జనాల్లోకి వచ్చిన కల్కి 'బుజ్జి' కారు..చూసి తరించి పోతున్న అభిమానులు.. ఇప్పుడు ఆ కారు ఎక్కడ ఉందో తెలుసా?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన సినిమా 'కల్కి 2898 AD'. ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలై పాజిటీవ్ టాక్‌తో దూసుకెళ్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి ప్యాన్‌ఇండియా స్టార్లు ఇందులో నటించారు. ఈ చిత్రంలో నటుడు ప్రభాస్ పోషించిన భైరవ పాత్రకు రైడర్‌గా ఈ ప్రత్యేక వెహికిల్‌ని రూపొందించారు. దీనికి 'బుజ్జి' అనే పేరు పెట్టారు. ఈ AI-ఆధారిత స్పెషల్లీ డిజైన్డ్ వెహికిల్ బ్యాట్‌మాన్ బాట్‌మొబైల్ మరియు ఐరన్ మ్యాన్ జార్విస్‌లను గుర్తుకు వచ్చేలా తయారు చేశారు. దీనికి సంబంధించిన టీజర్ విడుదల దగ్గర నుంచి ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే బుజ్జి అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
ఈ సినిమా నేడు (27-జూన్-2024)న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ బయట ఈ జెయింట్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ని ప్రదర్శించారు. సినిమా లవర్స్‌తో పాటు వేలాది మంది కారు ఔత్సాహికులను ఈ కారు ఆకర్షిస్తోంది. సినిమాలో అలరించిన ప్రభాస్ కారుని చూస్తూ జనాలు, ప్రభాస్ అభిమానులు ఉప్పొంగిపోయారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

ఈ కారుని చూసిన ప్రతి ఒక్కరూ ఇది జర్మనీ లేదా జపాన్‌లో తయారు చేయించి తీసుకువచ్చారని అనుకుంటారు. అలా అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే. ఎందుకంటే ఈ కారుని పూర్తిగా మన ఇండియాలోనే తయారు చేశారు. ఈ కారుని మహీంద్రా మోటార్స్ & జయం మోటార్స్ సంయుక్తంగా తయారు చేశాయి. తమిళనాడులోని కోయంబత్తూరులోని మహీంద్రా ప్లాంట్‌లో ఈ కారుని పూర్తి స్థాయిలో తుది మెరుగులు దిద్దుకుంది. ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
రూ. 7 కోట్లతో ఈ కారుని మహీంద్రా తయారు చేసింది. సాధారణ కార్లలా కాకుండా బుజ్జికి ముందు భాగంలో రెండు పెద్ద టైర్లు, వెనుక మరో భారీ టైర్‌తో డిఫరెంట్ స్టైల్‌లో స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. బుజ్జి ముందు టైర్ రిమ్ పరిమాణం 34.5 ఇంచెస్.. పొడవు 6075 mm, వెడల్పు 3380 mm మరియు ఎత్తు 2186 mmగా ఉంది.

బుజ్జి ఒక ఎగిరే కారు సైన్స్ ఫిక్షన్ కారుగా ఉంది. దీనిని మొదట ఆవిష్కరించినప్పటి నుండి కల్కి అభిమానులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఈ కారు ఒక మినీ బస్సు పరిమాణంలో ఉంటుంది. మూడు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు, రెండు మీటర్లకు పైగా ఎత్తు మరియు దాదాపు ఆరు టన్నుల బరువుని కలిగి ఉంది. దేశంలో లభించే కార్ల బరువుతో పోల్చితే దీని బరువు ఐదు రెట్లు ఎక్కువ.
ఈ వాహనంలో పై భాగం పూర్తిగా గ్లాస్ బాడీ, సింగిల్ డ్రైవర్ సీటు కూడా ఉన్నాయి. 47-కిలోవాట్ బ్యాటరీతో నడిచే బుజ్జి మంచి యుద్ధ సమయాల్లోనూ భారీ ప్రదర్శన చేయగలదు. ఈ బుజ్జి 125 bhp గరిష్ట శక్తిని మరియు 9,800 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. గంటకు 45 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








