రూ.కోట్ల విలువైన కారులో కనిపించిన కల్కి నటుడు - వీడియో వైరల్
సెలబ్రిటీలు ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం లేదా.. ఖరీదైన కార్లలో కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి సంఘటనలకు కోకొల్లలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బిగ్ బి 'అమితాబ్ బచ్చన్' (Amitabh Bachchan) ఓ ఖరీదైన కారు డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ బిగ్ బీ డ్రైవ్ చేసిన కారు ఏది? దాని ధర ఎంత ఉంటుంది? అనే మరిన్ని ఆసక్తికరమైన వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన నటులలో ఒకరైన అమితాబ్ బచ్చన్ ఇటీవల సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 (Land Rover Defender 130) కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒక యూట్యూబ్ ఛానెల్‌లో వైరల్ అవుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ క్యాప్ ధరించి స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఇప్పటికే ఈ కారును సినీ తారలు, రాజకీయ ప్రముఖులు మరియు పారిశ్రామిక వేత్తలు కూడా కొనుగోలు చేశారు. డిఫెండర్ అనేది 90, 110 మరియు 130 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 130 అనేది మూడు వరుసల సీట్లను కలిగి ఉంటుంది. మిగిలిన రెండు వేరియంట్లు రెండు వరుసల సీట్లను మాత్రమే పొందుతాయి.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 మోడల్.. 110 వెర్షన్ కంటే కూడా 340మిమీ పొడవుగా ఉంటుంది. అయితే వీల్‌బేస్ మాత్రం 110 మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ 3.0-లీటర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 394 Bhp పవర్, 550 Nm టార్క్ అందిస్తుంది. డీజిల్ వెర్షన్ 296 Bhp పవర్ మరియు 600 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారులోని రెండు ఇంజన్‌లు లైట్ వెయిట్ హైబ్రిడ్ టెక్నాలజీని పొందుతాయి. అంతే కాకుండా ఇవి స్టాండర్డ్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడ్డాయి. శక్తి నాలుగు చక్రాలకు డెలివరీ చేయబడుతుంది. మంచి డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం అద్భుతమైన పర్ఫామెన్స్ అందించడమనే చెప్పాలి.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ రోజు వారీ వినియోగానికి, హైవే మీద మాత్రమే కాకుండా.. కఠినమైన భూభాగాల్లో డ్రైవ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అత్యంత విలాసవంతమైన కార్ల జాబితాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కూడా ఒకటి. డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఇది అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని వాహన వినియోగదారులకు అందిస్తుంది.
ఇప్పటికే చాలా మంది నటులు మరియు నటీమణులు డిఫెండర్ 110 మోడల్ కొనుగోలు చేసారు. అయితే ఇందులో 130 మోడల్ కొనుగోలు చేసిన వారిలో ఇప్పటివరకు అమితాబ్ బచ్చన్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ధర రూ. 1.39 కోట్ల నుంచి రూ. 1.46 కోట్ల వరకు ఉంటుంది. అమితాబ్ ల్యాండ్ రోవర్ కారు సెడోనా రెడ్ కలర్ ఆప్షన్ పొందినట్లు ఇక్కడ చూడవచ్చు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








