ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. దేశవ్యాప్తంగా ప్రతి రోజు కొన్ని వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో మనం నిత్యజీవితంలో చూస్తూనే ఉన్నాం.

ఇలాంటి నేపథ్యంలోనే ఇటీవల ఒక వీడియో వెలువడింది. ఇందులో ట్రాఫిక్ సిగ్నెల్స్ క్రాష్ చేసిన రెండు వాహనాలు ఏ విధంగా దెబ్బ తింటాయో మీరు ఇక్కడ చూడవచ్చు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

నివేదికల ప్రకారం ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగినట్లు తెలిసింది. ట్రాఫిక్ సిగ్నెల్ పడిన సమయంలో వాహనాలు వాటిని ఉల్లంఘిస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియ చెప్పడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ట్రాఫిక్ సిగ్నెల్ లో సిగ్నెల్ పడినప్పుడు, అది ఏమాత్రం పట్టించుకోకుండా ఒక మహీంద్రా బొలెరో పిక్-అప్ మరియు మారుతి సుజుకి ఈకో రోడ్డు దాటుతున్నాయి. అదే సమయంలో అటుగా వస్తున్న ఒక లారీ ఢీ కొట్టింది. ఈ సంఘనటనలో మహీంద్రా బొలెరో పిక్-అప్ మరియు మారుతి సుజుకి ఈకో రెండు భారీగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన మే 31న జరిగినట్లు ఇక్కడ చూడవచ్చు.

MOST READ:సూపర్ కారుతో కబాబ్ తయారు చేసిన యువకుడు.. చివరకు ఏమైందంటే?

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న డ్రైవర్లు భారీగా గాయాలపాలైనట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ రెడ్ సిగ్నెల్ పడిన సమయంలో కూడా మహీంద్రా బొలెరో పిక్-అప్ మరియు మారుతి సుజుకి ఈకో రోడ్డు క్రాష్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అటుగా వస్తున్న లారీ ట్రాఫిక్ సిగ్నెల్స్ అనుసరించి వచ్చింది. కావున లారీ డ్రైవర్ డి తప్పులేదని మనం ఇక్కడ గుర్తించవచ్చు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ వర్షం కురుస్తుంది. కావున వర్షంలో వాహనాలను కంట్రోల్ చేయడం అనేది కొంతవరకు కష్టతరంగా ఉంటుంది. కావున వాహనదారులు ఈ వీడియో చూసైనా ఇలాంటి సంఘటనలు పాల్పడకుండా ఉండాలని పోలీసులు తెలిపారు.

MOST READ:ఉక్కు మనిషికి వద్దకు ఈవీలకు మాత్రమే ఎంట్రీ; పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ!

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

భారతదేశంలో దాదాపు అన్ని ప్రధానమైన కూడళ్లలో ఇప్పటికే చాలా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కెమెరాల వల్ల సులభంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిని గుర్తించి వారికి ఈ చలాన్లు జారీ చేయబడుతున్నాయి. అయినప్పటికీ ఈ రోజుకి కూడా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో వీలైనంతవరకు తక్కువ వేగంతో వెళ్లడం మంచిది. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నెల్స్ లో ఎక్కువమంది వాహనదారులు చాలా తొందరగా వెళ్లాలని చాలా ఆతృతగా ఉంటారు. కావున ఈ సమయంలో ఒకరిని మించి ఒకరు ముందుగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో ప్రమాదాలు జరుగుతాయి.

MOST READ:ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

ఇప్పుడు చాలా మెట్రోపాలిటన్ నగరాల్లో సిసిటివి నెట్‌వర్క్ ఉంది. దీనిని పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తుంది. రిజిస్ట్రేషన్ నంబర్‌ను ట్రాక్ చేయడం ద్వారా ఉల్లంఘన ఆధారంగా పోలీసులు చలాన్ జారీ చేస్తారు. ఇటీవలి కాలంలో, చలాన్ మొత్తాన్ని పెంచడానికి ప్రభుత్వం మరియు అధికారులు చాలా కృషి చేస్తున్నారు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

వాహదారులు ఎప్పటికప్పుడు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడే ప్రమాదాల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారులందరికి తప్పకుండా ఈ వీడియో ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

Most Read Articles

English summary
Jumping The Traffic Signal Is Very Risky. Read in Telugu.
Story first published: Tuesday, June 8, 2021, 18:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X