
బ్రెజిల్‌లో రద్దీగా ఉండే రియో డి జనీరో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ జగ్లర్ సిగ్నల్ పడిన ప్రతిసారి రోడ్డు మధ్యలోకి వచ్చి, ఓ ఎత్తైన చెక్క బాక్సుపై నిల్చుకొని దాదాపు 10 టెన్నిస్ బాల్స్‌తో జగ్లింగ్ చేస్తున్నాడు. ఈ జగ్లింగ్ సన్నివేశాన్ని రికార్డు చేసేందుకు అతను ఓ గోప్రో కెమెరా ఉపయోగించాడు. గోప్రో అఫీషియల్ యూట్యూబ్ చానెల్‌లో ఈ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
మరి ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/CA_TTR2PFMU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








