దేశం మొత్తం తిరుగుతున్న కల్కి బుజ్జి కారు.. ఫోటోల కోసం ఎగబడుతున్న జనాలు!
ఇటీవలె విడుదలైన కల్కి 2898 ఏడీ చిత్రంలో ఉపయోగించిన కారును బెంగళూరులోని ఫోరం మాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ కారు సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా మహీంద్రా రూ.8 కోట్ల వ్యయంతో ఈ కారును రూపొందించింది. సినిమాలో వినియోగించిన ఈ కారును నిజంగా చూసి జనాలు మురిసిపోతున్నారు. ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
కల్కిలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దుల్కర్ సల్మాన్, దిశా పటానీ వంటి తదితరులు నటించారు. ఈ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెర కెక్కిన ఈ చిత్రం పలు భాషల్లో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. కోయంబత్తూరుకు చెందిన జయం ఆటోమోటివ్ సంస్థ సహకారంతో మహీంద్రా ఈ కారును డిజైన్ చేసింది.

ఈ సినిమాలో హీరో వినియోగించిన కారుకు బుజ్జి అని పేరు పెట్టారు. ప్రస్తుతం మనం వాడుతున్న కారు కంటే ఈ కారు కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో మొత్తం మూడు చక్రాలు ఉంటాయి. ప్రతి చక్రం చాలా పెద్ద పరిమాణంలో తయారు చేయబడింది. వెనుక చక్రం స్థూపాకార ఆకారంలో ఉండేలా డిజైన్ చేశారు. అందువలన, ఇది అన్ని వైపులా నుంచి తిరిగి దాడి చేసేలా రూపొందించబడింది.
ప్రస్తుతం ఈ కారును బెంగళూరులోని ఫోరం మాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. సినిమా విడుదల రోజు హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద దీనిని ప్రదర్శించారు. ఈ కారుని చూసిన ప్రభాస్ అభిమానులు, ఇతరులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ అనుభవాన్ని ప్రజలకు అందించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ, మాల్ యాజమాన్యాలతో కలిసి ప్రదర్శిస్తోంది. దీనిని ఎక్కడికి తీసుకెళ్లిన జనాలు ఆసక్తిగా చూస్తున్నారు.

దీని పొడవు 6075 మిమీ, వెడల్పు 3380 మిమీ, ఎత్తు 2186 మిమీలుగా కొలతలు ఉన్నాయి. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 180 మి.మీగా ఉంది. దీని మొత్తం బరువు 6 టన్నులు కావడం విశేషం. ఈ కారులో చాలా టెక్నికల్ ఫీచర్లను జోడించారు. ఈ కారు కోసం మొత్తం ఖరీదు రూ.8 కోట్లు ఖర్చు అయ్యాయి.
ఇది కేవలం సినిమాలో బొమ్మ కారుగానే లేదా కేవలం షో కేస్ కోసం తయారు చేసిన కారు కాదు. ఇది నిజంగా పనిచేసే కారు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారుగా అభివృద్ధి చేయబడింది. ఇద్దరూ ఒకేసారి ఈ కారులో ప్రయాణించవచ్చు. 2 సీటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. కారు ముందు అద్దం ఫైటర్ పైలట్ వంటి విమానాల్లో ఉపయోగించేలా రూపొందించారు.

ఈ కారులో మొత్తం రెండు రకాల ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు. దీనిని కారు వెనుక చక్రానికి అమర్చారు. ఎలక్ట్రిక్ మోటార్ 47 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 126bhp పవర్ మరియు 9800nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఇన్-హౌస్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో నిర్మించబడింది. బ్యాటరీలను తొలగించి, మరో బ్యాటరీని జోడించి వాడుకోవచ్చు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








