Just In
- 3 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 59 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
Don't Miss
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇలాంటి రోల్స్ రాయిస్ కారును ఎప్పుడైనా చూశారా? ఇది ఏ సెలబ్రిటీదో తెలుసా?
ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లను తయారు చేసే సంస్థ రోల్స్ రాయిస్, తమ కస్టమర్ల అవసరాల మేరకు కారులోని ఇంటీరియర్ ఫీచర్లను కస్టమైజ్ చేసిస్తుంది. అయితే, కొందరు ఔత్సాహికులు మాత్రం తమ కారులో మరిన్ని అదనపు ఫీచర్ల కోసం ఆఫ్టర్ మార్కెట్ మోడిఫికేషన్ కంపెనీలను ఆశ్రయిస్తుంటారు.

అలాంటి, కార్ మోడిఫయర్ కంపెనీలు అసలు కారునే గుర్తు పట్టలేనంతగా వాటిని మోడిఫై చేసేస్తుంటారు. తాజాగా, అమెరికా అత్యంత పాపులర్ సింగర్ అయిన జస్టిన్ బైబర్ కూడా ఓ రోల్స్ రాయిస్ లగ్జరీ కారును తన అభిరుచికి అనుగుణంగా, అన్నింటి కంటే భిన్నంగా మోడిఫై చేయించుకున్నారు.

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కారును దాని ఫ్రంట్ గ్రిల్ మరియు సైడ్ వీల్స్ ఆధారంగా మాత్రమే అది రోల్స్ రాయిస్ కారు అని చెప్పగలము. ఈ కారుని ఇలా మోడిఫై చేసింది వెస్ట్ కోస్ట్ కస్టమ్స్ అనే కార్ మోడిఫికేషన్ కంపెనీ. బైబర్ కోసం ఈ కారును ప్రత్యేకంగా తయారు చేశారు.
MOST READ:అరుదైన లగ్జరీ కార్లో కనిపించిన బాలీవుడ్ బాద్షా "షారుఖ్ ఖాన్" [వీడియో]

ఇదొక రోల్స్ రాయిస్ వ్రైత్ లగ్జరీ కారు. దీనిని పూర్తిగా ఫ్రంట్ నుండి బ్యాక్ వరకూ సరికొత్త బాడీ కిట్‌తో రీడిజైన్ చేశారు. ఫ్యూచరిస్టిక్ ఫ్లోటింగ్ డిజైన్‌తో కూడిన ఈ కారులోని అన్ని చక్రాలను క్రింది భాగం వరకూ కవర్ చేయబడి ఉంటాయి మరియు వాటిపై ప్రత్యేకమైన వీల్ ఆర్చ్ డిజైన్ ఉంటుంది.

ముందు భాగంలో గ్రిల్ మరింత బాక్సీగా కనిపిస్తుంది. ఈ గ్రిల్ సాధారణ వ్రైత్ కంటే చిన్నదిగా ఉంటుంది. ముందు భాగంలో ప్రత్యేకమైన ఎయిర్ ఇన్‌టేక్స్ మరియు విలక్షణమైన హుడ్ ఉంటుంది. దీని హెడ్‌లైట్లను కూడా రీడిజైన్ చేశారు.
స్టాండర్డ్ రోల్స్ రాయిస్ కార్లలో కనిపించే స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ లోగో స్థానంలో ఫిక్స్డ్ క్రిస్టల్ లోగో కనిపిస్తుంది. ఈ లోగో క్రింది భాగంలో ఎల్ఈడి లైట్ ఉండి, రాత్రివేళ్లలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ కారులో సైడ్ మిర్రర్స్ ఉండవు. వాటిని హిడెన్ కెమెరాల సాయంతో రీప్లేస్ చేశారు.
MOST READ:కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

అలాగే, ఇందులో డోర్ హ్యాండిల్స్ కూడా కనిపించవు. రిమోట్ సాయంతో డోర్లు ఆటోమేటిక్‌గా ఓపెన్, క్లోజ్ అవుతాయి. ఇదొక టూ డోర్ కూప్ బాడీ స్టైల్‌ను కలిగి ఉంటుంది. దీని వెనుక టెయిల్ లైట్ డిజైన్‌ను కూడా ట్రయాంగిల్ షేప్‌లో డిజైన్ చేశారు. మొత్తమ్మీద ఈ కారు మంచి ఫ్లోటింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

అయితే, కారు ఇంటీరియర్స్‌లో ఎలాంటి మార్పులు చేసి ఉంటారనేదానిపై స్పష్టమైన సమాచారం లేదు. జస్టిన్ బైబర్ అభిరుచికి తగినట్లుగా మరియు ఎక్స్టీరియర్ డిజైన్‌కు సరిపోయేలా దీని ఇంటీరియర్స్‌ను కూడా మరింత ఫ్యూచరిస్టిక్‌గా రీడిజైన్ చేసి ఉంటారని తెలుస్తోంది.
MOST READ:డ్రైవింగ్ టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఎలా.. ఇది చూడండి

రోల్స్ రాయిస్ ఇటీవల తమ 103ఈఎక్స్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. జస్టిన్ బైబర్ మోడిఫై చేయించుకున్న కారు కూడా ఇంచు మించు ఈ కాన్సెప్ట్ వాహనం మాదిరిగానే అనిపిస్తుంది. కాగా, రోల్స్ రాయిస్ ఆవిష్కరించిన 103ఈఎక్స్ కాన్సెప్ట్ కారు సున్నా ఉద్గారాలను విడుదల చేసే ఎలక్ట్రిక్ వాహనం.

అయితే, జస్టిన్ బైబర్ మోడిఫై చేయించుకున్నది మాత్రం స్టాండర్డ్ రోల్స్ రాయిస్ వ్రైత్ కూప్ పెట్రోల్ మోడల్. సాధారణంగా ఈ కారు ఖరీదు రూ.6.22 కోట్ల వరకూ ఉంటుంది. ఈ రోల్స్ రాయిస్ కారులో శక్తివంతమైన 6.6 లీటర్, వి12 ఇంజన్ ఉంటుంది.
MOST READ:ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్..ఎలా జరిగిందంటే ?

ఈ ఇంజన్ గరిష్టంగా 624 బిహెచ్‌పి మరియు 820 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇదొక 4 సీటర్, 2 డోర్ కూప్ మోడల్. జస్టిన్ బైబర్ ఈ కారును కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగిస్తుంటాడు.
జస్టిన్ బైబర్ లగ్జరీ కార్ కలెక్షన్‌లో చాలానే మోడళ్లు ఉన్నాయి. వీటిలో ఫెరారీ, లాంబోర్ఘిని, మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి, ఆడి ఆర్8, రేంజ్ రోవర్ ఎస్‌యూవీలతో పాటుగా మరికొన్ని సూపర్ కార్లు కూడా ఆయన కలెక్షన్‌లో ఉన్నట్లు సమాచారం.